వాట్సాప్‌లో చాటింగ్ మరింత ఫన్నీ.. కొత్త ఫీచర్ వచ్చింది.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే..?
సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఎలాంటి మెసేజ్‌కైనా ఈజీగా రిప్లయ్ చేయవచ్చు. అయితే ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాగే ఉంటుంది.
Meta ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ లో ఈ కొత్త ఫీచర్స్ వచ్చాయి. యూజర్లు ఇప్పుడు రిప్లయ్ చేయడానికి హార్ట్ ఎమోజీ కోసం రెండుసార్లు నొక్కడం ద్వారా సెండ్ చేయవచ్చు.
ఈ లేటెస్ట్ WhatsApp ఫీచర్‌తో యూజర్లు ఇకపై ఏదైనా మెసేజ్ రిప్లయ్ చేయడానికి ఎక్కువగా టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా మెసేజ్‌పై రెండుసార్లు నొక్కితే హార్ట్ ఎమోజితో రిప్లయ్ జరుగుతుంది. కానీ థంబ్స్ అప్ లేదా మరేదైనా ఎమోజీ కోసం మీరు పాత పద్ధతిని ప్రయత్నించాలి.
ఆండ్రాయిడ్ బీటా యాప్‌లో కొత్త వాట్సాప్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. WABetaInfo నివేదిక ప్రకారం, కొత్త డబుల్ ట్యాప్ ఫీచర్ WhatsApp Android బీటా వెర్షన్ 2.24.16.7లో చూడవచ్చు. త్వరలో ఈ ఫీచర్ అందరికి యాప్‌లో అందుబాటులోకి వస్తుంది. అయితే, ప్రస్తుతం కొత్త ఫీచర్‌ని డిసేబుల్ చేసే ఆప్షన్ లేదు అలాగే పాత చాట్ హిస్టరీలో మెసేజ్ చదువుతున్నప్పుడు యూజర్ అనుకోకుండా రెండు సార్లు నొక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి, సాధారణ వాట్సాప్ వినియోగదారుల కోసం రూపొందించిన డబుల్ ట్యాప్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు.
గత కొన్ని వారాలుగా WhatsApp అనేక కొత్త ఫీచర్ల గురించి సమాచారం వెలుగులోకి వచ్చింది. వీటిలో స్టేటస్ అప్‌డేట్ రీషేరింగ్ కోసం ప్రత్యేక బటన్, షేర్ నియర్ బై వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వారి చుట్టూ ఉన్న యూజర్లతో ఫైల్స్ షేర్ చేయవచ్చు.