Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Technology
  • సోనీ అత్యంత కాస్ట్లీ టీవీ.. దీని ధర ఇండియాలో ఎంతో తెలుసా..?

సోనీ అత్యంత కాస్ట్లీ టీవీ.. దీని ధర ఇండియాలో ఎంతో తెలుసా..?

గత మూడు సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం షియోమీ, రియల్ మీ, వన్ ప్లస్ వంటి కంపెనీలు  భారతదేశంలోని స్మార్ట్ టి‌వి మార్కెట్‌లో గట్టి పట్టును సాధించాయి. కానీ సోనీ, స్యామ్సంగ్ వంటి కంపెనీలు ఇప్పటికీ ప్రీమియం పరిధిలో ఉన్నాయి.

asianet news telugu | Asianet News | Published : Sep 27 2021, 06:42 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ఇప్పుడు సోనీ ఒక కొత్త టీవీ సోనీ బ్రావియా ఎక్స్‌ఆర్ మాస్టర్ సిరీస్ 85జెడ్9జే 8కే ఎల్‌ఈ‌డి స్మార్ట్ టీవీని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది.  దీని ధర రూ .12,99,990.

24
Asianet Image

ఈ టీవీ స్క్రీన్ రిజల్యూషన్ 7680x4320 పిక్సల్స్. దీనికి ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్‌వేర్ ఇచ్చారు, దీనితో పాటు సోనీ ఎక్స్‌ఆర్ కాగ్నిటివ్ ప్రాసెసర్ కూడా ఉంది. సోనీ బ్రావియా ఎక్స్‌ఆర్ మాస్టర్  85జెడ్9జే 8కే టి‌వి సేల్ భారతదేశంలో కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం  ఆన్‌లైన్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.
 

34
Asianet Image

ఈ సోనీ టీవీలో 8కే రిజల్యూషన్ సపోర్ట్ ఉన్నందున మీరు నెక్స్ట్ జనరేషన్ కంటెంట్‌ను చూడగలుగుతారు. అయితే  8కే కంటెంట్ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేదు. ఈ సోనీ 85జెడ్9జే టి‌వి 8కే రేంజ్ స్యామ్సంగ్, ఎల్‌జి, హిసెన్స్ వంటి కంపెనీ టి‌విలతో పోటీపడుతుంది. ఇన్‌హౌస్ ప్రాసెసర్ గురించి సోనీ మెరుగైన వీక్షణ అనుభవాన్ని, మెరుగైన సరౌండ్ వీక్షణ ఉంటుందని ప్రకటించింది.
 

44
Asianet Image

సోనీ 85జెడ్9జే టి‌వికి హెచ్‌డి‌ఆర్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా గూగుల్ టి‌వి ఇంటర్‌ఫేస్‌ కూడా ఇచ్చారు. దీనితో పాటుగా గూగుల్ క్రోమ్ క్యాస్ట్, ఆపిల్ ఎయిర్ ప్లే కూడా దీనికి సపోర్ట్ ఇచ్చాయి. ఈ సోనీ టీవీలో 10 స్పీకర్లు ఉన్నాయి, దీని మొత్తం సౌండ్ ఉత్పత్తి 85W. ఇందులో రెండు మిడ్ రేంజ్ డ్రైవర్లు, 4 ట్వీటర్లు, నాలుగు సబ్ వూఫర్లు ఉన్నాయి. ఇంకా డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ కూడా ఉంది. టీవీలో 16జి‌బి స్టోరేజ్ లభిస్తుంది ఇంకా దీని రిఫ్రెష్ రేట్ అల్ట్రా హెచ్‌డి రిజల్యూషన్ వద్ద 120Hz ఉంటుంది.

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories