- Home
- Technology
- Top 5G Phones Under Rs 15000: ఐక్యూ నుంచి సామ్‌సంగ్ వరకు.. రూ.15,000లోపు టాప్-5 బెస్ట్ 5G ఫోన్లు
Top 5G Phones Under Rs 15000: ఐక్యూ నుంచి సామ్‌సంగ్ వరకు.. రూ.15,000లోపు టాప్-5 బెస్ట్ 5G ఫోన్లు
Top 5G Phones Under Rs 15000: ఆగస్టు నెలలో రెడ్మీ, టెక్నో, ఐక్యూ, ఇన్ఫినిక్స్, సామ్ సంగ్ ల నుంచి రూ.15,000లోపు మంచి స్పెసిఫికేషన్స్ లో 5జీ ఫోన్లు విడుదల అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 15,000లోపు టాప్ 5G స్మార్ట్‌ఫోన్లు
భారత్ లో రూ.15,000 వరకు ధర ఉన్న ఫోన్ మార్కెట్ అనేది మిడిల్-బడ్జెట్ వినియోగదారులకు కీలక విభాగం. 5G, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్లు వంటి వాటిని అందించే ఫోన్ల సంఖ్య ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం చాలా పెరిగింది. రూ.15,000లో 5G సపోర్ట్ ఉన్న బెస్ట్ ఫోన్లు చాలానే ఉన్నాయి.
KNOW
1. రెడ్మీ నోట్ 14 SE 5G (Redmi Note 14 SE 5G)
రెడ్మీ నోట్ 14 SE 5G మోడల్ తాజాగా విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 2,100 నిట్స్ బ్రైట్‌నెస్, గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది.
రెడ్మీ నోట్ 14 SE 5G ముఖ్య ఫీచర్లు:
- ప్రాసెసర్: Dimensity 7025 Ultra
- కెమెరాలు: 50MP (మెయిన్) + 8MP (అల్ట్రా వైడ్) + 2MP (మ్యాక్రో)
- ఫ్రంట్ కెమెరా: 20MP
- బ్యాటరీ: 5,110mAh, 45W ఫాస్ట్ చార్జింగ్
- ధర: రూ.14,999
- కలర్స్: క్రిమ్సన్ రెడ్, మిస్టిక్ వైట్, టిటాన్ బ్లాక్
2. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G (Infinix Note 50X)
ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ నోట్ సిరీస్ ఫోన్ ఇది. Dimensity 7300 Ultimate ప్రాసెసర్, AI ఆధారిత ఫీచర్లు, 50MP కెమెరాతో వస్తోంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.67 అంగుళాల HD+ LCD, 120Hz
- ర్యామ్: 6GB/8GB, స్టోరేజ్: 128GB
- కెమెరాలు: 50MP రియర్, 8MP ఫ్రంట్
- బ్యాటరీ: 5,500mAh, 45W
- ధర: రూ. 11,499 (6GB), రూ. 12,999 (8GB)
- కలర్స్: ఎన్‌చాంటెడ్ పర్పుల్, గ్రీన్, గ్రే
3. టెక్నో పోవా 7 5G (Tecno Pova 7 5G)
టెక్నో పోవా 7 5G అనేది కొత్త పోవా 7 సిరీస్‌లో లోయర్-ఎండ్ వేరియంట్. ఈ హ్యాండ్‌సెట్ USP వెనుక భాగంలో కొత్త మల్టీ-ఫంక్షనల్ డెల్టా లైట్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. మీకు నథింగ్ ఫోన్‌లలో కనిపించే గ్లిఫ్ లైట్ల మాదిరిగానే ఉంటుంది. 144Hz రిఫ్రెష్‌రేట్ ఉన్న 6.78 అంగుళాల LTPS డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీతో ఇది వస్తుంది.
టెక్నో పోవా 7 5G ఫీచర్లు:
- ప్రాసెసర్: Dimensity 7300 Ultimate
- కెమెరాలు: 50MP (మెయిన్), 13MP ఫ్రంట్
- బ్యాటరీ: 6000mAh, 45W వయర్డ్ + 30W వైర్లెస్ చార్జింగ్
- ధర: రూ. 14,999 (8GB+128GB), రూ. 15,999 (8GB+256GB)
- కలర్స్: గీక్ బ్లాక్, మేజిక్ సిల్వర్, ఓసిస్ గ్రీన్
4. ఐక్యూ Z10x 5G (iQOO Z10x 5G)
iQOO సంస్థ నుంచి వచ్చిన తాజా Z సిరీస్ ఫోన్ ఇది. 6.7 అంగుళాల LCD డిస్‌ప్లే, Dimensity 7300 చిప్‌సెట్, 6500mAh బ్యాటరీతో వస్తుంది.
ఐక్యూ Z10x 5G ఫీచర్లు:
- కెమెరాలు: 50MP (మెయిన్) + 2MP బోకే, 8MP ఫ్రంట్
- ర్యామ్: 6GB/8GB, స్టోరేజ్: 128GB/256GB
- బ్యాటరీ: 6,500mAh, 44W
- ధర: రూ. 13,499 (6GB), రూ. 14,999 (8GB+128GB), రూ. 16,499 (8GB+256GB)
- కలర్స్: అల్ట్రామరిన్, టిటానియం
5. సామ్‌సంగ్ గెలాక్సీ M16 5G (Samsung Galaxy M16 5G)
సామ్‌సంగ్ గెలాక్సీ M16 5G Dimensity 6300 చిప్‌సెట్, Super AMOLED డిస్‌ప్లే (6.7 అంగుళాలు), 5000mAh బ్యాటరీతో వచ్చింది.
సామ్‌సంగ్ గెలాక్సీ M16 5G ఫీచర్లు:
- కెమెరాలు: 50MP + 5MP + 2MP, 13MP ఫ్రంట్
- ర్యామ్: 4GB/6GB/8GB, స్టోరేజ్: 128GB
- బ్యాటరీ: 5,000mAh, 25W
- ధర: రూ. 12,499 (4GB), రూ. 13,999 (6GB), రూ. 15,499 (8GB)
- కలర్స్: బ్లష్ పింక్, మింట్ గ్రీన్, థండర్ బ్లాక్