ఐపీఎల్ 2024 : 13కోట్ల ఆటగాడికి సన్ రైజర్స్ హైదరాబాద్ గుడ్ బై.. అతడి బాటలోనే మరికొందరికి కూడా...
ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు సన్ రైజర్స్ తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మార్పుల్లో భాగంగానే జట్టు హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు పడనున్నట్లు సమాచారం.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 20 23 సీజన్లో దారుణంగా వైఫల్యం చవిచూసింది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబరిచింది. అభిమానులను తీవ్రంగా నిరాశలో ముంచింది. ఎస్ఆర్ హెచ్ ఈ ఏడాది సీజన్లో జట్టుకు కొత్త హెడ్ కోచ్, కొత్త కెప్టెన్ వచ్చారు. వీరితో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్.. సరైన ఆటతీరు ప్రదర్శించలేదు. పాత ఆటతీరు మారలేదు.
ఐపీఎల్ 2023లో ఆరెంజ్ ఆర్మీ 14 మ్యాచ్ లు ఆడింది. కానీ, కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్ హెచ్ చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ తమ జట్టును ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు మరోసారి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మార్పుల్లో, ప్రక్షాళనలో భాగంగానే జట్టు హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు పడనుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం.
జట్టును ప్రక్షాళన చేయడంలో కాస్త కఠినంగానే వ్యవహరించనున్నారట. గత సీజన్లో నిరాశపరిచిన కొంతమంది ఆటగాలను కూడా ఎస్ఆర్ హెచ్ ఇలాగే వదులుకోవాలని యోచిస్తోందట. జట్టు నుండి ఉద్వాసన అయ్యే వారిలోముందు వరుసలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీబూక్ ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సన్ రైజర్స్ హరీబ్రూక్ కోసం రూ.13.25కోట్లు ఖర్చు పెట్టారు. కానీ హరీబ్రూక్ 11 మ్యాచులు ఆడి..190 పరుగులు మాత్రమే చేశాడు. అతని దారుణ వైఫల్యాన్ని చూసి అభిమానులు తీవ్ర నిరాశపడ్డారు. ఇంత దారుణమైన వైఫల్యం నేపథ్యంలోనే ఎస్ఆర్హెచ్ హరీబ్రూక్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక అతని తర్వాత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ లు ఉన్నారు. ఎనిమిది కోట్ల భారీ ధరకు వీరిని కొనుగోలు చేశారు. వీరిని కూడా వదులుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధపడింది.
గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. టోర్నీ మొత్తం ఆడిన ఉమ్రాన్ మాలిక్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఉమ్రాన్ మాలిక్ ఏడాది సీజన్లో ఎనిమిది మ్యాచ్ లు ఆడాడు. కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు.
ఇక వీరితోపాటు ఇంకొంతమందికి కూడా ఎస్ఆర్ హెచ్ ఉద్వాసన పలకనున్నట్లుగా వినిపిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.