MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • అభిషేక్‌కు గట్టి వార్నింగ్.. హైరిస్క్ క్రికెట్ ఆడోద్దంటూ హెచ్చరిక

అభిషేక్‌కు గట్టి వార్నింగ్.. హైరిస్క్ క్రికెట్ ఆడోద్దంటూ హెచ్చరిక

Abhishek Sharma: యువ క్రికెటర్ అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. కేవలం దూకుడు మాత్రమే కాదని షాట్ల ఎంపికలో జాగ్రత్త అవసరమని అభిషేక్‌కు సూచించారు.

2 Min read
Author : Pavithra D
Published : Nov 11 2025, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్‌కు వార్నింగ్
Image Credit : Twitter

అభిషేక్‌కు వార్నింగ్

భారత క్రికెట్‌లో ఓపెనర్ గా అదరగొడుతున్న యువ ఆటగాడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీజ్ లోకి వచ్చాడంటే తనదైన షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే అభిషేక్ దూకుడును ఆసిస్ బౌలర్లు వైవిధ్యభరితమైన బంతులతో కొంత కట్టడి చేయగలిగారు. అయినప్పటికీ ఆసిస్ తో జరిగిన ఐదు టీ ట్వంటీ సిరీస్ లో అభిషేక్ శర్మనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో, దూకుడు అన్నిసార్లు పనికిరాదంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ కు హెచ్చరిక జారీ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భయం కనపడని బ్యాటింగ్
Image Credit : Getty

భయం కనపడని బ్యాటింగ్

అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో భయం కనపడదని, దూకుడు ప్రదర్శిస్తూ భారీ షాట్లు ఆడతాడని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్నవి ద్వైపాక్షిక సిరీస్ లు మాత్రమేనని, ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లలో జట్లు చాలా సన్నాహాలతో వస్తాయని గుర్తు చేశారు. ప్రపంచకప్ వంటి వేదికలపై అభిషేక్ ప్రతి బంతిని క్రీజ్ వదిలి బయటకు వచ్చి ఆడాలనుకుంటే, ప్రత్యర్థి జట్టు బౌలర్లు దీనిపైనే దృష్టి పెడతారని పఠాన్ స్పష్టం చేశారు.

35
షాట్స్ ఎంపికలో మరింత జాగ్రత్త
Image Credit : Getty

షాట్స్ ఎంపికలో మరింత జాగ్రత్త

అందువల్ల, అభిషేక్ షాట్ల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. టీమ్ మేనేజ్మెంట్ కచ్చితంగా దీనిపై దృష్టి పెడుతుందని తాను అనుకుంటున్నానని తెలిపారు. అలాగే, అతని వ్యక్తిగత కోచ్ యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఇర్ఫాన్ పఠాన్ కోరారు. "యువితో నేను మాట్లాడతా. ఆ దూకుడు అన్నిసార్లు పనిచేయదు. అందరి బౌలింగ్ లో ఇన్నింగ్స్ తొలి బంతికే ముందుకు వచ్చి భారీ షాట్ ఆడటం కష్టం" అని ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించారు.

45
ఆ సంఘటన గుర్తు చేసుకో..
Image Credit : Getty

ఆ సంఘటన గుర్తు చేసుకో..

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 వర్షం కారణంగా రద్దైన మ్యాచ్ లోని ఒక సంఘటనను ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా 4.5 ఓవర్లు ఆడింది. ఈ ఇన్నింగ్స్ లో 13 బంతుల్లో 23 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, రెండుసార్లు ఆసిస్ ఫీల్డర్ల సులువైన క్యాచ్ లు వదిలేయడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

55
 హై రిస్క్ క్రికెట్  వద్దు
Image Credit : Getty

హై రిస్క్ క్రికెట్ వద్దు

ఈ విషయంపై కూడా ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ, ఐదో టీ20లో రెండుసార్లు అభిషేక్ కు లైఫ్ వచ్చిందని, అందులో ఏ ఒక్క క్యాచ్ పట్టినా అతడి ఇన్నింగ్స్ ముగిసేదని పేర్కొన్నారు. అతడు హై రిస్క్ క్రికెట్ ఆడుతూనే ఉంటాడని, అది ఎప్పటికైనా ప్రమాదమేనని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2025: ఐపీఎల్ 2025 బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ ఎవరు? ఫ్యాన్స్ సర్వేలో టాప్ లో నిలిచింది ఎవరు?
Recommended image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved