స్మార్ట్‌ఫోన్ వ్యాపారానికి ఎల్‌జి గుడ్ బై.. 60 శాతం మంది ఉద్యోగులు ఇంటికి.. ?

First Published Jan 21, 2021, 5:33 PM IST

స్మార్ట్ ఫోన్ వ్యాపారానికి గుడ్ బై చెప్పేందుకు దక్షిణ కొరియా సంస్థ ఎల్‌జి సన్నాహాలు చేస్తోంది. ఒక నివేదిక ప్రకారం మొబైల్ వ్యాపారం మూసివేయడానికి ముందు 60 శాతం మంది ఉద్యోగులు కంపెనీకి వీడ్కోలు పలికారు. మరొక నివేదికలో కంపెనీ మొబైల్ వ్యాపారంలోని 60 శాతం ఉద్యోగులను మరొక వ్యాపారానికి మార్చిందని పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం మొబైల్ వ్యాపారాన్ని మూసివేసే అన్ని అవకాశాలను ఎల్‌జి అన్వేషిస్తోందని పేర్కొంది.