- Home
- National
- అమెరికాలో 'చెండ మేళం'.. సంస్కృతిని కాపాడుకుంటూ, ముందు తరాలకు స్ఫూర్తినిస్తున్న మలయాళీలు...
అమెరికాలో 'చెండ మేళం'.. సంస్కృతిని కాపాడుకుంటూ, ముందు తరాలకు స్ఫూర్తినిస్తున్న మలయాళీలు...
ఉత్తర అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో నివసించే కొంతమంది మలయాళీలు తమ సాంస్కృతిక వైభవమైన 'చెండా మేళం'ను కాపాడుకోవడానికి, ముందు తరాలకు స్పూర్తిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అమెరికా : వారు భౌతికంగా అమెరికాలో ఉంటున్నా, వారి హృదయాలు కేరళలోని పచ్చని ప్రకృతిలోనే విహరిస్తాయి. అందుకే ఉత్తర అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో నివసించే కొంతమంది మలయాళీలు కేరళలో ప్రసిద్ధి చెందిన, మంత్రముగ్ధులను చేసే చెండా మేళంను తమ ముందుతరాలకు అందించాలనుకున్నారు. దీనికోసం కొంతమంది మలయాళీలు కలిసి తమ సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
సంజిత్ నాయర్ ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. అతను చెండ మేళంలో నిపుణఉడైన వాద్యకారుడు. ఆయన పెన్సిల్వేనియా-న్యూజెర్సీ వాద్య వేదిక, త్రి-రాష్ట్ర ప్రాంతానికి చెందిన పంచారీ మేళం సంగీత బృందంలో ప్రధాన గురువుగా ఉన్నారు. వీరి బృందంలో పురుషులు, మహిళలు ఇద్దరికీ శిక్షణా సెషన్‌లను ప్రారంభించారు.
"చెండ మేళం ప్రదర్శనలు మా కమ్యూనిటీ కార్యక్రమాలలో కేవలం సంగీతానికి అనుగుణంగా వాయిద్యం వాయించే వ్యక్తులతో చేసే ఓ ఈవెంట్‌గా ఉండేది. అలా కాకుండా చెండ మేళంకు ఉన్న ప్రాధాన్యతను కాపాడాలనుకున్నాం. అందుకే మాలో కొందరు ఈ వాయిద్యాన్ని కేవలం వినోదంగా కాకుండా గౌరవంగా, అంకితభావంతో నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం" అని సంజిత్ నాయర్ చెప్పారు.
గ్రూప్ సభ్యులు త్రిసూర్‌కు చెందిన కళామండలం శివదాస్ ఆశన్ నుండి శిక్షణ పొందుతున్నారు. వ్యక్తిగతంగా, ఆన్‌లైన్ తరగతులతో, కళామండలం శివదాస్ ఆశన్ చెండా మేళంపై పాఠాలను నేర్చుకోవడానికి ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఇది అంత తేలికైన విషయం కాదు... భుజానికి పెద్ద డ్రమ్ములాంటి డప్పు వేసుకుని.. నిలబడి రెండు చేతులతో బలమంతా ఉపయోగించి.. రిథమ్ కు అనుకూలంగా వాయించాలి.
అందుకే "మా చేతులు ఎంత నొప్పులు వచ్చినా, మా కాల్లు మొద్దుబారిపోతున్నా ప్రాక్టీస్ సమయంలో మేం ఎలాంటి కంప్లైంట్స్ చేయం. అందరికీ ఒకే దృఢ నిశ్చయంతో ఉంటాం" అని సంజిత్ నాయర్ అన్నారు. వీరి పట్టుదల, నిబద్ధత వల్ల న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన కేరళ పైరవి వేడుకల్లో వీరి ప్రదర్శన చేసేందుకు బృందాన్ని ఆహ్వానించడం గొప్ప విషయం.
న్యూయార్క్‌లోని ఐటీ ప్రొఫెషనల్ అయిన వల్సన్ వెల్లలత్, త్రిస్సూర్‌లో పెరిగారు, తన చిన్ననాటినుంచి లెక్కలేనన్ని సార్లు చెండామేళం చూసేవాడినని చెప్పారు. దీనివల్ల నేనెప్పుడూ నా మూలాలతో మళ్లీ కనెక్ట్ అయ్యాను. అలా నా కల నిజమైంది." అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. మా ప్రదర్శనకు వచ్చిన వారు ముగిసిన తరువాత "మా శిక్షణా సెషన్‌ల గురించి మమ్మల్ని అడుగుతారు. కొత్త సభ్యులను చేర్చుకుంటామా అని అడుగుతారు. చెండా నేర్చుకోవాలనుకునే చిన్నపిల్లలు కూడా ఉండటం మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది" అని వల్సన్ వెల్లలత్ చెప్పారు.
"బృందం ప్రతి వారం ఒక దగ్గరికి చేరి.. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తారు. ప్రత్యేకించి ఒక ఈవెంట్‌లో ప్రదర్శించడానికి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు. మా పరిమితులను మరింత పెంచుతాం. ప్రతి బీట్, రిథమ్‌ను మరింత పర్ఫెక్ట్ గా చేస్తాం" అని వల్సన్ వెల్లలత్ చెప్పారు.
రెండేళ్ల కఠోర శిక్షణతో ఈ బృందం చెండ మేళంపై మక్కువను, ఆసక్తిని పెంచుకుంది. ఈ బృందంలో పురుషులు, స్త్రీలు ఉంటారు. "బృంద సభ్యులు డ్రమ్స్‌పై కొట్టడం చాలా గట్టిగా, సందడిగా ఉంటుంది. ఈ ప్రదర్శనను చూసి చాలా సార్లు, ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఉత్సాహంగా ఉంటారు" అని మరో సభ్యుడు ప్రేమ్ రామచంద్రన్ అన్నారు.
యూఎస్ డిజిటల్ మార్కెటింగ్, టీబీ బ్యాంక్ హెడ్, కథక్ డ్యాన్సర్ అయిన అపర్ణ మీనన్, కేరళలో జరిగే పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తన కుటుంబంతో పాటు ఓ సారి వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు. అక్కడ చెండా మేళం ప్రదర్శన ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె చెండా మేళంలో ఓ సభ్యురాలయ్యారు.
అపర్ణ చెండా మేళంలో భాగం కావడం మహిళా ప్రాతినిధ్యం కోసం మాత్రమే కాదు, ఒక తల్లిగా, ఆమె యుఎస్‌లో పుట్టి పెరిగిన తన పిల్లలకి కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలపాలని కోరుకుంటోంది.
chenda melam
పీఏ-ఎన్ జే వాద్య వేదిక ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే మనోహరమైన ప్రదర్శనలను ఇస్తూ దాని పేరును నిలబెట్టుకుంటోంది. ఈ బృందంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ మంది ఉన్నప్పటికీ.. మొదటి బ్యాచ్ పెర్కషన్ వాద్యకారుల అద్భుతమైన ప్రదర్శనలు మరింత మంది మహిళలను, మొదటి తరం భారతీయ-అమెరికన్ పిల్లలను చెండా నేర్చుకోవడానికి ముందుకు వచ్చేలా చేసింది.