మాఘ మాసం 2024: ఈ రోజు నుంచే మాఘ మాసం మొదలు.. ఈ పనులు చేస్తే ఆర్థిక ఇబ్బందులుండవ్
Magha Masam 2024: మాఘ మాసాన్ని చాలా పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో స్నానానికి, తపస్సుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసంలో విష్ణువు, కృష్ణుడు, సూర్యభగవానుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. రోజూ పూజించడం వల్ల భక్తులకు సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.
magha masam
Magha Masam 2024: సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసాన్ని కూడా ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ మాసంలో స్నానానికి, దానం, ఉపవాసం, తపస్సుకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది మాఘ మాసం జనవరి 26న ప్రారంభమై.. ఫిబ్రవరి 24న ముగుస్తుంది. మాఘ మాసంలో శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడు, సూర్యభగవానుడు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఈ మాసంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల జీవితంలో వచ్చే సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం. మాఘ మాసంలో చేయాల్సిన కొన్ని నివారణల గురించి ఇప్పడు తెలుసుకుందాం..
magha masam
మాఘ మాస నివారణలు
మాఘ మాసంలో శనివారం నాడు నల్ల మినప్పప్పు, నల్ల నువ్వులను ఒక గుడ్డలో కట్టి పేదవారికి దానం చేయాలి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే మీరు ఆర్థిక ఇబ్బందులను కూడా వదిలించుకుంటారు.
మాఘ మాసంలో ప్రతిరోజూ శివలింగానికి నల్ల నువ్వులు, నీళ్లతో అభిషేకం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ క్రింది మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల వ్యాధుల నుంచి బయటపడొచ్చని నమ్ముతారు.
'ఓం నమః శివాయ'
మాఘ మాసంలో రోజూ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. పూజ చేయాలి. అవసరమైన వారికి వెచ్చని వస్త్రాలను దానం చేయడం వల్ల దేవతలను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే సకల బాధలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది.
మీ వద్ద డబ్బు లేకపోతే నల్ల నువ్వులను కుటుంబ సభ్యులందరి నుంచి ఏడుసార్లు తీసుకొని ఇంటి ఉత్తర దిశలో విసిరేయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఆర్థిక నష్టం జరగదని, డబ్బు కూడుతుందని నమ్మకం ఉంది.