సెక్స్ తో ఇన్ని సమస్యలొస్తాయా?
సెక్స్ ఒక్కటేమిటీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేలరీలు కరగడం, హైబీపీ తగ్గడం, బాగా నిద్రపట్టడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇది కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అవును దీనివల్ల ఎలాంటి సమస్యలొస్తాయంటే?
సెక్స్ తో బోలెడు లాభాలు కలుగుతాయి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కూడా వ్యాయామం లాంటిదేనంటారు నిపుణులు. అందుకే వారానికి రెండు మూడు సార్లు సెక్స్ లో పాల్గొన్న వారికి ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందని పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. కానీ సెక్స్ అనారోగ్యానికి గురి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును ఇది కూడా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సెక్స్ కారణంగా కొంతమంది ఆడవారికి విపరీతమైన తలనొప్పి, ఫ్లూ, యూటీఐ ఇన్ఫెక్షన్ వంటి ఎన్నో సమస్యలు వస్తాయట.
సెక్స్ తర్వాత ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది?
గర్భాశయం నరాల చివరలతో నిండి ఉంటుంది. ఇది వాసోడైలేషన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. రక్తనాళాల కండరాల గోడల సడలింపు ఫలితంగా రక్త నాళాలు విస్తరిస్తాయి. దీన్నే వాసోడైలేషన్ అంటారు. శరీరం వాగస్ నాడిని ప్రేరేపించినప్పుడు వాసోడైలేషన్ ప్రతిస్పందన సంభవిస్తుంది. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో వాంతులు, మూర్ఛ సమస్యలు వస్తాయి. ఇలా ఎక్కువగా చొచ్చుకుపోయే సెక్స్ సమయంలోనే జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీనిలో భాగస్వామి గర్భాశయం దెబ్బతింటుంది. లైంగిక చర్య కారణంగా ఎక్కువగా చెమటలు పట్టడం, నిర్జలీకరణం వల్ల బలహీనంగా మారుతారు. సెక్స్ తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
భావప్రాప్తికి ముందు తలనొప్పి
భావప్రాప్తికి తలనొప్పికి సంబంధం ఉంటుందంటారు నిపుణులు. ఎందుకంటే భావప్రాప్తి తల, మెడలో కండరాల సంకోచాలకు కారణమవుతుంది. దీంతో తలనొప్పి వస్తుంది. అయితే మైగ్రేన్ నొప్పితో ఎక్కువగా బాధపడేవారికి ఈ నొప్పి వస్తుంది. కాగా కొంతమందికి భావప్రాప్తికి ముందే తలనొప్పి రావొచ్చు. రక్తపోటు పెరగడం వల్లే ఇలా అవుతుంది. అయితే ఈ తలనొప్పి కొన్ని నిమిషాల పాటే ఉంటుంది. ఇలాంటి తలనొప్పి ఆడవారి కంటే మగవారికే ఎక్కువగా వస్తుంది.
పోస్ట్ ఆర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్
జ్వరం, కంటిచూపు సరిగ్గా లేకపోవడం, కీళ్లు లేదా కండరాల నొప్పులు, అలసట లేదా సెక్స్ తర్వాత ఏకాగ్రత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది పోస్ట్రోర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్ కావొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమస్య స్ఖలనం చేసిన వెంటనే పురుషులను ప్రభావితం చేస్తుంది. ఇది స్పెర్మ్ ద్రవానికి స్వయం ప్రతిరక్షక ప్రతిచర్య నుంచి వస్తుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు యూరాలజిస్ట్ ను సంప్రదించాలి.
Sex
పోస్ట్కోయిటల్ డైస్ఫోరియా
సురక్షితమైన, మంచి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నప్పటికీ.. మూడింట ఒక వంతు మంది ఆడవారు నిరాశకు గురవుతున్నారని ఒక అధ్యయనం కనుగొంది. పరిశోధకులు దీనిని పోస్ట్కోటల్ డైస్ఫోరియా అని పిలుస్తారు. ఇది రెగ్యులర్ గా 10 శాతం మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. పోస్ట్ సెక్స్ డిప్రెషన్ విచారం, ఆందోళన, చిరాకుకు దారితీస్తుంది. మీరు నిరాశకు గురైతే నిపుణులు కలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ భావాలు మీ సంబంధంలో సమస్యలను తెచ్చిపెడతాయి.
sex
సెక్స్ స్పెర్మ్ అలెర్జీకి కారణమవుతుంది
కొంతమంది ఆడవారికి వీర్యకణాలకు అలెర్జీలు కూడా ఉంటుది. వీర్యం కొంతమంది మహిళల యోనిలలో పీహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలాగే వీర్యం చికాకు, గర్భాశయ శ్లేష్మం, దద్దుర్లు, వాపునకు కారణమవుతుంది. స్పెర్మ్ అలెర్జీ ఉన్నవారు కండోమ్ లను ఉపయోగించడం మంచిది.