వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై ఇండియాలో భలే ఆఫర్.. ఈ అవకాశం కొద్దిరోజులు మాత్రమే...

First Published Feb 25, 2021, 2:36 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ వివో వి 20 ఎస్‌ఇపై  భారతదేశంలో  డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. వివో వి20 ఎస్‌ఇని ఇప్పుడు వెయ్యి రూపాయల తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తరువాత వివో వి 20 ఎస్ఇ ధర రూ .19,990కే పొందవచ్చు, అంతకుముందు దీని అసలు ధర రూ .20,990.