Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Technology
  • Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాడ్ కంటెంట్ వస్తుందా? అయితే ఇలా చేయండి!

Instagram: మీ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాడ్ కంటెంట్ వస్తుందా? అయితే ఇలా చేయండి!

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ యాప్ ను చూస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే దీని వల్ల ఎంత లాభం ఉందో నష్టం కూడా అంతే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫామ్‌లో చెడ్డ కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. మరీ ఈ కంటెంట్ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Kavitha G | Updated : Feb 28 2025, 04:03 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
12
Asianet Image

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ యాప్ వాడకం బాగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ యాప్ ను వాడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాడ్ కంటెంట్ ఎక్కువైపోయింది. వెబ్ సిరీస్, సినిమాల్లోని చెడు కంటెంట్‌ను రీల్స్ రూపంలో ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే?

దీనివల్ల చెడ్డ కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు పిచ్చి పిచ్చి రీల్సే కనబడుతున్నాయి. ఇలాంటి వాటిని పిల్లలు చూస్తే చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటిని కట్టడి చేయడం చాలా ముఖ్యం. కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో చెడ్డ కంటెంట్ రాకుండా చూసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

 

22
ఇన్‌స్టాగ్రామ్ లో సెట్టింగ్స్ మార్చుకోండిలా

ఇన్‌స్టాగ్రామ్ లో సెట్టింగ్స్ మార్చుకోండిలా

- ముందుగా మీరు ఫోన్‌లో Instagram అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.
- తర్వాత మీ ప్రొఫైల్‌ను తెరిచి, పైన కుడివైపున ఉన్న 'మూడు చుక్కలు' పై క్లిక్ చేయాలి.
-కిందికి స్క్రోల్ చేస్తే, మీకు సజ్జెస్టెడ్ కంటెంట్ వస్తుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
- దానిపై క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ డేటాను రిఫ్రెష్ చేయాలనుకుంటున్నారా? అని అడుగుతుంది.
- నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత, సూచించిన కంటెంట్‌ను రీసెట్ క్లిక్ చేయండి.

-ఆ తర్వాత మీరు మీ ప్రొఫైల్‌కు వెళ్లాలి. మీరు తర్వాత తిరిగి యాప్ ఓపెన్ చేసినప్పుడు, సెన్సిటివ్ కంటెంట్ ఎంపిక కనిపిస్తుంది.
* దానిపై క్లిక్ చేసి లెస్ ను ఎంపికను ఎంచుకోండి. అంతే, మీ ఇన్ స్టాగ్రామ్ రీసెట్ చేయబడుతుంది. అప్పుడు అభ్యంతరకరమైన కంటెంట్ పరిమాణం తగ్గుతుంది.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories