- Home
- Sports
- Yashasvi Jaiswal : 24 ఏళ్లకే ఇన్ని సెంచరీలేంటి గురూ..! డాన్ బ్రాడ్‌మన్, సచిన్ రికార్డుల లిస్ట్ లోకి జైస్వాల్
Yashasvi Jaiswal : 24 ఏళ్లకే ఇన్ని సెంచరీలేంటి గురూ..! డాన్ బ్రాడ్‌మన్, సచిన్ రికార్డుల లిస్ట్ లోకి జైస్వాల్
India vs West Indies, Yashasvi Jaiswal : ఇండియా, వెస్టిండిస్ మధ్య స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో జైస్వాల్ అదరగొట్టాడు. తన ఖాాతాలో మరో సెంచరీ వేసుకుని బ్రాడ్‌మన్, సచిన్ రికార్డుల లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు.

యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ
IND vs WI Test : టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. వెస్టిండిస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా అతడి బ్యాటింగ్ సాగింది. ఆరంభంనుండి దూకుడుగా ఆడిన జైస్వాల్ టెస్ట్ క్రికెట్ లో మరో అద్భుత సెంచరీ సాధించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన అభిమానులను వన్టే, టీ20 స్థాయి అనుభూతిని కల్పిస్తూ యశస్వి బ్యాటింగ్ సాగింది.
రాహుల్ మిస్సయ్యాడు... యశస్వి సాధించాడు
అహ్మదాబాద్ టెస్ట్ విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా డిల్లీ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టిన కెఎల్ రాహుల్ తో కలిసి యశస్వి జైస్వాల్ చాలా దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఈ క్రమంలో రాహుల్ హాఫ్ సెంచరీకి చేరువలో 38 పరుగుల వద్ద ఔటయ్యాడు. వికెట్ పడినా జైస్వాల్ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గలేదు. సాయి సుదర్శన్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తూనే అద్భుత సెంచరీ సాధించాడు.
𝘼 𝙏𝙧𝙚𝙢𝙚𝙣𝙙𝙤𝙪𝙨 𝙏𝙤𝙣 💯
Yashasvi Jaiswal with another special innings filled with grind and composure👏
Updates ▶ https://t.co/GYLslRzj4G#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19pic.twitter.com/DF5SbpagLI— BCCI (@BCCI) October 10, 2025
జైస్వాల్ ఖాతాలో అరుదైన రికార్డ్
ఈ సెంచరీతో జైస్వాల్ ఖాతాలో అనేక రికార్డులు చేరాయి. టెస్ట్ కెరీర్ లో ఇది ఏడో సెంచరీ... అతి తక్కువ సమయంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు టీమిండియా ఓపెనర్ల జాబితాలో జైస్వాల్ చేరిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఇటీవల కాలంలో బెన్ డకెట్ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు జైస్వాల్ సొంతమయ్యింది.
బ్రాడ్ మన్, సచిన్, సోబెర్స్ తర్వాత జైస్వాలే...
ఇంకా ఆసక్తికరమైన రికార్డ్ ఏంటంటే అతి చిన్నవయసులో అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డ్ జైస్వాల్ సొంతమయ్యింది. ఇప్పటివరకు 24 ఏళ్ల వయసులో డాన్ బ్రాడ్ మన్ 12, సచిన్ టెండూల్కర్ 11, గార్ఫీల్డ్ సోబెర్స్ 9 సెంచరీలు సాధించారు... వీరితర్వాత ఇంతచిన్న వయసులో 7 సెంచరీలు సాధించిన ఘనత జైస్వాల్ దే. జావెద్ మియాందాద్, గ్రేమ్ స్మిత్, అలస్టర్ కుక్, కేన్ విలియమ్సన్ కూడా 24 ఏళ్ళలోపే ఏడు సెంచరీలు సాధించారు. మరో సెంచరీ బాదితే వీరందరిని జైస్వాల్ వెనక్కి నెడతాడు.
టీమిండియా ఆధిక్యం
మొత్తంగా జైస్వాల్ అద్భుత సెంచరీ టీమిండియా స్కోరు కేవలం వికెట్ నష్టానికి 200 దాటింది. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తిచేసి సెంచరీవైపు దూసుకుపోతున్నాడు. ఇలా గత అహ్మదాబాద్ టెస్ట్ మాదిరిగా ఇద్దరుముగ్గురు ఇండియన్ ప్లేయర్లు సెంచరీలు సాధిస్తారేమో అనేలా టీమిండియా ఇన్నింగ్స్ సాగుతోంది. వెస్టిండిస్ బౌలర్లు మరోసారి విఫలమవుతున్నారు.