మెస్సీ గొప్పా, రొనాల్డో గొప్పా... అభిమాని ప్రశ్నకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన సన్నీ లియోన్...
అర్జెంటీనా ఫుట్‌బాల్ వీరుడు లియోనెల్ మెస్సీ పుట్టినరోజు నేడు. అర్జెంటీనా తరుపున 103 అంతర్జాతీయ గోల్స్ చేసి, ప్రస్తుత తరంలో అత్యధిక గోల్స్ సాధించిన రెండో సాకర్ ప్లేయర్‌గా ఉన్నాడు లియోనెల్ మెస్సీ...
Messi-Ronaldo
నేటి తరంలో లియోనెల్ మెస్సీ గొప్పా లేక క్రిస్టియానో రొనాల్డో గొప్పా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. 1000 మ్యాచుల తర్వాత మెస్సీ 789 గోల్స్ చేస్తే, రొనాల్డో 725 గోల్స్ సాధించాడు.. ప్రస్తుతం రొనాల్డో 838 గోల్స్ సాధిస్తే, మెస్సీ 807 గోల్స్‌తో ఉన్నాడు..
Messi-Ronaldo
అంతర్జాతీయ కెరీర్‌లో మెస్సీ 103 గోల్స్ సాధిస్తే, 123 గోల్స్ చేసిన క్రిస్టియానో రొనాల్డో... అత్యధిక ఇంటర్నేషనల్ గోల్స్ చేసిన ప్లేయర్‌గా ఆల్‌టైం టాప్‌లో ఉన్నాడు.. ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మధ్య రొనాల్డో గొప్పా? మెస్సీ గొప్పా? అనే గొడవలు జరుగుతూనే ఉంటాయి..
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో కాసేపు ముచ్ఛటించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోనీకి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అందరిలా నాకు మెస్సీ అంటే ఇష్టమనో, లేక రొనాల్డో నా ఫెవరెట్ ఫుట్‌బాలర్ అని చెప్పకుండా సర్‌ప్రైజింగ్ ఆన్సర్ ఇచ్చింది సన్నీ...
‘మనవాడు సునీల్ ఛెత్రీ ఉన్నాడుగా..’ అంటూ సునీల్ ఛెత్రీ ఫోటోను పోస్ట్ చేసింది సన్నీ లియోన్. ఈ పోస్టుతో అభిమానులను మరోసారి ఇంప్రెస్ చేసిన సన్నీ, ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ హృదయాలను కూడా కొల్లగొట్టేసింది..
సౌతా ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ గోల్స్ సాధించిన భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ, అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆల్‌టైం ఫుట్‌బాల్ ప్లేయర్లలో నాలుగో స్థానానికి ఎగబాకాడు..
Sunil Chhetri
పోర్చుగల్ పోరాటయోధుడు క్రిస్టియానో రొనాల్డో 123 గోల్స్‌తో టాప్‌లో ఉంటే అలీ డాయ్ (109), మెస్సీ (103) గోల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సునీల్ ఛెత్రీ 90 అంతర్జాతీయ గోల్స్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. అలీ డాయ్ రిటైర్ కావడంతో ప్రస్తుత తరంలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన టాప్ 3 ప్లేయర్లు రొనాల్డో, మెస్సీ, సునీల్ ఛెత్రీయే..