- Home
- Technology
- Ok Google: ఓకే గూగుల్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది..? దీని వల్ల ఎంత ఉపయోగమో తెలుసా ?
Ok Google: ఓకే గూగుల్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది..? దీని వల్ల ఎంత ఉపయోగమో తెలుసా ?
నేటి యుగంలో టెక్నాలజి ఎంతగానో అభివృద్ధి చెందింది, ఇప్పుడు మీరు మీ వాయిస్ ఆధారంగా ఏ పనినైనా చేయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అలెక్సా వంటి టూల్స్ లాంచ్ చేసినపుడు గూగుల్ కూడా వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ ప్రారంభించింది. దీని పేరు Google అసిస్టెంట్ అంటే OK Google అని చెప్పడం ద్వారా పని చేస్తుంది. అయితే OK Google గురించి పూర్తి సమాచారం మీకోసం..

OK Google అంటే ఏమిటి?
OK Google అనేది సెర్చ్ ఇంజన్ Google పర్సనల్ ఆసిస్టంట్ సర్వీస్. ఓకే గూగుల్ అని చెప్పడం ద్వారా మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ను తాకకుండా చాలా పనులు చేయవచ్చు. ఎవరికైనా కాల్స్ చేయడం, మెసేజ్ కంపోజ్ చేయడం, అలారం సెట్ చేయడం, యాప్స్ ఓపెన్ చేయడం మొదలైనవి ఉన్నాయి. Google అసిస్టెంట్‌ని ఉపయోగించడానికి, మీరు మీ ఫోన్‌లో Google యాప్‌ను కనుగొనవల్సి ఉంటుంది. మీకు అలాంటి యాప్ లేకపోతే, Google Play Store నుండి Google యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొవచ్చు.
OK Googleని ఎలా సెట్ చేయాలి
ఇప్పుడు Google యాప్‌ని తెరిచి పైన ఎడమవైపుకి వెళ్లి మెను ఐకాన్‌పై క్లిక్ చేసి వాయిస్‌ని ఎంచుకోండి. ఇక్కడ మీరు OK Google డిటెక్షన్‌ని కనుగొంటారు, దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు Google యాప్ నుండి లేదా ఏదైనా స్క్రీన్ ముందు ఉన్న ఆప్షన్ ఆన్ చేయాలి. ఇక్కడ మీరు OK Google అని మూడు సార్లు చెప్పాలి, అప్పుడు అది మీ వాయిస్‌ని గుర్తించగలదు. ఈ సెట్టింగ్ పూర్తయిన తర్వాత, OK Google అని చెప్పడం ద్వారా మీరు మీ మొబైల్ ఫోన్ నుండి చాలా పనులను సులభంగా చేయవచ్చు.
Google అసిస్టెంట్ ఎలా పని చేస్తుంది?
Google అసిస్టెంట్ సహాయంతో మీ పని చాలా సులభం అవుతుంది. మీరు వాయిస్ ఇవ్వడం ద్వారా ఎవరికైనా కాల్ చేయవచ్చు. మీరు మెసేజ్ వాయిస్ ద్వారా పంపవచ్చు. అలారం సెట్ చేయవచ్చు. అంతేకాకుండా, రిమైండర్‌లను కూడా సెట్ చేయవచ్చు. అలాగే క్యాలెండర్‌కు ఈవెంట్‌లను యాడ్ చేయడం నుండి మీరు మీ రాబోయే బిల్లు గురించి సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఇంకా మీరు వాతావరణ అప్ డేట్స్, ఇతర దేశాల టైం, సినిమాలు లేదా మ్యూజిక్ మొదలైన వాటి గురించి కూడా సమాచారాన్ని పొందవచ్చు.