ట్విట్టర్ కొత్త ఫీచర్: ఇప్పుడు మీరు టిక్ టాక్ లాంటి వీడియోలను క్రియేట్ చేయవచ్చు.. ఎలా అంటే ?
యూజర్ల జనాదరణ పొందేందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకోస్తూనే ఉంటుంది. తాజాగా వినియోగదారుల అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి ట్విట్టర్ యాప్(twitter app) కోసం ఒక ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీన్ని ఉపయోగించి ఫోటోలు, వీడియోల ద్వారా ట్వీట్‌లకు రిట్వీట్ చేయవచ్చని నివేదించింది.
ఈ ఫీచర్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్(reels) వంటి వీడియోలు ఇంకా ఫోటోలను చూపుతుంది. ఈ ఫీచర్ పేరు 'కోట్ ట్వీట్ విత్ రియాక్షన్' దీనిని రీట్వీట్ మెనులో అందుబాటులో ఉంటుంది. మీరు రీట్వీట్ మెనుకి వెళ్లినప్పుడు మీకు ఈ ట్యాబ్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయడం ద్వారా ఫోటో లేదా వీడియోతో ఒరిజినల్ ట్వీట్‌ని ఎంబెడ్ ట్వీట్‌కు రిప్లయి ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రస్తుతం, ట్విట్టర్ ఈ కొత్త ఎక్స్‌ప్లోర్ ట్యాబ్ ఫీచర్‌ను గత ఏడాది డిసెంబర్‌లో కొన్ని దేశాల్లో విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ గురించి ఎంటో తెలుసుకుందాం...
సింపుల్ గా చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్ (instagram)రీల్, టిక్‌టాక్‌లను అనుసరిస్తూ కోట్ ట్వీట్ విత్ రియాక్షన్ అనే కొత్త టూల్ ని ట్విట్టర్ పరీక్షించింది, ఇప్పుడు వినియోగదారులు టెక్స్ట్‌లో రిప్లయ్ ఇవ్వడానికి బదులుగా ఫోటో లేదా వీడియోని ట్వీట్ కాపీకి ఎంబెడ్ చేయవచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఐఓఎస్ లో పరీక్షించబడుతోంది.
గత సంవత్సరం ట్విట్టర్ ఫ్లీట్స్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లాగానే ఉంటుంది, దీనిలో వినియోగదారులు ఫోటోలు లేదా వీడియోలతో ఫ్లీట్‌లను క్రియేట్ చేయవచ్చు ఇంకా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లాగా 24 గంటల తర్వాత ఈ ఫ్లీట్‌లు అదృశ్యమవుతాయి. అయితే, ట్విట్టర్ ఈ ఫీచర్ ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత నిలిపివేసింది.