MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఎయిర్‌టెల్ అతి చౌకైన ప్లాన్‌ తిరిగి వచ్చేసింది.. ఇప్పుడు డిస్నీ + హాట్‌స్టార్‌, అమెజాన్ ప్రైమ్ ఫ్రీ..

ఎయిర్‌టెల్ అతి చౌకైన ప్లాన్‌ తిరిగి వచ్చేసింది.. ఇప్పుడు డిస్నీ + హాట్‌స్టార్‌, అమెజాన్ ప్రైమ్ ఫ్రీ..

ఈ ఏడాది జూలై చివరిలో కస్టమర్లకు పెద్ద నిరాశ కలిగింది. అదేంటంటే దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ చౌకైన ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసింది, ఈ ప్లాన్ ధర రూ .49. ఆ తర్వాత ఎయిర్‌టెల్  చౌకైన ప్లాన్ ధర రూ .79  ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా ఎయిర్‌టెల్ మళ్లీ రూ .49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. మీరు ఎయిర్‌టెల్  రూ .49 ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను మళ్లీ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Sep 24 2021, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఎయిర్‌టెల్ ఈ రూ. 49 ప్లాన్‌తో 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో రూ. 38.52 టాక్ టైమ్ వస్తుంది. ఈ ప్లాన్‌తో 100ఎం‌బి డేటా కూడా లభిస్తుంది. లోకల్ / ఎస్‌టి‌డి కాలింగ్ సెకనుకు 2.5 పైసల చొప్పున చార్జ్ చేయవచ్చు. ఇంతకు ముందు కూడా ఈ ప్లాన్‌తో ఇలాంటి బెనెఫిట్స్ ఉండేవి.

24

రూ .49 ప్లాన్ కంపెనీ చౌకైన ప్రీ-పెయిడ్ ప్లాన్. దీని తరువాత రెండవ చౌకైన ప్లాన్ ధర రూ .79. రూ .79 ప్లాన్‌తో వినియోగదారులు రూ. 64 టాక్ టైమ్ పొందుతారు. కాలింగ్ కోసం  సెకనుకు 1 పైస చొప్పున చార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో 200ఎం‌బి డేటా అందుబాటులో ఉంటుంది అలాగే ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

కొన్ని రోజుల క్రితం ఎయిర్‌టెల్ డిస్నీ + హాట్‌స్టార్‌  ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తో మూడు కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ ప్రారంభ ధర రూ .499. 
 

34
ఎయిర్‌టెల్ రూ .499 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .499 ప్లాన్

ఎయిర్‌టెల్  ఈ ప్లాన్‌తో మీరు ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందువచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 3జి‌బి డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో  అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది ఇంకా ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు.  
 

44
ఎయిర్‌టెల్ రూ .699 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ .699 ప్లాన్

ఎయిర్‌టెల్  రూ .699 ప్లాన్  వాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 2జి‌బి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది ఇంకా ప్రతిరోజూ 100 ఎస్‌ఎం‌ఎస్ చేసుకోవచ్చు. డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఇందులో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు 30 రోజుల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Recommended image2
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Recommended image3
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved