రేపు రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం మర్చిపోవద్దు, దైవ శక్తి తోడవుతుంది
రాఖీ పండుగ రోజు రాఖీ కట్టేటప్పుడు కచ్చితంగా రక్షా సూత్ర మంత్రాన్ని చదవాలి. ఇది ఎంతో పరమ పవిత్రమైనది. అలాగే శక్తివంతమైనది కూడా. ఆ రక్షాసూత్ర మంత్రం ఏమిటో తెలుసుకోండి.

రక్షా బంధన్ 2025
భారతదేశమంతా అన్నా చెల్లెలు, అక్కాా తమ్ముళ్లు వేడుకగా చేసుకునే పండుగ రక్షాబంధన్. సోదరుల మణికట్టుపై ప్రకాశవంతమైన రాఖీని కట్టి సోదరీమణులు తమను రక్షించమని కోరుతారు. స్వీట్ తినిపించి జీవితాంతం రక్షణగా ఉండమని రాఖీని కడతారు. ఈ చిరునవ్వుల వేడుకలో ఎంతో ఆధ్యాత్మిక కూడా దాగి ఉంది. రాఖీని కట్టేటప్పుడు రక్షా సూత్ర మంత్రాన్ని కచ్చితంగా చదవాలి. ఆ రక్షా స్తోత్రం మంత్రం ఏమిటో తెలుసుకోండి.
రక్షా సూత్ర మంత్రము దాని అర్థము
ఓం యేన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః,
తేన త్వం ప్రతి-బధ్నామి రక్షా మా చల మా చల
ఈ రక్షా సూత్రానికి అర్థం బలి రాజుకు లక్ష్మీదేవి కట్టినట్లే నేను కూడా ఈ పవిత్ర దారాన్ని మీకు కట్టాను. అది ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతుంది. మన ఇద్దరినీ ఎప్పటికీ విడిపోకుండా చేస్తుంది అని అర్థము. ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది. శక్తివంతమైన రాక్షస రాజు బలి పురాణానికి సంబంధించినది.
బలి కథ
బలిని రక్షించడానికి, ఆశీర్వదించడానికి ఒక సంఘటనలో విష్ణువు బలి మణికట్టుపై ఈ పవిత్రమైన రాఖీని కట్టాడని చెబుతారు. మరొక కథనం ప్రకారం లక్ష్మీదేవి తన భర్త కోసం బలిని సోదరుడిగా భావించి రాఖీ కట్టిందని వివరిస్తారు. ఏది ఏమైనా ఈ రక్షా సూత్రం మీ సోదరుడికి, మీకు కూడా రక్షణను అందిస్తుంది.
భావోద్వేగ పండుగ
రాఖీ పండుగను సోదరీ సోదరుల మధ్య భావోద్వేగ పండుగగా చెప్పుకోవాలి. ఈ మంత్రాల జపం దానికి అదనపు శక్తిని అందిస్తుంది. సన్నని దారం రూపంలోనే సోదరి తన అన్నకు లేదా తమ్ముడికి కట్టే రాఖీ ప్రేమకు చిహ్నం. ఇది ఈ ఆధ్యాత్మిక మంత్రాల కంపనాల ద్వారా దైవ శక్తితో కూడిన కవచంలాగా మారుతుంది. అందుకే రాఖీ కట్టేటప్పుడు ఈ రక్షా సూత్రాన్ని చదవడం మర్చిపోవద్దు.
శారీరక మానసిక ఆరోగ్యానికి
రాఖీని కట్టేటప్పుడు పైన చెప్పిన రక్షా సూత్రాన్ని జపించడం అనేది కేవలం ఆచారబద్ధమైనది మాత్రమే కాదు. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ శారీరకంగా, మానసికంగా ఎలాంటి హాని కలగకుండా ఆరోగ్యంగా ఉండేందుకు రక్షణ మంత్రం కూడా. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆ రాఖీని ధరించిన వ్యక్తి జీవితానికి రక్షణ బలం, దైవిక ఆశీర్వాదం దక్కుతుంది.