మీరు కూడా ఫోన్ కవర్ వాడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?
సెల్ ఫోన్ కొన్న వెంటనే చాలా మంది చేసే పనేంటంటే.. మంచి ఫోన్ కవర్(పౌచ్) కొని వేసేస్తారు. ఇది సెల్ ఫోన్ కి రక్షణ ఇస్తుందని అందరూ భావిస్తారు. కాని ఫోన్ కేస్ ల వల్ల చాలా డేంజర్ ఉందని మీకు తెలుసా? ఆ ప్రమాదాలు ఏమిటో తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సెల్ ఫోన్ కొనేటప్పుడు అందరూ నచ్చిన కలర్, డిజైన్ అన్నీ చూసుకొనే కొనుక్కుంటారు. కాని వెంటనే అవన్నీ కవర్ చేసేలా, అసలు ఏ కంపెనీ ఫోన్ కొన్నారో కూడా తెలియని ఫోన్ కేస్(ఫోన్ కవర్) లు కొని వేసేస్తారు. ఎందుకంటే.. ఫోన్ రక్షణ కోసం అంటారు. వాస్తవానికి సెల్ ఫోన్ తయారు చేసేటప్పుడే ఆయా కంపెనీలు స్ట్రాంగ్ గా ఉండాలని, మంచి బిల్డ్ క్వాలిటీతో తయారు చేస్తాయి.
నిజానికి ఫోన్ ను ఫోన్ లా వాడితే అసలు స్క్రీన్ గార్డ్, పౌంచ్ లు అవసరమే ఉండదు. కాని మన ఉరకల పరుగుల జీవితంలో సెల్ ఫోన్ ను చాలా హార్డ్ గా ఉపయోగించడం వల్ల అది తరచూ డామేజ్ అవుతుంది. అందుకే ఎందుకైనా మంచిదని ఓ మంచి ఫోన్ కవర్ వేసేస్తారు. కాని కొన్ని రకాల ఫోన్ ఫోన్ కవర్ల వల్ల సెల్ ఫోన్ ఇంటర్నల్ గా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
సెల్ ఫోన్లకు ఫోన్ కవర్ వేయడానికి ముఖ్య కారణాలు ఏంటంటే.. పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని, చేతిలోంచి జారిపోకుండా ఉంటుందని, చూడటానికి అందంగా ఉంటుందని ఫోన్ కవర్ లు వేస్తుంటారు. మహిళలైతే తమ వ్యక్తిత్వాన్ని తెలియజేసేలా రకరకాల డిజైన్లు, కీచైన్స్ కూడా వాటికి తగిలిస్తారు.
ఫోన్ రీసేల్ చేసినప్పుడు ఎక్కువ డబ్బులు రావాలంటే గీతలు, పగుళ్లు ఉండకుండా ఉండాలని ఫోన్ కవర్ వేస్తుంటారు.
సెల్ ఫోన్లను తరచూ సోఫాలు, మంచాలపై విసిరేస్తుంటారు. టైట్ జీన్స్ ప్యాంట్లో ఇరికించి పెట్టేసుకుంటారు. హ్యాండ్ బ్యాగ్ లలో అడుగున పెట్టేసి దానిపై రకరకాల బరువైన వస్తువులు వేసేస్తారు. ఇలా చేయడం వల్ల సెల్ ఫోన్ లో ఇంటర్నల్ గా ఉండే సర్క్యూట్స్ దెబ్బతింటాయి. అందుకే ఫోన్ సడన్ గా స్లోగా వర్క్ చేస్తుంది. మళ్లీ దానికదే బాగానే పనిచేస్తుంది. సెల్ ఫోన్లు ఒత్తుకుపోయి ఉండటం వల్ల పవర్, వాల్యూమ్ బటన్స్ నొక్కుకుపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇలాంటి సమస్యలు రాకూడదనే ఒక మంచి ఫోన్ కేస్(పౌచ్) కొని వేసేస్తారు. కాని కొన్ని ఫోన్ కేస్ ల వల్ల సెల్ ఫోన్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ల నుంచి హీట్ బయటకు వస్తుంది. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే వస్తువును బట్టి ఉంటుంది. సెల్ ఫోన్లు కూడా హీట్ ను రిలీజ్ చేస్తాయి. అయితే ఫోన్ ను పూర్తిగా కవర్ చేస్తూ, ముఖ్యంగా బ్యాటరీ ఉండే పార్ట్ ను కవర్ చేస్తూ ఫోన్ కేస్ వేయడం వల్ల వేడి లోపలే ఉండిపోతుంది.
దీని వల్ల బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. ఇంటర్నల్ గా ఉండే సర్క్యూట్స్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ కాలం ఇలా బ్యాటరీలో వేడి ఉండిపోతే బ్యాటరీ ఉబ్బిపోయి పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇప్పుడు ఎక్కువగా వైర్ లెస్ ఛార్జర్లు వస్తున్నాయి. ఫోన్ కవర్ ఉంటే ఛార్జింగ్ సరిగా ఎక్కదు. కొన్ని వైర్ లెస్ ఛార్జర్లు ఉపయోగించాలంటే ఫోన్ కవర్ తీసి ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి.
ఫోన్ కవర్ ఉండటం వల్ల సెల్ ఫోన్లు జేబుల్లో పట్టవు. ఇలా జేబులో పెట్టేటప్పుడు జారి కింద పడిపోవచ్చు. చూడటానికి కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. ఫోన్ కవర్ లేకపోతే సింపుల్ గా జేబులో ఉండిపోతాయి.
మీకు తెలుసా? ఇండియాలోనే ఫోన్ కవర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. కాని చాలా దేశాల్లో ఫోన్ కవర్లు వాడరు. పైన తెలిపిన విషయాలే దీనికి కారణం.