భార్యతో గొడవ పడొద్దంటే ఏం చేయాలో తెలుసా?
ఏంటి భార్యతో గొడవ పడకుండా ఉండటం సాధ్యమైన పనేనా అని చాలా మంది భర్తలకు డౌట్ వస్తుంటుంది. కానీ భర్తలు కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే మాత్రం భర్యలతో అస్సలు గొడవలే రావు. అవేంటో ఓ లుక్కేయండి.
Image: Getty
వైవాహిక జీవితంలో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. కానీ ఇవి ఎప్పుడో ఒకసారి వస్తేనే బాగుంటుంది. పదేపదే కొట్లాటలు, గొడవలు జరిగితే జీవితం మీద విరక్తి వస్తుంది. ఏంది లైఫ్ అనిపిస్తుంది. ఏదేమైనా ఈ గొడవలు, కొట్లాటలు రావడానికి ప్రధాన కారణం భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమేనంటారు నిపుణులు. కానీ కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామితో గొడవలు జరిగినప్పుడు పరిస్థితి చేయిదాటిపోతుందని, ఆందోళన పెరుగుతుందని కొంతమంది పురుషులు భావిస్తారు. కానీ పురుషులు ఉద్రిక్తతను తగ్గించడానికి, అనవసరమైన గొడవలను నివారించడానికి కొన్ని చిట్కాలను ఫాలో కావొచ్చు. ఇవి భార్యలతో కొట్లాటలు కాకుండా ఆపుతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
Image: Getty
భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం
విభేదాలు కాస్త వాదనగా మారకుండా ఉండకుండా ఉండటానికి మీరు ముందుగా చేయాల్సిన పని మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం. అవును అభిప్రాయ భేదాలు వస్తున్నాయని భర్తలు గ్రహించినప్పుడు.. తెలివిగా ప్రవర్తించాలి. తెలివైన భర్తలు భార్యతో గొడవకు దిగకుండా వారి మాటలను వినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అలాగే జీవిత భాగస్వామిపై పూర్తి శ్రద్ధ పెడతారు. ఏడుస్తున్నప్పుడు వారిని ఓదార్చడం, వారి భావాలను గుర్తించడం చేస్తే గొడవలే రావు. నీ మాట నేను ఎందుకు వినను లేదా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావో నేను అర్థం చేసుకుంటాను వంటి మాటలను కూడా మీ భార్యతో చెప్పండి. ఇలాంటి మాటలు వారి భావాలను మీరు అర్థం చేసుకుంటున్నారని వారికి అర్థమయ్యేలా చేస్తాయి. భార్యల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వల్ల అసలు గొడవలే రావు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు కొట్లాడటానికి బదులుగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి.
నీ మాట నేను ఎందుకు వినను లేదా నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావో నేను అర్థం చేసుకుంటాను వంటి మాటలను కూడా మీ భార్యతో చెప్పండి. ఇలాంటి మాటలు వారి భావాలను మీరు అర్థం చేసుకుంటున్నారని వారికి అర్థమయ్యేలా చేస్తాయి. భార్యల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వల్ల అసలు గొడవలే రావు. అలాగే సమస్యలు వచ్చినప్పుడు కొట్లాడటానికి బదులుగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి.
వాదన పెరిగేకొద్ది మీ మధ్య దూరం మరింత పెరుగుతుంది. గొడవలు, కొట్లాటలు అవుతాయి. అందుకే వాదనలను పెంచకుండా ఉండండి. ఒకరి మాటను ఇంకొకరు వినండి. ఇద్దరూ కాస్త ప్రశాంతంగా ఉండేందుకు వాదనలకు బ్రేక్ ఇవ్వండి. అంటే వాదనలకు దిగకుండా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
కఠినమైన మాటలు అనడానికి బదులుగా పురుషులు తమ భావాలను ప్రశాంతంగా, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు మీ భాగస్వామిని నిందించకుండా మీరు ఎంత బాధపడ్డారో మీ భార్యకు వివరించొచ్చు.
గొడవలు, కొట్లాటలు కాకుండా మీరు మ ీ భావోద్వేగాలను వ్యక్తపరచొచ్చు. ఇందుకోసం భర్త భార్యతో మాట్లాడేందుకు బహిరంగ, ఎవరూ లేని సురక్షితమైన స్థలాన్ని ఎంచుకోవాలి. ఇది మీ మధ్య వాదనలను తగ్గిస్తుంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్న గొడవలు సర్దుమనుగుతాయి. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు.