- Home
- Sports
- అంతా వచ్చి మీద పడుతున్నా రఫ్ఫాడించిన ఇమ్మాన్యుయేల్.. గేమ్ ఆడలేక బాత్రూంకి వెళ్లి తనూజ ఏడుపు
అంతా వచ్చి మీద పడుతున్నా రఫ్ఫాడించిన ఇమ్మాన్యుయేల్.. గేమ్ ఆడలేక బాత్రూంకి వెళ్లి తనూజ ఏడుపు
బిగ్ బాస్ తెలుగు 9 షోలో 25 వ రోజు హైలైట్ గా నిలిచింది ఇమ్మాన్యుయేల్. తన ఫైటింగ్ స్పిరిట్ తో రఫ్ఫాడించాడు. కెప్టెన్సీ కంటెండర్ గా అర్హత సాధించాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ తెలుగు 9 డే 25 హైలైట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో 25వ రోజు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు ఫిజికల్ గా ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. 25వ రోజు బిగ్ బాస్ హౌస్ లో విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పవర్ కార్డు కోసం టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు ఎల్లో టీం, రెడ్ టీం, బ్లూ టీంలుగా పోటీ పడ్డారు.
పవర్ కార్డు టాస్క్
ఈ టాస్క్ ప్రకారం బజర్ మోగగానే హౌస్ లో ఒక చోట ఆరెంజ్ కలర్ బాల్ ఉంటుంది. దానిని తీసుకుని గార్డెన్ లో ఉన్న హిప్పోకి ఆహారంగా వేయాలి. ఒక టీం సభ్యులు బాల్ తీసుకుని వెళుతున్నప్పుడు మరో టీమ్ సభ్యులు అడ్డుకోవచ్చు. ముందుగా ఎవరు లైన్ క్రాస్ చేసి హిప్పోకి బాల్ ని ఆహారంగా వేస్తారో వారికి పాయింట్ లభిస్తుంది. ఎవరు ఎక్కువ సార్లు బంతిని హిప్పోకి ఆహారంగా వేస్తే వాళ్ళు విజేతలు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడ్డారు.
పట్టువదలని విక్రమార్కుడిలా ఇమ్మాన్యుయేల్
బంతిని తీసుకువెళ్ళడానికి, తీసుకువెళుతున్న వారిని అడ్డుకోవడానికి బాగా ఫిజికల్ అయ్యారు. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ ఈ టాస్క్ లో బాగా హైలైట్ అయ్యాడు. ఇమ్మాన్యుయేల్ పట్టువదలని విక్రమార్కుడిలా ఎంతమంది తనని అడ్డుకుంటున్న బంతిని వదిలిపెట్టలేదు. ఈ క్రమంలో ఇమ్మాన్యూల్ పై ఇతర టీం సభ్యులు పడ్డారు. కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుండడంతో సంచాలకుడు భరణి గేమ్ ని పాస్ చేశారు. రూల్స్ ప్రకారం ఆడినా తమకి పాయింట్ ఇవ్వలేదని తనూజ భరణితో వాగ్వాదానికి దిగింది. చివరికి ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ రెడ్ టీం విజయం సాధించింది. దీనితో వారికి పవర్ కార్డు లభించింది. అదే విధంగా కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్లుగా అర్హత సాధించారు. మిగిలిన కెప్టెన్సీ కంటెండర్లని డిసైడ్ చేసే టాస్క్ లో పోటీదారులని ఎంచుకునే అవకాశం కూడా బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ లకు ఇచ్చారు.
కెప్టెన్సీ కంటెండర్లుగా కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్
వీరిద్దరూ 3 జంటలని ఎంపిక చేయాలని బిగ్ బాస్ కోరారు. దీనితో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ లో పాల్గొనే 3 జంటలని ఎంపిక చేశారు. సుమన్, తనూజ.. సంజన, రాము.. రీతూ, ఫ్లోరా షైనీ ఆ మూడు జంటలుగా ఎంపిక అయ్యారు. ముందుగా తనూజ, సుమన్ పోటీ పడ్డారు. ఈ టాస్క్ లో భాగంగా టైర్లు, వుడెన్ బ్లాక్స్ లాంటి దశలు దాటుకుని వెళ్లి చివర్లో ఉన్న బోన్ ని అందుకోవాలి. అలా అందుకున్న వారు విజేతలు. అయితే ఈ టాస్క్ లో తనూజ, సుమన్ ఇద్దరూ రూల్స్ మిస్ అయ్యారు.
వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ
వుడెన్ బ్లాక్ దాటుకుని వెళ్లడంలో వీరిద్దరూ తప్పులు చేశారు. దీనితో సంచాలకులు ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఇద్దరూ వారిని డిస్ క్వాలిఫై చేశారు. దీనితో తనూజ వాష్ రూమ్ కి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెని రీతూ చౌదరి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సంజన, రాము పాల్గొన్నారు. ఈ పోటీలో రాము విజేతగా నిలిచాడు. ఆ తర్వాత రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో రీతూ విజేతగా నిలిచింది. మొత్తంగా కెప్టెన్సీ కంటెండర్లుగా కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, రాము, రీతూ అర్హత సాధించారు.