Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Technology
  • డీప్ సీక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? దీని ఫీచర్లు, బెనిఫిట్స్, మరిన్న వివరాలు

డీప్ సీక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? దీని ఫీచర్లు, బెనిఫిట్స్, మరిన్న వివరాలు

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైనా స్టార్టప్ రూపొందించిన డీప్ సీక్ గురించే చర్చ సాగుతోంది. ఇంతకూ ఏమిటీ డీప్ సీక్? దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకొండి. 

Arun Kumar P | Updated : Jan 28 2025, 04:15 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
DeepSeek

DeepSeek

DeepSeek : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... హైటెక్ టెక్నాలజీ సృష్టించిన అద్భుతం. ఇది టెక్ రంగంలో మరో విప్లవానికి నాంది పలుకుతోంది. ఇక భవిష్యత్ ఏఐ టెక్నాలజీదే అని గుర్తించిన అగ్రరాజ్యం అమెరికా ఇందులోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. యూఎస్ కు చెందిన కంపనీలు ఈ ఏఐ టెక్నాలజీని అభివృద్ది చేసాయి... ఈ క్రమంలోనే చాట్ జిపిటి ఏ స్థాయిలో ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. గూగుల్, మైక్రోసాప్ట్ వంటి సంస్థలు కూడా ఏఐ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.

ఇలా యూఎస్ ఆధిపత్యం కొనసాగుతున్న ఏఐ లోకి చైనా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన ఓ స్టార్టప్ ప్రభంజనం సృష్టిస్తోంది... టెక్ దిగ్గజాలకు ఛాలెంజ్ విసురుతూ దూసుకువెళుతోంది. కేవలం వారంరోజుల క్రితమే లాంచ్ చేసిన 'డీప్ సీక్'  ఏఐ చాట్ బాట్ ప్రజల్లోకి జెట్ స్పీడ్ తో వెళుతోంది. డౌన్ లోడ్స్ విషయంలో చాట్ జిపిటిని సైతం వెనక్కినెడుతోంది ఈ చైనీస్ AI యాప్. 
 

23
deepseek

deepseek

ఏమిటీ డీప్ సీక్ : 

డీప్ సీక్ అనేది ఏఐ రీసెర్చ్ కోసం ఏర్పాటుచేసిన స్టార్టప్. దీన్ని చైనాలోని హాంగ్జౌకు చెందిన లియాంగ్ వెన్ ఫెంగ్ 2023 లో దీన్ని స్థాపించాడు. క్వాంటిటేటివ్ ఫైనాన్స్ లో ఇతడు ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. ఇతడు చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లతో ఓ టీమ్ ను ఏర్పాటుచేసి ఏఐ టెక్నాలజీని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. పూర్తి ఉచితంగానే అడ్వాన్సుడ్ మోడల్ ఏఐని అందిస్తోంది ఈ సంస్థ.

దిగ్గజ కంపనీలతో పోటీపడుతూ ఏఐ టెక్నాలజిని అభివృద్ది చేస్తోంది డీప్ సీక్...కాబట్టి భారీగా ఖర్చు చేస్తుందని అనుకుంటే పొరపడినట్లే. యూఎస్ టెక్ కంపనీల కంటే చాలా తక్కువ ఖర్చుతోనే దీన్ని డెవలప్ చేసారు. కేవలం 6 మిలియన్ డాలర్లతో ఈ లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ డీప్ సీక్ రూపొందించింది. ఇలా తక్కువ ఖర్చుతోనే ఇతర ఏఐ మోడళ్ల కంటే మెరుగైన పనీతీరు కరబర్చేలా రూపొందించారు.

ఈ డీప్ సీక్ ప్రస్తుతం రెండు మోడల్స్ లో అందుబాటులో వుంది... అవి R1 మరియు R1 Zero మోడల్. వినియోగదారులకు R1 యాక్సెస్ వెంటనే లభిస్తుంది. దీన్ని ఎలాంటి చార్జీలు లేకుండా నిరంతరాయంగా ఉపయోగించవచ్చు. ఇది డీప్ సీక్ ను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. 
 

33
DeepSeek

DeepSeek

డీప్ సీక్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?: 

మీ ఫోన్ లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. 

సెర్చ్ లోకి వెళ్లి డీప్ సీక్ (DeepSeek) అని టైప్ చేయండి 

డాల్ఫిన్ బొమ్మతో డీప్ సీక్ యాప్ కనిపిస్తుంది. దాని పక్కనే వున్నడౌన్ లోడ్ పై బటన్ క్లిక్ చేయండి. 

డీప్ సీక్ ను ఎలా ఉపయోగించాలి : 

మీరు ఉపయోగించే వెబ్ బ్రౌజర్ లో www.deepseek.com అని టైప్ చేయండి. డీప్ పీక్ పై క్లిక్ చేయండి. 

మీ గూగుల్ అకౌంట్ నుండి లాగిన్ అవ్వండి. 

చాట్ జిపిటి మాదిరిగానే మీరు దేనిగురించి సమాచారం కావాలో డైలాగ్ బాక్స్ లో టైప్ చేయండి.వెంటనే మీకు కావాల్సిన సమాచారం వస్తుంది. 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
 
Recommended Stories
Top Stories