Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship
  • వైబ్రేటర్ ను ఎలా యూజ్ చేయాలో తెలుసా?

వైబ్రేటర్ ను ఎలా యూజ్ చేయాలో తెలుసా?

చాలా మంది స్వీయ ఆనందం కోసం సెక్స్ టాయ్స్, వైబ్రేటర్స్ ను కొంటుంటారు. అయితే వీటిని ఉపయోగించడానికి ముందు కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఎన్నో సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 

Shivaleela Rajamoni | Published : Feb 23 2024, 10:40 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

స్వీయ లైంగిక ఆనందాన్ని పొందడానికి చాలా మంది హస్తప్రయోగం చేస్తుంటారు. అలాగే సెక్స్ టాయ్స్ ను, వైబ్రేట్లను కూడా ఉపయోగిస్తుంటారు. ఇది మంచి లైంగిక ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే మాత్రం మీకు లైంగిక సంక్రమణ వ్యాధులొచ్చే ప్రమాదం చాలా ఉంటుంది. అందుకే వీటిని సురక్షితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. మరి వైబ్రేటర్లను ఉపయోగించేవారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

26
Asianet Image


వైబ్రేటర్ మోడల్ 

మార్కెట్లో ఎన్నో రకాల వైబ్రేటర్లు ఉంటాయి. ఇవి వివిధ ఆకారాలు, సైజుల్లో ఉంటాయి. కానీ మీ ఆకారం, సైజును బట్టి వైబ్రేటర్ ను కొనాలి. తొందరపాటుతో ఏదో ఒకటి కొనేయకండి. ఆ తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మీ కంఫర్ట్, సేఫ్టీని బట్టి వీటిని కొనండి. మీకు అసౌకర్యంగా అనిపించేదాన్ని కొనకండి. ఎందుకంటే ఇది ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకే మీ సౌలభ్యాన్ని బట్టి వైబ్రేటర్ ను కొనండి. 
 

36
Asianet Image

వైబ్రేటర్ రకం

మీరు కొన్న వైబ్రేటర్ మెడికల్-గ్రేడ్ సిలికాన్, బోరోసిలికేట్ గ్లాస్, స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం వంటి లోహాల వంటి పోరస్ కాని పదార్థాలతో తయారుచేయబడిందని నిర్ధారించుకోండి. కొన్ని రకాల వైబ్రేటర్ పదార్థాలు మనకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే  వైబ్రేటర్ ను ఉపయోగించడం వల్ల వాటిలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి మీ శరీరానికి అంటుకుంటాయి. 
 

46
Asianet Image

సూచనలను చదవండి

మీరు వైబ్రేటర్ ను ఉపయోగించే ముందు.. దాని ప్యాకేజింగ్ పై రాసిన సూచనలను ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే వాటిని ఎలా ఉపయోగించాలని పూర్తి ఇన్ఫర్మేషన్ దానిపై ఉంటుంది. అలాగే ఇప్పటికే వైబ్రేటర్ ను ఉపయోగించేవారు ఎవరైనా తెలిసుంటే.. వారిని అడిగి సలహా తీసుకోండి. 
 

56
Asianet Image

క్లీనింగ్ 

వైబ్రేటర్ వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకూడదన్నా.. వాటిని ఉపయోగించిన తర్వాత ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అలాగే వీటిని ఉపయోగించే ముందు కూడా ఖచ్చితంగా క్లీన్ చేయాలి. దీన్ని క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో క్లీనింగ్ ను మాత్రం మర్చిపోకండి. 
 

66
Asianet Image

షేరింగ్ వద్దు

చాలా మంది వైబ్రేటర్ ను శుభ్రం చేసి వేరేవాళ్లు వాడటానికి ఇస్తుంటారు. కానీ షేరింగ్ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. ముఖ్యంగా ఇది లైంగిక సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా లైంగిక సంక్రమణ, ఎస్టీఐల వంటి ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది. అందుకే మీ వైబ్రేటర్ ను ఎవరితోనూ పంచుకోకండి.

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories