రేపే శ్రావణ పౌర్ణమి.. ఆ రోజు ఈ వస్తువులు దానం చేయండి చాలు అప్పులు తీరిపోతాయి
హిందూ మత శాస్త్రాలు చెబుతున్న ప్రకారం శ్రావణమాసంలోని పౌర్ణమి తేదీ ఎంతో పవిత్రమైనది. ఈ రోజున కొన్ని రకాల ప్రత్యేక వస్తువులను దానం చేస్తే శివుని అనుగ్రహం దక్కుతుంది. ఈ విధానాలను పవిత్రమైనవిగా చెప్పుకుంటారు. ఏ వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి.

శ్రావణ పౌర్ణమి దానాలు
శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శనివారం శ్రావణమాస పౌర్ణమి తిథి వస్తోంది. ఈరోజున చేసే దానానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల ఆ మహాశివుడు ఆశీర్వాదం పొందవచ్చని చెబుతారు. ఈ దాన ఫలితము జీవితంలోని అనేక సమస్యలను తొలగిస్తుందని, సానుకూల శక్తిని ప్రసరించేలా చేస్తుందని, ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. శ్రావణ పౌర్ణమి నాడు ఏమి దానం చేయాలో తెలుసుకోండి.
ఆహారం, దుస్తులు, డబ్బు
అవసరంలో ఉన్నవారిని మొదటగా గుర్తించండి. వారు ఖచ్చితంగా పేదవారై ఉండాలి. శ్రావణమాసంలోని పౌర్ణమి నాడు ఆ పేదలకు అవసరమైన ఆహారము, దుస్తులు, డబ్బు వంటివి దానం చేయండి. మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ దానాన్ని ఎంతో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ దానం వల్ల మీ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. దానం చేసే వ్యక్తి వాటిని ఆనందంగా, సంతృప్తిగా తీసుకునేటట్టు చేయాలి. ఆ వ్యక్తికి పొట్ట నిండేంత ఆహారాన్ని దానం చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే దానాన్ని చూసి ఎదుట వ్యక్తి సంతృప్తి పడితేనే మీకు ఆ దాన ఫలితాలు దక్కుతాయి.
బెల్లం
బెల్లాన్ని దానం చేయడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. అలాగే చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవని అంటారు. బెల్లం ఒక వ్యక్తి జీవితంలోని చేదును తొలగించి తీపి రోజులను నింపుతుంది. అలాగే ఆనందం, సానుకూల శక్తి జీవితంలో ప్రవేశించేలా చేస్తుంది. వారి జీవితంలో భయం, ఆందోళన వంటివి కలగకుండా కాపాడుతుంది.
నువ్వులు
శ్రావణమాసం పౌర్ణమి నాడు నువ్వులను దానం చేస్తే ఎంతో మంచిది. అలా దానం చేస్తే పితృ దోషం నుండి విముక్తులు అవుతారని అంటారు. నువ్వుల దానం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. సంపద పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అప్పులతో బాధపడుతున్న వారు శనివారం నువ్వులు దానం చేసేందుకు ప్రయత్నించండి. అయితే శనివారం పూట నువ్వులు దానాన్ని అందరూ తీసుకోరు. ముందుగానే బ్రాహ్మణులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
దీప దానం
శ్రావణ పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్లి అక్కడ దీపం వెలిగించండి. శివుడి ముందే దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించి దీపదానం చేస్తున్నట్టు నమస్కరించుకోండి. ఈ దీపదానం శివుడుని ఎంతో ప్రసన్నం చేస్తుంది. మిమ్మల్ని అప్పుల నుండి గట్టెక్కేలా చేస్తుంది. మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శివాలయంలో వెలుగుతున్న దీపం నీ జీవితంలోని అజ్ఞానాన్ని తొలగించి మీకు ఆనందాన్ని ఇస్తుంది.