జియో దూసుకెళ్లడంలో కీలక పాత్ర..ముకేశ్ అంబానీకి కుడిభుజం..ఎవరతను ?

First Published 13, Jun 2020, 11:10 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సారథ్యంలో సంస్థ దూసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఫేస్ బుక్ తదితర సంస్థలతో జియో ఫ్లాట్‌ఫామ్స్ లో పెట్టుబడులు పెట్టించడంలో కీలక పాత్ర పోషించారాయన. అంతే కాదు రిలయన్స్ సంస్థను టెక్నాలజీ బాట పట్టించడంలోనూ కీలకంగా వ్యవహరించారు ఆయనే మనోజ్ మోదీ. ముకేశ్ అంబానీకి కుడి భుజం వంటి వారని కార్పొరేట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

ముంబై: కరోనావైరస్‌ మార్చిలో మెల్లగా భారత్‌లో విజృంభించడం మొదలైంది. దీంతో లాక్‌డౌన్‌ భయాలతో స్టాక్‌ మార్కెట్లు గంగవెర్రులు ఎత్తిపోతున్నాయి. పాతాళాన్ని వెతుకుతున్నాయా? అన్నట్లు పతనమయ్యాయి.ఈ ఉత్పాతంలో మార్చి మధ్య రిలయన్స్‌ షేర్ ధర రూ.900 దిగువకు పడిపోయింది. అయినా రిలయన్స్‌ బృందం గుంబనంగా ఉంది.. ఆ తర్వాత మెల్లగా షేర్ ధర పెరుగుతూ వచ్చింది.

ఏప్రిల్‌ రెండో వారం గడిచాక ఫేస్‌బుక్‌ డీల్‌ తెరపైకి వచ్చింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ.43 వేల కోట్ల పైమాటే. అక్కడి నుంచి రిలయన్స్‌ ఏ దశలోను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా కంపెనీ విలువ రాకెట్‌లా దూసుకుపోయింది.ఈ డీల్స్‌ వెనుక ముఖేశ్‌ అంబానీ రైట్‌ హ్యాండ్‌గా పేరు ఉన్న ఒక వ్యక్తి మేథస్సు ఉంది. ఆయనే మనోజ్‌ మోదీ..! జియో ఫ్లాట్‌ఫామ్స్‌తో ఫేస్‌బుక్‌తో 570 కోట్ల డాలర్ల భారీ డీల్‌ సంప్రదింపుల్లో మోదీ కీలక పాత్ర పోషించారు.

కానీ ఆయనకు కెమెరాల మెరుపులంటే మోజులేదు..టీవీ స్క్రీన్‌లపై మెరవాలనే ఆసక్తి అంతకన్నా లేదు. కానీ ఒంటిచేత్తో రూ వేల కోట్ల కార్పొరేట్‌ ఒప్పందాలను ఖరారు చేయగల సత్తా మనోజ్ మోదీ సొంతం. ఆయన నలుగురిలో పేరుకోసం తహతహలాడే తత్వం కాదు.భారత కార్పొరేట్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీని ముందుండి నడిపించే శక్తే అయినా ప్రచార పటాటోపానికి దూరంగా ఉండే వ్యక్తి ఆయన గుంభనంగా ఉంటూ, బహిరంగ వేదికల్లో పెద్దగా కనబడని మనోజ్ మోదీని ముఖేష్‌ అంబానీకి అత్యంత సన్నిహితుడని చెబుతారు. రిలయన్స్ సంస్థను పెట్రోకెమికల్స్‌ నుంచి ఇంటర్‌నెట్‌ టెక్నాలజీలకు ముఖేష్‌ తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించాలనే లక్ష్యంలో మనోజ్‌ మనోజ్ మోదీ చురుగ్గా వ్యవహరించారు. రిలయన్స్‌ జియోలో మరికొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్లు పెట్టుబడులు పెట్టే ఒప్పందాల్లోనూ ఆయనదే కీలక పాత్ర అని కార్పొరేట్‌ వర్గాలు వెల్లడించాయి.

మీడియా ప్రతినిధులతో ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే మనోజ్ మోదీ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడతారు. సంస్ధాగత నిర్మాణంపై రిలయన్స్‌ ప్రచారం చేసుకోకున్నా అంబానీ, మనోజ్‌ మోదీ సాన్నిహిత్యం ఎలాంటిదో పరిశ్రమ వర్గాలకు తెలుసని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ కలారి క్యాపిటల్‌ పార్టనర్స్‌ ఎండీ వాణి కోల చెప్పారు. కీలక ఒప్పందాలను ఇరువురు ఖరారు చేస్తూ పకడ్బందీగా వాటి అమలుకు పూనుకుంటారని కలారి క్యాపిటల్‌ పార్టనర్స్‌ ఎండీ వాణి కోల పేర్కొన్నారు. రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియోల్లో డైరెక్టర్‌గా వ్యవహరించే మనోజ్‌ మోదీ కంపెనీ ఉద్యోగులను మెరికల్లా తీర్చిదిద్దడంలోనూ ముందుంటారని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బ్లూమ్‌బెర్గ్‌’ పేర్కొంది.

