న్యూ ఇయర్ గ్రీటింగ్స్ : మీ వాట్సప్ లేదా బిజినెస్ అక్కౌంట్స్ కోసం స్టిక్కర్‌లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
కొత్త సంవత్సరానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో చాలా మంది ఇప్పటికే తమ బంధువులు, స్నేహితులకు న్యూ ఇయర్ (new year)గ్రీటింగ్స్ పంపాలని ప్లాన్ చేస్తుంటారు. మీరు మీ కుటుంబ సభ్యులకు లేదా ఫ్రెండ్స్ కి గ్రీటింగ్స్ ఇంకా న్యూ ఇయర్ శుభాకాంక్షల మెసేజెస్ పంపాలనుకుంటే కొత్త అండ్ ట్రెండింగ్ వాట్సాప్ స్టిక్కర్(whatsapp stickers)లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.
ఇంటర్నెట్ నుండి ఈ స్టిక్కర్లను డౌన్‌లోడ్ చేసే ప్రక్రియ చాలా సులభం. ఈ విషయంలో మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ కొత్త అండ్ బిజినెస్ స్టిక్కర్‌లకు ఆన్‌లైన్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ స్టిక్కర్ల ద్వారా మీరు మీ పరిచయస్తులకు లేదా మీ ఫ్రెండ్స్ కి శుభాకాంక్షలు పంపడం ద్వారా కొత్త సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. కొత్త అండ్ ట్రెండింగ్ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేసే ప్రక్రియ గురించి తెలుసుకుందాం...
-కొత్త అండ్ ట్రెండింగ్ స్టిక్కర్‌లను డౌన్‌లోడ్ చేయడానికి మీరు మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ని ముందుగా ఓపెన్ చెయ్యాలి
-ఆ తర్వాత మీరు సెర్చ్ బార్‌లో క్లిక్ చేయాలి.
-ఇక్కడ మీరు న్యూ ఇయర్ స్టిక్కర్ కోసం వెతకాలి.
-దీన్ని సెర్చ్ చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై చాలా యాప్‌లు చూపిస్తుంది.
-మీరు ఈ సేఫ్ యాప్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు ఇంకా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-దీని తర్వాత మీరు ఫోన్‌లో న్యూ ఇయర్ ట్రెండింగ్ వాట్సాప్ స్టిక్కర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-ఈ కొత్త అండ్ ట్రెండింగ్ వాట్సాప్ స్టిక్కర్‌ల సహాయంతో మీరు మీ బంధువులకు సులభంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.