మైక్రోసాప్ట్ 365 అంతరాయం ...ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు
మైక్రోసాప్ట్ లో మరోసారి సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాప్ట్ 365 వినియోగదారులు లాగిన్ సమస్యను ఎదుర్కొన్నారు.
Microsoft
మైక్రోసాప్ట్ లో తరచూ ఏర్పడుతున్న సమస్యలు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవలే మైక్రోసాప్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేపింది. ఇది మరిచిపోకముందే ఇప్పుడు మైక్రోసాప్ట్ 365 లో సమస్య తలెత్తింది.
Microsoft 365
ఇవాళ (సెప్టెంబర్ 12, గురువారం) మైక్రోసాఫ్ట్ 365 వినియోగదారులు పలు సర్వీసులను ఉపయోగించుకోలేకపోయారు. ఇలా 24,000 వేలకుపైగా సమస్యలు రిపోర్ట్ అయినట్లు సాంకేతిక సమస్యలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. దాదాపు 4,700 కంటే ఎక్కువ మంది ఫిర్యాదులు నమోదు చేశారు.
Microsoft 365
ఈ సమస్యపై మైక్రోసాఫ్ట్ 365 టీమ్ ఎక్స్ వేదికన స్పందించింది. "పలు మైక్రోసాప్ట్ 365 సర్వీసులను ఉపయోగించుకోలేక పోతున్నామనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎక్కడ సమస్య ఎదురయ్యిందో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని మైక్రోసాప్ట్ 365 టీమ్ ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగమైన అజుె క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఈ సమస్య AT&T నెట్‌వర్క్‌లోని కనెక్షన్ సమస్యల వల్ల సంభవించి ఉండవచ్చని తెలిపింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ దీనిని పరిశీలిస్తోందని తెలిపింది.
Microsoft 365
ప్రస్తుత సమస్యను పరిష్కరించేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోంది. అయితే మైక్రోసాఫ్ట్ సర్వీసులైన ఔట్ లుక్, వర్డ్, ఎక్సెల్,టీమ్ వంటివి ఉపయోగించే వ్యాపారులు, వ్యక్తుల సమయం వృధా అవుతోంది. మైక్రోసాఫ్ట్ సేవల పూర్తి రికవరీ కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు.
Microsoft 365
మైక్రోసాఫ్ట్ 365 సమస్యలపై వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. "మైక్రోసాఫ్ట్ 365 పనిచేయడం లేదు. నాకు బోరింగ్ ఉదయం" అని ఒక వినియోగదారుడు Xలో పోస్ట్ చేశాడు. "మైక్రోసాఫ్ట్ డౌన్ అయిందా? నేను లైనక్స్‌లో ఉన్నానో లేదో అర్థం కావడం లేదు" అని మరొకరు స్పందించారు.