మనోజ్‌ మోదీ పేరు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అసలు బహిరంగ కార్యక్రమంలో ఆయన కనిపించడం చాలా అరుదు. పూర్తిగా లోప్రొఫైల్‌ మెయిన్ టైన్ చేస్తుంటారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో మోదీ ఒకరు. ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌తో జరిగిన డీల్‌లో ముఖేష్‌ అంబానీ, ఆకాశ్‌ అంబానీ వ్యూహం వెనుక మనోజ్‌పాత్ర ఉంది. ఓ సదస్సులో మనోజ్ మోదీ మాట్లాడతూ ‘నేను బేరాలు చేయలేను. నాకు వ్యూహాలు అర్థం కావు. కంపెనీలో అంతర్గతంగా ఉండేవారికి ఈ విషయాలు తెలుసు. నాకు పెద్దగా ముందు చూపు కూడా లేదు. నేను కేవలం సంస్థలో వారితో కలిసే పనిచేస్తా’ అని వ్యాఖ్యానించారు.

‘సంస్థలోని సిబ్బందికి శిక్షణ ఇవ్వడం.. కీలకమైన బాధ్యతలను ఎలా నిర్వహించాలో నేర్పిస్తా. మనతో కలిసిన వ్యాపార భాగస్వాములు లాభపడనంతకాలం.. మనం నిలదొక్కుకోలేం అనే రిలయన్స్‌ వ్యాపార సూత్రం నుంచి నేర్చుకొంటా’ అని మనోజ్ మోదీపేర్కొన్నారు. రిలయన్స్‌ మనోజ్ మోదీ కనుసన్నల్లోనే స్టార్టప్‌లను కొనుగోలు చేసింది. చర్చలు జరపడం.. బేరాలాడటంలో మనోజ్‌ది అందెవేసిన చేయి. ఇటీవల రిలయన్స్‌ కొనుగోలు చేసిన కృత్రిమ మేధ నుంచి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ నుంచి స్టార్టప్‌ల వరకు ఆయన కృషి ఉంది.

రిలయన్స్‌ డిజిటల్‌ వ్యాపారాలను బలోపేతం చేయడానికి ఈ డీల్స్‌ చాలా వరకు ఉపయోగపడతాయి. చాలా డీల్స్‌లో మనోజ్‌తో మీటింగ్‌ జరిగితే దానికి రిలయన్స్‌ ఆమోద ముద్రపడినట్లేని భావిస్తారు. ఈ విషయాన్ని స్వయంగా సదరు స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులే వెల్లడించారు.‘ఆయన రిలయన్స్‌కు కేవలం నమ్మకస్తుడు మాత్రమే కాదు. తెలివితేటలు.. చర్చలు జరపగల నేర్పరితనం వంటి ఆయన లక్షణాలు సంస్థకు అదనపు బలం. కేవలం అసాధారణ చాతుర్యం ఆయన సొంతం’ అని మనోజ్ మోదీ మేధస్సును ప్రశంసించారు ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్.

‘భారతీయులకు ఉపయోగపడేలా ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకోగల నైపుణ్యం.. ముందుచూపు వంటివి ఆయన్ను ఈ స్థితిలో నిలిపాయి’ అని ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌.గోపీనాథ్‌ పేర్కొన్నారు. 2010లో ఎయిర్‌ డెక్కన్‌ వాటాలను రిలయన్స్‌కు విక్రయించింది. విలీనాలు, వాటాల కొనుగోళ్ల విషయంలో మనోజ్‌ అత్యంత నేర్పరి అని తెలిపారు. ధీరుభాయ్‌ అంబానీ పెట్రోలియం సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన 1980ల నుంచి కంపెనీతో ఉన్న వ్యక్తుల్లో మనోజ్‌ హరిజీవన్‌దాస్‌ మోదీ ఒకరు. ఆయన అంతకు ముందు ముఖేశ్‌తో కలిసి ముంబైలోని ‘ది యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ’లో ముఖేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో రిలయన్స్‌లో అడుగుపెట్టారు. ధీరుభాయ్‌, ముఖేశ్‌, ఇషా, నీతా అంబానీలతో కలిసి పనిచేశారు.

రిలయన్స్‌ జియో విస్తరణ వెనుక మనోజ్ మోదీ కృషి చాలా ఉందని చెబుతారు. ముఖ్యంగా ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ విస్తరణ సమయంలో సరఫరాదారులతో ఆయనే తీరిక లేకుండా చర్చలు జరిపారు. ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించింది.ఇప్పుడు దాదాపు 400 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు అదే జియోలో ఫేస్‌బుక్‌ కూడా భాగస్వామిగా చేరింది. ఈ డీల్‌ సమయంలో ముఖేష్‌, ఇషా, ఆకాశ్‌, మనోజ్‌, రిలయన్స్ వ్యూహాల విభాగం ప్రతినిధి అన్షుమాన్‌ ఠక్కర్‌ మాత్రమే కీలక వ్యక్తులు. రిలయన్స్‌ ప్రధాన వ్యాపారమైన పెట్రోలియం రంగంపై కరోనావైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోరంగం ఇబ్బంది పడింది. ఈ సమయంలో వీరు ఈ సమయంలో ఫేస్‌బుక్‌, కేకేఆర్‌, సిల్వర్‌ లేక్‌, విస్టా ఈక్విటీ, జనరల్‌ అట్లాంటిక్‌ వంటి సంస్థలతో కళ్లు చెదిరే డీల్స్‌ కుదుర్చుకొన్నారు. ఫలితంగా సంస్థ మార్కెట్‌ విలువ పెరగడంతోపాటు రిలయన్స్‌ డిజిటల్‌ వ్యాపారానికి బలమైన పునాదులు పడ్డాయి.

loader