సోమవారం నాడు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి..
సనాతన ధర్మంలో సోమవారం పరమేశ్వరునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల జీవితం సంతోషంగా సాగుతుందనే నమ్మకం ఉంది. అంతేకాదు భక్తుల కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం సోమవారం నాడు శివానుగ్రహం కోసం ఏం పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దేవతల దేవుడైన మహాదేవుని రూపం ఎంతో దివ్యమైనది, పవిత్రమైనది. సనాతన ధర్మంలో సోమవారం శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున పరమేశ్వరున్ని పూజిస్తారు. ఈ రోజు శివుడిని పూజించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. దీంతో మన కష్టాలన్నీ తొలగిపోతాయి. జ్యోతిషశాస్త్రంలో.. సోమవారం నాడు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వీటివల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇళ్లు ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. జీవితంలో విజయం కూడా సాధిస్తారు. ఇందుకోసం ఈ రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే పంచామృతంతో పరమేశ్వరుడిని పూజించండి. ఆ తర్వాత పంచాక్షరీ మంత్రం 'ఓం నమః శివాయ'తో పాటుగా శివ మంత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. అలాగే వీరి బంధం మధురంగా ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు శివ పూజ వల్ల మీకు డబ్బుకు ఏ లోటూ ఉండదు.
మీరు జీవితంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్టైతే సోమవారం నాడు శివుడిని ఖచ్చితంగా పూజించండి. అలాగే శివ చాలీసా, శివ మంత్రాలను పఠించండి. ఈ పరిహారం చేయడం వల్ల జీతంలో వచ్చే అన్ని సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శివుని ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఆ తర్వాత శివుడిని పూజించాలి. ఆ తర్వాత ముడి బియ్యాన్ని ఒక పేద వ్యక్తికి భక్తి ప్రకారం దానం చేయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలవంతుడవుతాడని చెప్తారు. జాతకంలో బలమైన చంద్రుడు ఉండటం వల్ల ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడు.
సోమవారం శివారాధన సమయంలో శివ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించండి. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న ప్రతి రోగమూ నయమవుతుందని పండితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు.