జియో కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్.. డిసెంబర్ 1 నుంచి అమలు.. రీఛార్జ్ పై రూ. 480వరకు ఆదా..
ముంబై, 28 నవంబర్ 2021: ప్రతి భారతీయుడు ట్రు డిజిటల్ లైఫ్(digital life) సాధికారత పొందిన టెలికాం(telecom) పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే దాని నిబద్ధతకు అనుగుణంగా, జియో(jio) ఈరోజు కొత్త ఆన్ లిమిటెడ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ ప్లాన్లు టెలికాం పరిశ్రమలో బెస్ట్ వాల్యుని అందిస్తాయి.
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. డిసెంబర్ 1 నుంచి జియో ప్లాన్ కొత్త ధరలు వర్తిస్తాయి. అంటే ఇప్పుడు జియో ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల ధరలు దాదాపు 20 శాతం పెరిగింది, దీంతో జియో ప్రీ-పెయిడ్ ప్లాన్ ప్రారంభ ధర రూ. 91కి చేరింది, అంతకుముందు దీని ధర రూ.75. డిసెంబరు 1లోపు రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు లాభం చేకూర్చనుంది. మీ ప్రస్తుత ప్లాన్ ముగిసిన వెంటనే కొత్త ప్లాన్ రిచార్జ్ చేసుకోవచ్చు దీంతో మీకు డబ్బు కూడా ఆదా అవుతుంది. జియో కొన్ని బెస్ట్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం...
రూ.129 ప్లాన్
జియో రూ.129 ప్లాన్ డిసెంబర్ 1 నుంచి రూ.155గా మారనుంది. ఇందులో మొత్తం 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో కంపెనీ చౌకైన ప్లాన్. మీరు డిసెంబర్ 1లోపు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
రూ. 199 ప్లాన్
జియో చౌకైన 28-రోజుల ప్రీ-పెయిడ్ ప్లాన్ రోజుకు 1.5 GB డేటాతో వస్తుంది. జియో రూ.199 ప్లాన్ డిసెంబర్ 1 నుండి రూ.239 అవుతుంది. ఈ ప్లాన్ తో రోజుకు 1.5 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 మెసేజ్‌లు లభిస్తాయి. మీరు డిసెంబర్ 1 ముందు ఈ రీఛార్జ్ చేసుకుంటే రూ. 40 ఆదా చేసుకోవచ్చు.
రూ. 399 ప్లాన్
జియో రూ. 399 ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో జియో చౌకైన ప్లాన్, అయితే డిసెంబర్ 1 నుండి ఈ ప్లాన్ కోసం రూ.479 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 1 ముందు రీఛార్జ్ చేయడం ద్వారా మీరు రూ. 80 ఆదా చేయవచ్చు.
రూ. 329 ప్లాన్
జియో రూ. 329 ప్లాన్ కస్టమర్లకు గిఫ్ట్ కంటే తక్కువ కాదు. 84 రోజుల వాలిడిటీ గల ఈ ప్లాన్ ఇప్పుడు రూ.395గా మారింది. ఇందులో మొత్తం 6 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 1000 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి. మీరు ఈ ప్లాన్‌పై రూ.66 ఆదా చేసుకోవచ్చు.
జియో రూ.555 ప్లాన్
రోజుకు 1.5 GB డేటాతో 84 రోజుల చెల్లుబాటుతో కంపెనీ చౌకైన ప్లాన్ రూ.555 ప్లాన్. డిసెంబర్ 1 నుంచి రూ.555 ప్లాన్ రూ.666 అవుతుంది. ఇందులో 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి. మీరు ఈ ప్లాన్‌తో రూ. 111 ఆదా చేసుకోవచ్చు.
జియో ఏడాది ప్లాన్
జియో ఒక సంవత్సర ప్లాన్ అత్యంత ఖరీదైనదిగా మారింది. ఇంతకుముందు ఈ ప్లాన్ రూ. 2,399కి అందుబాటులో ఉంది, అయితే డిసెంబర్ 1 నుండి కస్టమర్లు దీని కోసం రూ.2,879 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు అన్ని నెట్‌వర్క్‌లకు రోజుకు 2 GB డేటాతో అపరిమిత కాలింగ్, మెసేజింగ్ సౌకర్యాన్ని పొందుతారు. మీరు ఈ ప్లాన్‌పై రూ. 480 ఆదా చేసుకోవచ్చు.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ గురించి:
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫారమ్‌ల అనుబంధ సంస్థ 4G LTE టెక్నాలజితో ప్రపంచ-స్థాయి ఆల్-ఐపి డేటా స్ట్రాంగ్ ఫ్యూచర్ ప్రూఫ్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. మొబైల్ వీడియో నెట్‌వర్క్‌గా రూపొందించి, జన్మించిన ఏకైక నెట్‌వర్క్ జియో వాయిస్ ఓవర్ ఎల్‌టిఈ టెక్నాలజికి సపోర్ట్ చేస్తుంది. జియో ఫ్యూచర్ రెడీకి సిద్ధంగా ఉంది అలాగే 5G, 6G అంతకు మించిన వాటికి సులభంగా అప్‌గ్రేడ్ చేయవచ్చు.
మరింత సమాచారం కోసం సంప్రదించండి
Reliance Jio Infocomm
Jio.CorporateCommunication@ril.com
022-79653591