MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • రైతు రుణమాఫీ మాదిరే మహిళలకూ రూ.2 లక్షల రుణమాఫీ ...

రైతు రుణమాఫీ మాదిరే మహిళలకూ రూ.2 లక్షల రుణమాఫీ ...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నారు. అయితే తాజాగా మహిళలకు కూడా రుణమాఫీ ప్రకటించారు. ఈ రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందంటే... 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 25 2024, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Revanth Reddy

Revanth Reddy

Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్ 2024-25 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూపొందించిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. కొద్దిరోజులుగా ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేసి బడ్జెట్ ను రూపొందించారు. ఈ బడ్జెట్ కు ఇవాళ రేవంత్ కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు.  రూ.2,91,159 కోట్ల రూపాయలను రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు పాలనా పరమైన అంశాలకోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన  వ్యయం రూ.33,487 కోట్లు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీ ముందుంచారు భట్టి విక్రమార్క. 

36
Revanth Reddy

Revanth Reddy

ఈ బడ్జెట్ లో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ భారీ నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా పేర్కొన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాటలనే స్పూర్తిగా తీసుకున్నామని అన్నారు. ఇందులో భాగంగానే 63 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'ఇందిరా మహిళా శక్తి' పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ పథకం కింద లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. 

46
Revanth Reddy

Revanth Reddy

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామని... బ్రాండింగ్,మార్కెటింగ్ శిక్షణ ఇస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ఏటా 5వేల గ్రామీణ సంఘాలు లేదా ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఐదేళ్లలో 25 వేల సంస్థలకు ఈ లబ్ది చేకూరుతుందని రేవంత్ సర్కార్ వెల్లడించింది. 

56
Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణభీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఎవరైనా సభ్యురాలు చనిపోతే ఆమె పేరిట వున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇలా గరిష్టంగా రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసి ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఇలా మహిళల రుణమాఫీ కోసం రూ.50.41 కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. 
 

66
bhatti vikramarka

bhatti vikramarka

ఇక మహిళా సహాయక సంఘాలకు కూడా ఈ ఏడాది రూ.20 వేల కోట్లకు తగ్గకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.ఇలా వచ్చే ఐదేళ్లలో లక్షకోట్ల వడ్డీలేని రుణాలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తామని తెలిపారు. ఈ నిధులు మైక్రో, స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళలు పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగేందుకు అవకాశం కల్పిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image2
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Recommended image3
మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved