బికినీ వేసుకోవడానికి ఒప్పుకోని ప్లేయర్లు... షార్ట్స్‌తో ఆడారని భారీ జరిమానా...
కొన్ని క్రీడలకు డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఆటతీరును బట్టి ఆటగాళ్లు ధరించే డ్రెస్సు వారికి అనువుగా ఉండేలా రూపొందిస్తారు. అలాంటి డ్రెస్ కోడ్ ధరించకపోతే ఆ ప్లేయర్లపై చర్యలు తప్పవు. అయితే బికినీ వేసుకోలేదని నార్వే వుమెన్స్ బీచ్ హ్యాండ్‌బాల్ టీమ్‌పై జరిమానా విధించింది ఫేడరేషన్...
బీచ్ హ్యాండ్‌బాల్ గేమ్ ఆడే పురుషులు షార్ట్స్ వేసుకునేందుకు అనుమతి ఉంది. అయితే మహిళలు మాత్రం బికినీ ధరించాల్సిందే. మహిళా ప్లేయర్లు కింద ధరించే బికినీ కూడా 10 సెంటిమీటర్ల కంటే పెద్దగా ఉండకూడదనేది రూల్...
అయితే బికినీ వేసుకుని ఆడడం ఇబ్బందికరంగా ఉందని, నార్వే వుమెన్స్ బీచ్ హ్యాండ్‌బాల్ టీమ్, చిన్న షార్ట్స్ వేసుకుని యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన మ్యాచ్‌లో బరిలో దిగారు.
స్పెయిన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బికినీ వేసుకోకుండా పాల్గొనందుకు 1500 పౌండ్లు (దాదాపు లక్షా 32 వేల రూపాయలు) జరిమానాగా విధించింది యూరోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్.
అంటే సౌకర్యంగా లేదని బికినీ వేసుకోనందుకు ఒక్కో ప్లేయర్ 13 వేలకు పైగా జరిమానా చెల్లించాల్సి వస్తోంది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది...
అమ్మాయిలకు అనువుగా, సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకునే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ఉన్నాయని, బికినీలు వేసుకోనందుకు ఫైన్ వేయడం ఏ మాత్రం సమంజసం కాదని పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు.
‘డబ్బులు, ఫైన్స్ గురించి ఫెడరేషన్‌తో మాట్లాడలేదు. ఈ డ్రెస్ కోడ్ కారణంగా మేం చాలామంది ప్లేయర్లను కోల్పోవాల్సి వచ్చింది. బికినీ వేసుకుని పబ్లిక్‌లో ఆడాలంటే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
హ్యాండ్‌బాల్ అంటే చాలా వేగంగా కదులుతూ ఆడాల్సి ఉంటుంది. బికినీలో అలా ఆడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. నగ్నంగా ఉన్నప్పుడు కలిగే ఇబ్బంది, ప్లేయర్లలో ఉంటోంది. ఈ విషయం గురించి చాలా సార్లు ఫెడరేషన్‌తో చర్చించాం. అయితే వాళ్ల నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం...’ అంటూ తెలిపింది ఫ్రెంచ్ కోచ్ వాలెరీ నికోలస్.
అయితే ఫెడరేషన్ మాత్రం ఈ విషయంలో భిన్నమైన వాదన వినిపిస్తోంది. ‘హ్యాండ్‌బాల్స్ రూల్స్ ప్రకారం మహిళలు టైట్ ఫిట్టింగ్ స్పోర్ట్స్ బ్రాను టాప్‌గా వేసుకోవాలి. అలాగే కింద 10 సెంటిమీటర్లకు తక్కువగా ఉండే బికినీ వేసుకోవాలి...’ అంటూ చెప్పుకొచ్చారు అధికారులు...
హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ నిబంధనలు అమ్మాయిల అందాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తూ ఆనందించేలా రూపొందించేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫెమినిస్టులు. బీచ్‌లో ఆడినంత మాత్రాన బికినీలోనే ఆడాలనే నిబంధన పెట్టడం కరెక్టు కాదని అంటున్నారు.