- Home
- Sports
- శరత్ ‘కమాల్’ షో... కామన్వెల్త్ గేమ్స్ 2022లో 56 దేశాల కంటే ఎక్కువ మెడల్స్ గెలిచిన ఒకే ఒక్కడు...
శరత్ ‘కమాల్’ షో... కామన్వెల్త్ గేమ్స్ 2022లో 56 దేశాల కంటే ఎక్కువ మెడల్స్ గెలిచిన ఒకే ఒక్కడు...
ఆచంట శరత్ కమల్... చాలామంది భారతీయులకు పెద్దగా పరిచయం లేని పేరు. అయితే టేబుల్ టెన్నిస్‌లో అతనో లెజెండ్. తమిళనాడులోని చెన్నైలో పుట్టిన శరత్ కమల్... ప్రపంచ వేదికలపై భారత బ్యాడ్మింటన్ పరువును కాపాడుతూ, పతకాల పంట పండిస్తున్నాడు...

Sharath Kamal
2004 ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ పాల్గొన్న శరత్ కమల్, 18 ఏళ్లుగా ఆటలో కొనసాగుతూనే ఉన్నాడు. 2018 జకర్తా ఏషియన్ గేమ్స్‌లో మెన్స్ టీమ్ ఈవెంట్‌లో, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన శరత్ కమల్, 2021 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఈ రెండు ఈవెంట్లలోనే కాంస్య పతకాలు సాధించాడు...
Getty
కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం శరత్ కమల్‌కి తిరుగులేని రికార్డు ఉంది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ (శ్రీజ ఆకులతో కలిసి), మెన్స్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించిన శరత్ కమల్, మెన్స్ డబుల్స్‌లో సాథియన్‌తో కలిసి రజతం సాధించాడు...
Getty
అంటే కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ 22 స్వర్ణాలు సాధిస్తే, అందులో శరత్ కమల్ ఒక్కడే మూడు స్వర్ణాల్లో భాగస్వామిగా ఉన్నాడు...
కామన్వెల్త్ గేమ్స్‌లో 72 దేశాలు పాల్గొంటే, అందులో 16 దేశాలు మాత్రమే 3 లేదా అంతకంటే ఎక్కువ గోల్డ్ మెడల్స్ సాధించాయి. పొరుగుదేశం పాకిస్తాన్ కూడా రెండు స్వర్ణాలు మాత్రమే సాధించగలిగింది. అంటే శరత్ కమల్ ఒక్కడూ 56 దేశాల కంటే ఎక్కువ మెడల్స్ సాధించాడు...
2006 మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్, మెన్స్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణ పతకాలు గెలిచిన శరత్ కమల్, 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మెన్స్ డబుల్స్‌లో స్వర్ణం సాధించాడు...
2010లో మెన్స్ సింగిల్స్, మెన్స్ టీమ్ ఈవెంట్లలో కాంస్యం సాధించిన శరత్ కమల్, 2014లో మెన్స్ డబుల్స్‌లో రజతం, 2018లో మెన్స్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గాడు. మెన్స్ డబుల్స్‌లో రజతం నెగ్గి, మెన్స్ సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచాడు...
మొత్తంగా భారత టీటీ లెజెండ్ శరత్ కమల్ ఖాతాలో ఇప్పటికే 8 కామన్వెల్త్ స్వర్ణాలు, మూడు రజతాలు, మరో మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ చరిత్రలో భారత్ 200 స్వర్ణాలు సాధిస్తే, అది 4 శాతం.. కమల్ పేరు మీదే ఉన్నాయి...
40 ఏళ్ల శరత్ కమల్, మరో నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడాలని అనుకుంటున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత టీటీ బృందానికి సారథిగా వ్యవహరించిన మూడో రౌండ్‌లోకి ప్రవేశించినా పతకం మాత్రం గెలవలేకపోయాడు.