- Home
- Sports
- కోకాకోలా బాటిల్స్ తీసి పక్కనపెట్టిన రొనాల్డో... కూల్‌డ్రింక్స్ కంపెనీకి 30 వేల కోట్ల నష్టం...
కోకాకోలా బాటిల్స్ తీసి పక్కనపెట్టిన రొనాల్డో... కూల్‌డ్రింక్స్ కంపెనీకి 30 వేల కోట్ల నష్టం...
ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్, సంపాదన ఆర్జిస్తున్న స్పోర్ట్స్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ఈ ఫుట్‌బాల్ దిగ్గజం చేసిన ఓ చిన్న పని, శీతల పానియాల కంపెనీ కోకాకోలాకి రూ.30 వేల కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది...

అనేక బ్రాండ్లకి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పోర్చుగ్రీస్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడడు..

తాజాగా యూరో 2020 ప్రెస్ కాన్ఫిరెన్స్‌కి హాజరైన క్రిస్టియానో రొనాల్డోకి తాగడానికి, ప్లస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోకాకోలా బాటిళ్లను అతని ముందు పెట్టారు నిర్వహాకులు...

కాన్ఫిరెన్స్ మొదలైన తర్వాత వాటిని చూసిన రొనాల్డో, తీసి పక్కనపెట్టాడు. తాను తెచ్చుకున్న వాటర్ బాటిల్‌ను తాగుతానంటూ సైగలతో చూపించాడు...

రొనాల్డో చేసిన ఈ చిన్న పని కూల్‌డ్రింక్స్ తయారీలో దిగ్గజంగా మారిన కోకాకోలాపై తీవ్రంగా ప్రభావం చూపించింది. రొనాల్డో కోకాకోలా బాటిల్స్ పక్కనబెట్టిన తర్వాత ఆ కంపెనీ షేర్లు 1.6 శాతం పడిపోయాయి.

షేర్ల ధర పడిపోవడం ద్వారా కంపెనీ విలువ 242 బిలియన్ డాలర్ల నుంచి 238 బిలియన్లకు పడిపోయింది. అంటే దాదాపు 4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. అంటే దాదాపు 30 వేల కోట్ల రూపాయాల నష్టం...

ప్రపంచంలోనే అత్యధిక ప్రొఫెషనల్, అంతర్జాతీయ గోల్స్ చేసిన ఫుల్‌బాల్ ప్లేయర్‌గా ఉన్న క్రిస్టియానో రొనాల్డో, ఏటా బిలియన్ డాలర్ల దాకా సంపాదిస్తున్నాడు.

యూరో కప్ 2020లో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చిన రొనాల్డో, హంగేరీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి పోర్చుగల్‌ను గెలిపించాడు...

యూరో ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచిన రొనాల్డో, 9 గోల్స్‌తో ఉన్న ఫ్రాన్స్ ప్లేయర్ మిచెల్ ఫ్లాటినీని అధిగమించాడు.

మన హీరోలు డబ్బుల కోసం ఆరోగ్యానికి హాని చేసే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్‌ను ప్రమోట్ చేస్తుంటే... రొనాల్డో మాత్రం మంచి నీళ్లు తాగాలని చెప్పి అందరి మనసు గెలుచుకున్నాడు.