మేడ్ ఇన్ ఇండియా గేమ్ ఫవ్-జి లాంచ్.. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ?

First Published Jan 26, 2021, 6:05 PM IST

 దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, మేడ్ ఇన్ ఇండియా గేమ్ ఫవ్-జి ప్లే-స్టోర్‌లో ప్రత్యక్షమైంది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఎన్-కోర్ గేమ్స్ ఫవ్-జి గేమ్ ను లాంచ్ చేసింది. ఐఫోన్ వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికి, ఫవ్-జిని  ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫవ్-జి గేమ్ పూర్తి పేరు ఫియర్ లెస్  అండ్ యునైటెడ్ గార్డ్స్. పబ్-జి మొబైల్ గేమ్ కి పోటీగా లాంచ్ చేసిన మేడ్ ఇన్ ఇండియా గేమ్  ఫవ్-జి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ...