ఉద్యమాల వేదికగా ‘సోషల్ మీడియా’... కట్టడికి సర్కార్ వ్యూహాలు

First Published 30, Dec 2019, 2:58 PM

ప్రభుత్వం తీసుకునే అనుకూల నిర్ణయాలకు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభిస్తే.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనమే 370 అధికరణం రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు లభించింది. ఇక పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)పై వ్యతిరేకత వ్యక్తం కావడానికి సోషల్ మీడియా వేదికవుతోంది. అయితే ఇదే సమయంలో నకిలీ వార్తలు కూడా ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 
 
న్యూఢిల్లీ: దేశంలో సోషల్‌ మీడియా ఆన్‌లైన్‌ స్నేహాలు, చాటింగ్‌ల స్థాయిని దాటి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ప్రత్యామ్నాయ గొంతుకగా మారింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటివి ఇప్పుడు ఉద్యమాలకు వేదికలయ్యాయి. సమాజంలో జరుగుతున్న పరిణామాలతోపాటు ప్రభుత్వ నిర్ణయాలపై స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని సోషల్ మీడియా వేదికలు కల్పించాయి.కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనూహ్య మద్దతు లభించింది.

కానీ పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అదేసమయంలో నకిలీ వార్తల ప్రచారం కూడా పెరిగింది. దీంతో ప్రభుత్వాలు సోషల్‌ మీడియా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నా యి. 2019 సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది సోషల్‌ మీడియా ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.. ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎంఏఐ) గణాంకాల లెక్కల ప్రకారం దేశంలో ఈ ఏడాది మార్చి చివరినాటికి 45 కోట్లకు పైగా ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 6.6 కోట్ల మంది 5-11 ఏండ్ల మధ్య వయస్కులే.

వీరిలో అత్యధిక శాతం మంది సోషల్‌ మీడియాలో ఖాతాలు కలిగి ఉన్నారు. చాటింగ్‌, వీడియో మెసేజింగ్‌ యాప్‌లలో ప్రాంతీయ భాషల కంటెంట్‌ భారీగా దొరుకుతుండటంతో మారుమూల ప్రాంతాల్లోనూ మీడియా వాడకం పెరిగింది. భవిష్యత్‌లో కొత్తగా చేరే ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 90 శాతం మంది ఇంగ్లిషేతరులే ఉంటారని అంచనా.ఈ ఏడాది వాట్సప్‌ యాప్‌ హ్యాక్‌కు గురవడం పెద్ద సంచలనం. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే ప్రైవేట్‌ నిఘా సంస్థ తమ యాప్‌లోకి పెగాసస్‌ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌ను జొప్పించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,400 మంది యూజర్ల ఫోన్లను హ్యాక్‌ చేసిందని వాట్సప్‌ సంచలన ప్రకటన చేసింది.

ఇందులో 121 మంది భారతీయులు ఉన్నట్టు చెప్పింది. ఇది మనదేశంలో రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. దీంతో వాట్సప్‌లో వ్యక్తిగత గోప్యత భద్రతపై సమీక్షించాలని కేంద్రం నిర్ణయించింది.టిక్‌టాక్‌లో అసభ్యకర వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారంటూ మద్రాస్‌ హైకోర్టు ఈ యాప్‌పై నిషేధం విధించింది. కొన్నాళ్ల తర్వాత ఊరట లభించింది. సంఘ విద్రోహ శక్తులు ఈ యాప్‌ను దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో కేంద్రం నోటీసులు జారీ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు సోషల్‌ మీడియా ఊపిరిగా నిలిచింది. ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థలు తీసుకునే నిర్ణయాలపై నెటిజన్లు నిర్మొహమాటంగా అభిప్రాయాలను తెలుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న భారీ ఉద్యమానికి సోషల్‌మీడియా వెన్నెముకగా నిలుస్తున్నది. దీంతో ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ను నిలిపివేయడాన్ని ఓ ఆయుధంగా మార్చుకున్నాయి. ఈ ఏడాది మన దేశంలో 95 సార్లు ఇంటర్నెట్‌ నిలిపివేశారు.

సోషల్‌ మీడియా దుర్వినియోగం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఐటీ చట్టాన్ని కఠినతరం చేసింది. నకిలీ వార్తలు, మూకదాడులు, వినియోగదారుల వివరాల చోరీ నేపథ్యంలో కేంద్రం ‘వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’ను రూపొందించింది. ఇందులో కొన్ని నిబంధనలు యూజర్లపై, కంపెనీలపై నిఘా పెట్టేందుకు అధికారాలను ఇస్తున్నాయి. సాధారణ ఎన్నికలప్పుడు ప్రభుత్వం, ఈసీ సోషల్‌ మీడియాను హెచ్చరించాయి.

loader