MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఇండియాలో ఒక సాధారణ వ్యక్తి ఐఫోన్ 13 కోనాలంటే ఎన్ని రోజులు పని చేయాలో తెలుసా..?

ఇండియాలో ఒక సాధారణ వ్యక్తి ఐఫోన్ 13 కోనాలంటే ఎన్ని రోజులు పని చేయాలో తెలుసా..?

క్యుపెర్టినో దిగ్గజం, స్మార్ట్  ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ కొత్త స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 13 ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దీని ధర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆపిల్ కొత్త మోడల్ ధరను ఐఫోన్ 12 సిరీస్ మోడల్‌తో సమానంగా ఉంచడం ద్వారా తగ్గించడానికి ప్రయత్నించింది. స్మార్ట్ ఫోన్‌పై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకునే వారు చాలా ఎక్కువ.   

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Sep 25 2021, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

భారతదేశంలో ఐఫోన్ 13  బేస్ మోడల్ (128జి‌బి) ధర రూ .79,900. ఈ సిరీస్‌లో చౌకైన మోడల్ ఐఫోన్ 13 మినీ 128జి‌బి వేరియంట్ కొనుగోలు ధర రూ. 69,900. భారతదేశంలో ఆవరేజ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల ప్రకారం ఐఫోన్ 13 ధర చాలా ఎక్కువ అని స్పష్టమవుతోంది. చాలా మంది ప్రజలు ఇంత ఖరీదైన ఫోన్ కొనడానికి ఇష్టపడరు ఇంకా కేవలం 15 ధరకే స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఇష్టపడతారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రతి దేశంలో ఐఫోన్ ఖరీదైనది కాదు

ప్రతి దేశంలో ఐఫోన్ ఖరీదైనది కాదు

అయితే ప్రతి దేశంలో ఐఫోన్ ధర ఒకేలా ఉండదు. దీనికి ఒక కారణం ఏమిటంటే కొత్త ఐఫోన్‌ల ధర వివిధ దేశాలలో విభిన్నంగా ఉంటుంది. ఐఫోన్ ధర అత్యధికంగా ఉన్న దేశాలలో ఇండియా కూడా ఒకటి. దీనికి అధిక దిగుమతి పన్ను కారణమని చెప్పవచ్చు. ఐఫోన్‌ను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసే దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఐఫోన్ 13 బేస్ మోడల్ ధర అమెరికాలో  799 డాలర్లు అంటే సుమారు రూ .59 వేలు మాత్రమే.

35

కానీ అమెరికా వంటి దేశాలలో ఐఫోన్‌లు చౌకగా ఉండటానికి మరో కారణం కూడా ఉంది. దీనికి కారణం అక్కడి దేశ పౌరుల సగటు సంపాదన. కొత్త ఐఫోన్‌ల ధరలను చూసి వివిధ దేశాల్లోని వ్యక్తుల సగటు ఆదాయాలను ఒక కొత్త నివేదిక పోల్చింది. ఈ నివేదికలోని డేటా చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఒక వ్యక్తి కొత్త ఐఫోన్ కొనడానికి వివిధ దేశాలలో ఎన్ని గంటలు పని చేయాల్సి ఉంటుందో ఈ నివేదికలో తెలిపింది. 
 

45

అమెరికాలో ఆరు గంటల పాటు 
ఈ  రీసర్చ్ మనీ సూపర్ మార్కెట్ ద్వారా జరిగింది. కొత్త ఐఫోన్ 13 కొనేందుకు డబ్బు సంపాదించడానికి యుఎస్‌లో సగటున సంపాదిస్తున్న వ్యక్తి 49.5 గంటలు పని చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. అమెరికాలో సగటున సంపాదిస్తున్న వ్యక్తి ఐఫోన్  కొత్త మోడల్ కొనడానికి సుమారు ఆరు రోజులు పని చేయల్సి ఉంటుంది.

లక్సెంబర్గ్, సింగపూర్, నార్వే, ఆస్ట్రేలియా, హాంకాంగ్ వంటి దేశాలలో సగటు సంపాదిస్తున్న వ్యక్తి  ఐఫోన్ 13 కొనడానికి ఐదు నుండి ఎనిమిది రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, సింగపూర్‌లో సగటున సంపాదిస్తున్న వ్యక్తి కేవలం 34.3 గంటలు అంటే దాదాపు మూడు రోజులు పని చేయడం ద్వారా కొత్త ఐఫోన్ కొనడానికి తగినంత డబ్బు సంపాదించవచ్చు. అయితే, ఈ నివేదికలో భారతదేశం గురించి కొంత భిన్నంగా కనిపిస్తుంది. 

55
భారతదేశంలో

భారతదేశంలో

దీని ప్రకారం, భారతదేశంలో సగటు సంపాదన కలిగిన వ్యక్తి కొత్త ఐఫోన్ కొనడానికి 724.2 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు 30 రోజుల వ్యవధి. ప్రతిరోజు ఎనిమిది గంటల షిఫ్ట్ అనుకుంటే, ఒక సగటు సంపాదిస్తున్న వ్యక్తి భారతదేశంలో ఐఫోన్ 13 కొనడానికి డబ్బును సంపాదించడానికి 30 రోజుల కంటే కొంచెం ఎక్కువ రోజులు పని చేయాల్సి ఉంటుంది. వివిధ గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఒక వ్యక్తి సగటు జీతం కేవలం 30 వేల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Recommended image2
EMI Tips : నెలనెలా కట్టే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ తగ్గించుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీకోసమే
Recommended image3
Robot Camera: కేవలం 1800కే రొబో సీసీ కెమెరా,ఇదొక్కటి ఉంటే మీ ఇల్లు సేఫ్, చీకట్లోనూ అద్భుతంగా పని చేస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved