MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ : నేటి నుంచే నుంచే ప్రీ-ఆర్డర్స్, ధర, ఫీచర్స్, డిస్కౌంట్ తెలుసుకొండి..

ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ : నేటి నుంచే నుంచే ప్రీ-ఆర్డర్స్, ధర, ఫీచర్స్, డిస్కౌంట్ తెలుసుకొండి..

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్  ఐఫోన్ 13 , ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీలను నేటి నుంచి అంటే సెప్టెంబర్ 17 నుండి భారతదేశంతో సహా ఇతర దేశాలలో ఉన్నావారు ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. 

3 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Sep 17 2021, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అంతేకాకుండా ఈ కొత్త సిరీస్ ఐఫోన్‌లో చాలా ఇతర మార్పులు చేశారు. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీలను ఈ రోజు సాయంత్రం 5:30 నుండి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు అలాగే సేల్స్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమవుతాయి. మీరు ఆపిల్  అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇతర ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల నుండి కొత్త  సిరీస్ ఐఫోన్‌లను ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారతదేశంలో ఐఫోన్ 13 సిరీస్ ధర

భారతదేశంలో ఐఫోన్ 13 సిరీస్ ధర

ఐఫోన్ 13 మినీ 128జి‌బి వేరియంట్ ధర రూ. 69,900, 256జి‌బి వేరియంట్ ధర రూ .79,900, 512జి‌బి వేరియంట్ ధర రూ .99,900. ఐఫోన్ 13 128జి‌బి వేరియంట్ ధర రూ. 79,900, 256జి‌బి వేరియంట్ ధర రూ. 89.900, 512జి‌బి వేరియంట్ ధర రూ .1,09,900.  ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ 1టి‌బిని స్టోరేజ్‌తో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది.

36

ఐఫోన్ 13 ప్రో 128జి‌బి వేరియంట్ ధర రూ .1,19,900, 256జి‌బి వేరియంట్ ధర రూ .1,29,900, 512జి‌బి వేరియంట్ ధర రూ .1,49,900, 1 టి‌బి స్టోరేజ్ మోడల్ ధర రూ .1,69,900. ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ 128 జి‌బి వేరియంట్ ధర రూ .1,29,900, 256జి‌బి వేరియంట్ ధర రూ .1,39,900, 512జి‌బి వేరియంట్ ధర రూ .1,59,900, 1 టి‌బి స్టోరేజ్ మోడల్ ధర రూ .1,79,900. విశేషం ఏంటంటే ఆపిల్ తయారు చేసిన అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇది.

ఆపిల్  అధికారిక స్టోర్ నుండి ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీని ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులు హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ కార్డులపై రూ. 6,000 క్యాష్‌బ్యాక్, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ పై  రూ.5,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

46
ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ స్పెసిఫికేషన్‌లు

ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ స్పెసిఫికేషన్‌లు

ఈ కొత్త సిరీస్ అన్ని ఐఫోన్లలో 6 కోర్ సి‌పి‌యూతో ఏ15 బయోనిక్ ప్రాసెసర్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ 16 కోర్ న్యూరల్ ఇంజిన్ కలిగి ఉంది. యాపిల్ ర్యామ్, బ్యాటరీ గురించి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీలో 512 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉండగా, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో 1 టిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది. యాపిల్ ఐఫోన్‌లలో 1టి‌బి స్టోరేజీని ఇవ్వడం ఇదే మొదటిసారి. పాత ఐఫోన్ మోడల్ తో పోలిస్తే ఈ కొత్త సిరీస్ అన్ని ఐఫోన్‌లలో నాచ్ తగ్గించారు. ఐఫోన్ 13 మినీ 5.4-అంగుళాలు, ఐఫోన్ 13 లో 6.1-అంగుళాల రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉన్నాయి.
 

56

ఐఫోన్ 13 ప్రోలో 6.1-అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 13 ప్రో మాక్స్ 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌  కలిగి ఉంటాయి, వీటిని 10Hz నుండి 120Hz మధ్య అడ్జస్ట్ చేయవచ్చు. మినీ ఇంకా ప్రధాన మోడల్స్ బ్రైట్ నెస్ 1000 నిట్స్ వరకు ఉంటుంది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో బ్రైట్ నెస్ 1200 నిట్స్ వరకు ఉంటుంది.  

ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ సింగిల్ ఫ్లాట్ ఎడ్జ్ అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్, డిస్‌ప్లేలో సిరామిక్ డాలు. అన్ని ఐఫోన్లు వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ కోసం ఐ‌పి68 రేట్ పొందాయి. అన్ని ఐఫోన్‌లు పింక్, బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, ప్రొడక్ట్ రెడ్ కలర్‌లలో లభిస్తాయి. ఐఫోన్ 13 ప్రోలో సర్జికల్ గ్రేడ్ అల్యూమినియం గ్రేడ్ ఉపయోగించారు.
 

66
ఐఫోన్ 13 సిరీస్ కెమెరా

ఐఫోన్ 13 సిరీస్ కెమెరా

ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీలో 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇప్పుడు ఒక కొత్త వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు, దీని ఎపర్చరు f/1.6 ఉంది. దీనికి సెన్సార్ ఆప్టికల్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ ఉంది. నైట్ మోడ్ పాత మోడల్స్ కంటే మెరుగ్గా చేశారు. రెండవ లెన్స్ కూడా 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ దీని ఎపర్చరు f/2.4 ఉంది. ఐఫోన్ 13 ప్రో మోడల్‌లో 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అన్ని ఐఫోన్‌ల ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్స్. 3X ఆప్టికల్ జూమ్‌తో 77ఎం‌ఎం టెలిఫోటో లెన్స్ ఉంది. అంతే కాకుండా అల్ట్రా వైడ్ కెమెరా,  మాక్రో లెన్స్ కూడా ఉంది. కొత్త సిరీస్ అన్ని ఐఫోన్‌లు 5కి సపోర్ట్ తో వస్తున్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart TV: స్మార్ట్ టీవీని గోడకు అమర్చాలా.? టేబుల్‌పై పెట్టాలా.? ఏది బెస్ట్ ఆప్ష‌న్.?
Recommended image2
Zero Watt Bulb : జీరో వాట్ బల్బ్ వేస్తే కరెంట్ బిల్లు రాదా? అసలు కథేంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image3
Internet Trends: భార‌తీయులు ఇంట‌ర్నెట్‌లో ఎక్కువ‌గా ఏం వెతుకున్నారు.? టాప్‌10 లిస్ట్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved