రివ్యూ 2010-2019 దశాబ్దంలో ఎన్ని మార్పులో తెలుసా...?
మనం మారిపోయాం.. తెలుసా..!! అవునండీ మనం మారిపోయాం... చాలా చాలా.. గత పదేళ్లతో పోలిస్తే జీవనం సులభతరమైంది. అంగట్లో సరుకు నుంచి.. దేశ ఆర్థిక పరిస్థితుల వరకు ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఓ సారి సమీక్షిద్దాం.
132

న్యూఢిల్లీ: సమాచార సాంకేతిక విప్లవం సమాజ జీవన విధానంలో సమూల మార్పులు చేసింది. ప్రత్యేకించి గత దశాబ్ది కాలంలో విపణిలో అడుగు పెట్టిన స్మార్ట్‌ఫోన్ మన ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లోనో, నెట్‌ఫ్లిక్స్‌లోనో కొత్త సినిమా చూసేస్తున్నాం. తందూరి చికెనైనా.. చింతకాయ పచ్చడైనా.. ఆర్డర్ చేసిన క్షణాల్లో ఇంటికొచ్చేస్తోంది..

232
భోజనమైనా ఔషధాలైనా క్షణాల్లో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం ఆరోగ్యం కోసం వాడే ఔషధాలైనా.. రోజువారి కట్టుకునే దుస్తులైనా ఒక్క ఆర్డరిస్తే చాలు.. కళ్లముందు ప్రత్యక్షం అవుతున్నాయి. బంగారం, స్మార్ట్ టీవీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో, ఎన్నెన్నో... ఇట్టే వచ్చి వాలి పోతున్నాయి. అంతెందుకు ఏదైనా పంక్షన్‌కు హాజరయ్యేందుకు బయటకెళ్లాలంటే క్యాబ్ రెడీ.. చేతిలో డబ్బులేకుంటేం .. నేనున్నాగా అంటోంది డిజిటల్ మనీ.

332
ట్రంకాల్స్.. ఎస్టీడీలకు చెల్లు చీటి ట్రంకాల్స్, ఎస్టీడీల యుగం యాజ్ గాన్.. ఇప్పుడు.. ఎక్కడికైనా.. ఎంత దూరమైనా.. గంటల తరబడి మాట్లాడేస్తున్నాం.. అది పెద్దగా ఖర్చు అక్కర్లేకుండా. ఇప్పటికైనా ఒప్పుకుంటారా.. మనం మారిపోయామని.. ఈ దశాబ్దం మన జీవితాల్నే మార్చేసింది మనకు తెలీనంతగా. ఇంతగా ప్రభావితం చేసిన 2010-2019 దశాబ్దంలో కార్పొరేట్ భారతంలో జరిగిన కొన్ని ముఖ్య ఘటనలను ఒక్కసారి వీక్షిద్దాం...

432
ఇంటిలోనే రెస్టారెంట్ మీల్స్ ఫ్యాషన్ ఈ దశాబ్దిలో మన ఆహారపు అలవాట్లు బాగా మారాయి. ఒకప్పుడు రెస్టారెంట్లకు వెళ్లి తినడం ఫ్యాషనైతే.. ఇప్పుడు ఇంట్లోనే రెస్టారెంట్ ఆహారాన్ని తినడం సరదాగా మారింది. అందుకు స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా వంటి యాప్‌లు బాగా ఉపయోగపడ్డాయి. ఆర్డర్ ఇచ్చిన గంటలోగా మనం కోరిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని తీసుకుని ఇంటి గుమ్మం ముందుకు తీసుకువస్తున్నారు.

532
ఫుడ్ అగ్రిగ్రేటర్స్‌తో జంట లాభాలు ఇంటికి ఆహారం తేవడం వల్ల అటు వినియోగదార్లకు ప్రయోజనం.. ఇటు యువతకు పాకెట్‌మనీ రెండూ వస్తున్నాయి. కొన్ని లక్షల మందికి అదే ఉపాధిగానూ మారింది. నెలకు 5-6 కోట్ల వరకు ఆర్డర్లు వస్తుంటే ఆ మాత్రం ఉపాధి లభించడంలో ఆశ్చర్యం ఏముంది.

632
ఇలా విస్తరిస్తున్న ఈ - కామర్స్ బిజినెస్ ఇంటి దగ్గరి అంగట్లో సామాన్లు కొనడం పరిపాటే. అయితే అవి అంతగా నాణ్యత లేకున్నా.. ఎక్కువ దూరం ఏం వెళతాంలే అని వాటితోనే సరిపుచ్చుకునేవాళ్లం. కానీ కొన్ని యాప్‌ల రాకతో వినియోగదారుల కొనుగోలు శైలి పూర్తిగా మారింది. యాప్స్ ఆన్ లైన్‌లో తక్కువ ధరకే నాణ్యమైన సరుకులను అందేలా చేస్తున్నాయి.

732
నట్టింట్లోకి ఈ-కామర్స్ మేజర్లు ఎంట్రీ ఆన్‌లైన్‌లో వినియోగదారులకు సామాన్లను అందజేయడంలో గ్రోఫర్స్, అమెజాన్, బిగ్‌బాస్కెట్ వంటివి ముందున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. భారత్‌లో నెలకు 1-2 కోట్ల వరకు ఆర్డర్లు వస్తున్నాయంటే ఈ-కామర్స్ సంస్థలు ఎంతగా మన ఇంట్లోకి దూరిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

832
అతిపెద్ద మార్పుగా ఈ-కామర్స్ లావాదేవీలు ఈ-కామర్స్ బిజినెస్‌ను ఈ దశాబ్దపు అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ఈనాడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ల పేర్లు తెలియనివారు ఉండరేమో. ఎందుకంటే గత పదేళ్లలో మొబైల్ వంటి వస్తువులను షాపుకు వెళ్లి కొనడం నుంచి ఆన్‌లైన్లో ఆర్డరు చేయడం వరకు ఆ పరిణామ క్రమం మారింది.

932
2018లో 30 బిలియన్ల డాలర్లకు ఇండియా ఈ-కామర్స్ బిజినెస్ ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్ లైన్ విక్రయాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 2018లో 30 బిలియన్ డాలర్లకు చేరిన భారత ఈ-కామర్స్ మార్కెట్ వచ్చే దశాబ్దంలో 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందంటే.. ఇది మరెంత మార్పునకు దారి తీస్తుందో చూడాల్సిందే.

1032
కాఫీ-డేతో కాఫీకి కార్పొరేట్ హంగులు వినూత్న వ్యాపారం చేయడం సాహసం. ఆ వ్యాపారాన్ని వృద్ధి పథాన నడిపించడం అద్భుతం. ఇంతలా సాహసం.. కానీ అద్భుతాలు నెలకొల్పిన కాఫీ డే అధిపతి వీజీ సిద్ధార్థ జీవితం విషాదంతో ముగియడమే అత్యంత దారుణం. కర్ణాటకలోని నేత్రా నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

1132
కాఫీడే అధినేత భవితవ్యం ఇలా తొలుత కాఫీ డే అధినేత సిద్ధార్థ అదృశ్యమయ్యారనే వార్త వినగానే యావత్ కార్పొరేట్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత బలవన్మరాణానికి పాల్పడ్డారని తెలిసి.. తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఏడాదిలోనే కాదు.. ఈ దశాబ్దంలోనే దేశ కార్పొరేట్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఇదొకటి.

1232
కార్పొరేట్ ఇండియాకు సిద్దార్థ ఒక గుణపాఠం దేశీయ కాఫీ బ్రాండ్‌ను అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించారు వీజీ సిద్ధార్థ. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించిన సిద్ధార్థ విషాద జీవిత గాథ.. కార్పొరేట్ ప్రపంచానికి గుర్తుండిపోయే ఓ అనుభవం పాఠం.

1332
ఇంటర్నెట్ విప్లవం రిలయన్స్ జియో మనింట్లో ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంది నాన్నా అంటూ.. 2011లో ఈశా అంబానీ తన తండ్రి ముకేశ్ అంబానీతో ఆ మాటే అనకుంటే.. జియో పుట్టేది కాదేమో. దేశంలో టెలికాం విప్లవానికి నాంది పడేది కాదేమో. 4జీ ఫోన్లు కూడా లేని సమయంలో 4జీ ఎల్‌టీఈ ఫీచర్ ఫోన్లు తేవడంతోపాటు ఉచిత అపరిమిత కాల్స్‌కు నాంది పలకడం జరిగిపోయింది.

1432
మూడేళ్లలో నంబర్ వన్ స్థానానికి జియో వాణిజ్యపరంగా 2016 సెప్టెంబరులో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ భారత్‌ను డేటా వినియోగంలో నెంబర్ 1 స్థానంలో నిలిచేలా చేసింది. వేగంగా వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడంలో రికార్డు సృష్టించింది కూడా. ఇది ప్రారంభం మాత్రమే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న ముకేశ్.. ఆప్టికల్ ఫైబర్‌నూ తీసుకొస్తున్నారు. అంతే కాదు ఇంట్లో ప్రతి వస్తువును నియంత్రించే ఐఓటీ పరిజ్ఞానాన్ని కూడా అందించనున్నారు.

1532
ఈ దశాబ్దపు సంక్షోభం ఎన్బీఎఫ్సీ తర్వాత ఈ దశాబ్దంలో బ్యాంకులను, దేశాన్ని కలవరపరచింది ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభమే. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కారణంగా ఏర్పడ్డ ఈ సంక్షోభం వల్ల కేవలం ఆ రంగంపై మాత్రమే ప్రభావం పడలేదు. రుణాలు అవసరమైన, తీసుకున్న రంగాలూ ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. అసలు ఎన్బీఎఫ్సీ నమూనా బలంగా ఉన్నట్లు కనిపించదు.

1632
ఇలా ఎన్బీఎఫ్సీ సంస్థలు విలవిల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వాటిని చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు ఎక్కువ వడ్డీలకు రుణాలిచ్చే పద్ధతిలో నడిచినన్నాళ్లు నడిచింది. ఒక్కసారి ఎన్బీఎఫ్సీ సంస్థల వద్ద నగదు కొరత రావడంతో రుణాలు అవసరమైన కంపెనీలూ కార్యకలాపాలు నిర్వహించలేక పోయాయి. ఇక ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలిచ్చిన బ్యాంకులూ ఇబ్బందులు పడ్డాయి. దీంతో ఆ ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపైనా పడింది. ఆరేళ్లలోనే కనిష్ఠ స్థాయికి జీడీపీ వృద్ధి చేరడానికి అది కూడా ఒక కారణంగా నిలిచింది.

1732
సైరస్ మిస్త్రీతో టాటాలకు కునుకు కరువు ఒకప్పుడు సైరస్ మిస్త్రీని స్వయంగా రతన్ టాటామెచ్చుకుని.. తన వారసుడిగా ప్రకటించారు. గ్రూపును ఉన్నత శిఖరాలకు తీసుకు వెళతాడనీ అన్నారు. అది 2012 నాటి మాట. టాటాయేతర వ్యక్తిగా ఆ టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కాలం గడిచింది. అదే మిస్త్రీ ఆ పదవికి పనికిరాడంటూ అదే రతన్ టాటా 2016లో తొలగించారు.

1832
మిస్త్రీ ఇలా న్యాయ పోరాటం తన తొలగింపుపై మిస్త్రీ కోర్టుకు వెళ్లారు. మిస్త్రీ తొలగింపునకు చట్టబద్ధత లేదంటూ ఈ ఏడాది చివర్లో కోర్టు తీర్పునిచ్చింది. టాటాలు మళ్లీ కోర్టుకు అప్పీలు చేసుకున్నా, ఒక వేళ మిస్త్రీకే అనుకూలంగా తీర్పు వస్తే.. వచ్చే దశాబ్దంలో టాటా సన్స్‌కు దిశానిర్దేశం చేసేది మిస్త్రీయే అవుతారు. ఏది ఏమైనా ఆ దశాబ్దంలో అందరి నోట్లలో నానిన పేర్లలో మిస్త్రీ కూడా ఒకటి.

1932
ఈ విమానాలు ఎగరడం మానేశాయ్ ఈ పదేళ్ల రెండు విమానయాన సంస్థలు రన్‌వే నుంచి పక్కకు వచ్చేశాయి. కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశాయి. ఒకటి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కాగా.. మరొకటి జెట్ ఎయిర్‌వేస్. 2012లో మాల్యా ఆధ్వర్యంలోని కింగ్‌ఫిషర్ నేలకు దిగగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో జెట్ రెక్కలు విరిగి పడ్డాయి.

2032
బ్రిటన్‌కు పరారైన విజయ్ మాల్య మాల్యా దేశాలు వదిలిపెట్టి పారిపోగా.. ఆయన్ను వెనక్కి రప్పించడం అనేది వచ్చే దశాబ్దంలోనైనా జరుగుతుందో లేదో చూడాలి. ఇక జెట్ ఎయిర్‌వేస్‌కు అప్పుల కష్టాలు ఎక్కువై నడపలేని పరిస్థితికి వచ్చింది. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలన్నట్లు.. ఈ రెండు విమానయాన సంస్థల కార్యకలాపాలు నిలిచిపోవడానికీ అన్నే కారణాలు.

Latest Videos