తల్లీ మను భకర్... ఇలా చేసావంటే గోల్డ్ మెడల్ పక్కా..!!
పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఏకంగా రెండు పతకాలు సాధించిన షూటర్ మను భకర్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమెకు గోల్డ్ మెడల్ సాధించాలంటే ఇలా చెయ్యమంటూ ఆసక్తికరమైన లేఖ రాసారు... ఈ లేఖ మీకోసం...
Manu Bhaker
Manu Bhakar : విశ్వక్రీడలు ఒలింపిక్స్ లో మన భారత ఆడబిడ్డ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్ మను భాకర్ తూటా దెబ్బలకు పతకాలు రాలాయి. విదేశీ గడ్డపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తూ యావత్ దేశప్రజలంతా గర్వించేలా చేసారు. ఒకే ఒలింపిక్ లో రెండు పతకాలు సాధించిన భారతీయ షూటర్ గా మను చరిత్ర సృష్టించారు. మరో మెడల్ ఆమె ఖాతాలో పడేది... కానీ తృటిలో హ్యాట్రిక్ మిస్సయ్యారు మను భకర్.
Manu Bhaker
గన్ను చేతబట్టి యుద్దభూమిలో వీరోచిత పోరాటం చేసే సైనికురాలిలా ఒలింపిక్ పతకాల కోసం చిన్న యుద్దమే చేసారు మను. ఈ పతకాల యుద్దంలో డబుల్ సక్సెస్ అయిన మను దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించారు. అయితే తన విజయంలో పవిత్ర గంథం భగవద్గీత పాత్ర వుందని స్వయంగా మను తెలిపారు. ఫైనల్ కు ముందుకూడా భగవద్గీత చదివానని... ఫలితం గురించి ఆలోచించకుండా 100శాతం ఏకాగ్రతతో ప్రయత్నించానని అన్నారు. ఇలా ఒత్తిడి లేకుండా వుండబట్టే మంచి ఫలితం వచ్చిందని మను తెలిపారు.
Manu Bhaker
ఇలా మను భకర్ తన విజయంలో భగవద్గీత పాత్ర వుందంటూ చేసిన కామెంట్స్ పై ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. చాలా గొప్పగా భగవద్గీత గురించి చెప్పావు తల్లి అంటూ మను భకర్ ను ప్రశంసిస్తూనే... ఈ పవిత్ర గ్రంథాన్ని అవమానించేవారికి తగిన బుద్ది చెప్పాలని రామ మోహన్ ఆర్ కరణం అనే నెటిజన్ సూచించారు. ఇలా షూటర్ మను భకర్ కు నెటిజన్ రాసిన లేఖ యధావిధిగా...
Manu Bhaker
తల్లీ,
పతక క్షామంతో అలాడిపోతున్న భారత్ కి కాంస్య పతకాలతోనైనా కాస్త ఆకలి తీర్చినందుకు అభినందనలు. అందులోనూ ఆ పతకాలు షూటింగ్ లో సాధించినందుకు మరీ అభినందనలు. నీ సాధనలో నీకు భగవద్గీత కూడా పనికొచ్చినందుకు మరీ మరీ అభినందనలు.
Manu Bhaker
భగవద్గీత ద్వారా - " నీ పని నువ్వు ఏకాగ్రతతో చెయ్యి, తగిన ఫలితం దానంతటదే వస్తుంది " అనే బోధ మాత్రమే ఎక్కువ ఫాలో అయినట్లున్నావు. ఈ సారి " దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భయపెట్టడం, అవసరమైతే మట్టుబెట్టడం కూడా ధర్మమే " అన్న బోధ ని కూడా గుర్తుంచుకుని, తర్వాతి ఒలంపిక్స్ కి సాధన చేసేటప్పుడు ఈ క్రింది విధంగా చెయ్యి తల్లీ !
Manu Bhaker
భగవద్గీతని వెటకారం చేసే దుష్టులు కొందరు ఇక్కడ పిచ్చిపిచ్చి రాతలు రాస్తూ తచ్చాడుతున్నారు. నీ పిస్టల్ ని వీరి మీదకి గురిపెట్టి సాధన చేస్తే .. నీకు సరైన సాధన దొరకడమే కాక దుష్ట శిక్షణ కూడా జరిగినట్లు అవుతుంది.
Manu Bhaker
అలాగని నువ్వు ఎవరినీ షూట్ చెయ్యాల్సిన అవసరం లేదు. పిస్టల్ చూపిస్తేనే అందులో సగం మంది వీధుల వెంబడి ఉచ్చలు పోసుకుంటూ పరుగెత్తుతారు. మిగతా సగంలో సగం మంది వారికి ఆరు అడుగుల దూరంలో గుండు పడేలా చేస్తే చాలు, హాహాకారాలు చేస్తూ పారిపోతారు. మిగతా వారిలో కొందరికి కాళ్ళ మధ్యలో గుండు దూరిపోయేలా సాధన చెయ్యొచ్చు. కొందరికి భుజాల పైన మెడ పక్క నుంచి గుండు దూరిపోయేలా సాధన చెయ్యొచ్చు. మరి కొందరి విషయంలో వారి బట్టతల మీద మిగిలిన రెండు వెంట్రుకల్లో ఒక వెంట్రుకని తాకుకుంటూ గుండు పోయేలా సాధన చెయ్యొచ్చు.
Manu Bhaker