సెక్స్ తర్వాత బ్లీడింగ్ అవుతోందా? కారణాలు ఇవే కావొచ్చు జాగ్రత్త..
సెక్స్ లైఫ్ మీ అనుబంధాన్ని పెంచడమే కాదు మీకు ఎన్నో రోగాల ముప్పును కూడా తప్పిస్తుంది. కానీ సెక్స్ వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకూడదు. అయితే కొంతమందికి సెక్స్ సమయంలో లేదా సెక్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుంటుంది. ఇలా ఎందుకవుతుందంటే?
Image: Getty
సెక్స్ మీ రిలేషన్ షిప్ ను మెరుగుపరుస్తుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కానీ చాలా మంది ఆడవారు సెక్స్ సమయంలో ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది యోనిలో నొప్పి కలిగితే.. ఇంకొంతమంది రక్తస్రావం అవుతుంది. సెక్స్ తర్వాత బ్లీడింగ్ కావడాన్ని వైద్యపరంగా పోస్ట్కోటైల్ రక్తస్రావం అంటారు. కానీ ఇది అంత ప్రమాదకరమైన సమస్యేమీ కాదు. సెక్స్ తర్వాత యోని నుంచి రక్తస్రావం ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
యోని పొడిబారడం
యోని పొడిబారడం వల్ల కూడా సెక్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. యోని పొడిబారడానికి అసలు కారణం.. యోనికి సరైన ల్యూబ్రికెంట్ అందదు.ఇది సెక్స్ సమయంలో ఘర్షణ, చికాకును, నొప్పిని కలిగిస్తుంది. ఇది యోని గాయాలకు కారణమవుతుంది. ఫలితంగా సెక్స్ తర్వాత రక్తస్రావం జరుగుతుంది. హార్మోన్ల మార్పుల వల్లే యోని పొడిబారుతుందని నిపుణనులు చెబుతున్నారు. ముఖ్యంగా రుతువిరతి సమయంలో.. ఎందుకంటే ఈ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ తల్లి పాలివ్వడం, కొన్ని మందులు, ఒత్తిడి లేదా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా యోని పొడిబారడానికి దారితీస్తాయి.
లైంగిక సంక్రమణ వ్యాధులు
లైంగిక సంక్రమణ వ్యాధులు కూడా సెక్స్ తర్వాత రక్తస్రావానికి దారితీస్తాయి. ముఖ్యంగా సంక్రమణ గర్భాశయంలో మంటను కలిగిస్తే.. దీనిని గర్భాశయ శోథ అంటారు. క్లామిడియా, గోనేరియా, ట్రైకోమోనియాసిస్, హెర్పెస్ వంటి ఎస్టీఐలు గర్భాశయ శోథకు కారణమవుతాయి. అందుకే మీకు ఈ ఎస్టీఐలలో ఏ ఒకటి ఉన్నా..సెక్స్ మీ గర్భాశయం, మీ యోని, గర్భాశయం మధ్య ప్రాంతాన్ని చికాకుపెడుతుంది. అలాగే రక్తస్రావాన్ని కలిగిస్తుంది.
బ్యాక్టీరియల్ వాగినోసిస్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్
ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా అది మంట, చికాకును కలిగిస్తుంది. దీని ఫలితంగా సెక్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుంది. ముఖ్యంగా బ్యాక్టీరియల్ వాగినోసిస్ వల్ల. ఇది బ్యాక్టీరియా ఎక్కువగా పెరగడం వల్ల వస్తుంది. ఇది 15 నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో అత్యంత సాధారణ యోని సంక్రమణ. ఆడవారు తమ జీవితంలో ఒక్కసారైనా యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మీ యోని నుంచి తెలుపు లేదా గోధుమ ఉత్సర్గ వస్తుంది. అంతేకాదు యోనిలో దురద లేదా మంట, యోని నుంచి చేపల వాసన రావడం, వాపు కూడా బాక్టీరియల్ వాగినోసిస్ లక్షణాలేనంటున్నారు నిపుణులు.
గర్భాశయ క్యాన్సర్
సర్వైకల్ క్యాన్సర్ కూడా రక్తస్రావానికి దారితీస్తుంది. సెక్స్ సమయంలో రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్ ప్రధాన లక్షణమంటున్నారు నిపుణులు. రక్తస్రావం సాధారణంగా తేలికపాటి, నొప్పిలేకుండా ఉంటుంది. సెక్స్ ఘర్షణ కణజాలాన్ని గాయపరుస్తుంది. అలాగే రక్తస్రావాన్ని కలిగిస్తుంది. పాప్ స్మియర్స్ వంటి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా గర్భాశయ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి చికిత్సతో నయం చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. గర్భాశయ క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ ఇది గర్భాశయ కణజాలంలో మార్పులకు కారణమవుతుంది. దీనివల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సెక్స్ సమయంలో లేదా ఆ తర్వాత.
ఏం చేయాలి?
సెక్స్ తర్వాత బ్లీడింగ్ అయితే ముందుగా మీ పరీయడ్స్ డేట్ ఎప్పుడో తెలుసుకోండి. ఒకవేళ ఇది మీ పీరియడ్స్ సమయం కాకపోతే గైనకాలజిస్ట్ ను తప్పకుండా సంప్రదించండి. అలాగే వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి.