వర్క్ ఫ్రమ్ హోం సమయంలో హెడ్ ఫోన్స్ వాడుతున్నారా.. అయితే మీకు కూడా ఈ సమస్య రవొచ్చు..
ఈ రోజుల్లో హెడ్‌ఫోన్‌లు వాడటం సర్వ సాధారణం. హెడ్‌ఫోన్‌లు వాక్‌మ్యాన్ కాలం నుంచీ వాడుకలో ఉన్నాయి, అయితే హెడ్‌ఫోన్స్ దీర్ఘకాలిక ఉపయోగం చెవులకు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో హెడ్‌ఫోన్‌ల వాడకం చాలా పెరిగింది. చాలా మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రోం హోం, విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్ వల్ల ఇయర్‌ఫోన్‌ల వాడకం మరింత పెరిగింది. ఇవి చెవి నొప్పి, అసౌకర్యం, ఇన్‌ఫెక్షన్ ఫిర్యాదులతో ఎక్కువ మంది బాధపడుతున్నారు అని వైద్యులు అంటున్నారు.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గత ఎనిమిది నెలలుగా ప్రజలు చాలా గంటల పాటు హెడ్ ఫోన్లు, ఇయర్ పాడ్లను ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా ఫిర్యాదులు పెరిగాయి. ముంబైలోని ప్రభుత్వం నిర్వహిస్తున్న జెజె హాస్పిటల్ ఈఎన్‌టి విభాగం హెడ్ డాక్టర్ శ్రీనివాస్ చవాన్ మాట్లాడుతూ ఈ ఫిర్యాదులన్నీ నేరుగా హెడ్‌ఫోన్‌ల వాడకానికి సంబంధించినవి అని తెలిపారు.
ఇలాంటి ఫిర్యాదులతో రోజూ సుమారు 5 నుంచి 10 మంది ఆస్పత్రికి చెవి, ముక్కు, గొంతు సమస్యతో (ఇఎన్‌టి) వస్తున్నారని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది ఎనిమిది గంటలకు పైగా హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తారని, ఇది చెవులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని దీని వల్ల ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందని ఆయన అన్నారు. ఎక్కువ సేపు హెడ్ ఫోన్లు వాడటం ద్వారా వినికిడి సామర్థ్యం బలహీనపడుతుందని, ప్రజలు తమ అలవాట్లను మార్చుకోకపోతే వారి చెవులకు శాశ్వత నష్టం జరుగవచ్చు అని తెలిపారు.
స్కూల్ పిల్లలు హెడ్‌ఫోన్‌లను వాడకుండా ఉండాలి: స్కూల్ పిల్లలు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించకూడదు. వారు ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్ క్లాస్‌కు కనెక్ట్ అవుతున్నప్పుడు వారి వినిపించే వాయిస్ సరిపోతుంది. ఎక్కువ హెడ్ ఫోన్లు వాడటం వల్ల స్కూల్ తరగతులు పునరుద్ధరించబడిన వెంటనే, పెద్ద సంఖ్యలో పిల్లలు చెవి సమస్యపై ఫిర్యాదు చేస్తారని నిపుణులు భావిస్తున్నారు.