MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • #RRV: వైష్ణ‌వ్ తేజ్‘రంగ‌రంగ వైభవంగా’ రివ్యూ

#RRV: వైష్ణ‌వ్ తేజ్‘రంగ‌రంగ వైభవంగా’ రివ్యూ

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’.  కేతికా శర్మ హీరోయిన్‌.`అర్జున్‌ రెడ్డి`ని తమిళంలో రీమేక్‌ చేసిన దర్శకుడు గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్‌ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

3 Min read
Author : Surya Prakash
Published : Sep 02 2022, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Ranga Ranga Vaibhavanga

Ranga Ranga Vaibhavanga

మరో మెగా మేనల్లుడు   వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మొద‌టి సినిమాతోనే అత్య‌ధిక ఓపెనింగ్స్ రాబ‌ట్టిన డెబ్యూ హీరోగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఈ సినిమాతో 100కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా త‌ర్వాత భారీ ఎక్సపెక్టేషన్స్ తో వ‌చ్చిన ‘కొండ‌పొలం’ తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.  దాంతో ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ తేజ్ ‘రంగ‌రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌లక‌రించడానికి సిద్ధ‌మయ్యాడు. ఈ  సినిమా ఎలా ఉంది.. ఉప్పెన లా ముందుకు ఉరికిందా..కొండ పొలంలా కొండెక్కిందో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కథాంశం

రిషి (పంజా వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) 'ఖషీ' టైప్ లో  ఒకే రోజున ఒకే ఆస్పత్రిలో ఒకరి కోసం మరొకరు పుట్టిన జంట. వాళ్ళిద్దరివీ పక్క పక్క ఇళ్ళు. రిషి తండ్రి (సీనియర్ నరేష్), రాధా తండ్రి (ప్రభు) క్లోజ్ ప్రెండ్స్. దాంతో యాజటీజ్ గా  ' నువ్వే కావాలి' టైప్ లో  జీవితాలు నడుస్తూంటాయి.    అయితే... చిన్నతనంలో తాను వద్దని చెప్పినా స్కూల్‌లో ఒక అబ్బాయితో రాధ మాట్లాడటం రిషికి నచ్చదు.  దాంతో గొడవ పెట్టేసుకుంటాడు. అది పెరిగి పెద్దదై ...మాట్లాడుకోవడం మానేస్తారు. అక్కడ నుంచి ఇగోల గోల.  అలా కొట్టుకుంటూ,తిట్టుకుంటూ పెరిగిన వీళ్లిద్దరూ ఒకే మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవుతారు. 

310


మెడిసన్ చదివే వయస్సువచ్చినా ఇద్దరూ చచ్చినా మాట్లాడుకోరు. కానీ శ్రీను వైట్ల 'ఆనందం' సినిమాలోలాగ .. ఇద్దరికీ ఒకరంటే చచ్చేంత  ప్రేమ. ఇదిగో ఇంకాసేపట్లో  వాళ్లిద్దరూ  ఇగోని పక్కన పెట్టి ఇద్దరూ మాట్లాడేసుకుంటారు అనుకునే సమయానికి రెండు కుటుంబాల మధ్య గొడవలు. దాంతో ఇద్దరూ విడిపోతారు. ఇప్పుడు వీళ్లిద్దరూ తమ మధ్య ఉన్నది ద్వేషం కాదని ప్రేమ అని ఒకరికొకరు ఎలా ఎక్సప్రెస్ చేసుకుంటారు... తమ ఇగోలను ప్రక్కన పెట్టి ఎలా ఒకటై..తమ కుటుంబాలను కలుపుతారు..అసలు వీళ్ల కుటుంబాలను విడతీసేటంత గొడవ ఏం జరిగింది...అనేది తెలియాలి..తెలుసుకోవాలని అనిపిస్తే సినిమా చూడవచ్చు.
 

410


విశ్లేషణ

ఇలాంటి రొమాంటిక్ కామెడీ జానర్ సినిమాల్లో పెద్దగా చెప్పుకోవటానికి కథేమి ఉండదు కాబట్టి వెతకటం కూడా అనవసరం. లీడ్ పెయిర్ ..ఎలా విడిపోయారు..చివరకు ఎలా ఒకటయ్యారు అనేది ఎంత అందంగా, ఆకట్టుకునేలా చెప్పారనేదే యుఎస్ పిగా పనిచేస్తుంది.  డైరక్టర్ తను చూసిన పాత సూపర్ హిట్స్ ప్రేరణతో తయారుచేసుకున్న కథని అంతే పాతగా చెప్పే ప్రయత్నం చేసాడు. ఖుషీ ఇప్పటికీ నచ్చదా, నువ్వే కావాలి ఎన్ని సార్లు టీవిల్లో చూసాం.,అలాంటింది అలాంటి సినిమానే ఇది ఎందుకు ఆడదు అనిపిస్తుంది. అయితే చూసేవాడికి కూడా అదే సమస్య. ఇప్పటికే ఎన్నో సార్లు చూసేసిందే మళ్లీ చూపెడతాడేంటి. అంతగా కాకపోతే రీరిలీజ్ అయ్యినప్పుడు మళ్లీ ఆ సినిమాలు థియోటర్ లో చూద్దాం..ఇప్పుడీ పాత చింతకాయ పచ్చడి వ్యవహారం ఎందుకు అనిపిస్తుంది. 

510

మన సినిమా  పెద్దలు చెప్పే మాట ఒకటుంది..పాత కథను కొత్తగా చెప్పాలని...ఇదే మర్చిపోయాడు గీరీశాయ.  స్క్రీన్ ప్లే కూడా అంతే నీరసంగా రాసుకున్నాడు. ఒక మాదిరిగా సినిమాలు చూసే ప్రతీ ఒక్కరు నెక్ట్స్  పదో సీన్ లో ఏం జరుగుతుందో ..ఇంటర్వెల్ ఏమిటో..సెకండాఫ్ ఏమిటో పసిగట్టేస్తాడు. పాపం అంత కష్టపడి వేసుకున్న ప్రేక్షకుడు అంచనాలను మనం ఎందుకు వెనక్కి లాగాలి అని డైరక్టర్ అనుకున్నట్లు సినిమా సాగుతుంది. అయితే డైరక్టర్...`నువ్వే కావాలి, ఖుషి` ఈ జనరేషన్ వి కాదు కదా..ఇప్పటి కుర్రాళ్ళు చూడలేదు కదా...వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు అనే సదుద్దేశ్యంతో ఈ సాహసానికి పూనుకుని ఉండవచ్చు. కానీ వాళ్లు థియేటర్ కు రావాలి అంటే ఈ జనరేషన్ కుర్రాళ్ల మనో భావాలు...సీన్స్ ఉండాలి కదా..అప్పటికి అవి ఫ్రెష్...కొత్త. 

610


టెక్నికల్ గా...

ఇలాంటి లవ్ స్టోరీ లకు పాటలు, విజువల్స్ రెండు పిల్లర్స్ గా నిలవాలి.  పాటల్లో  సిరిసిరి మువ్వల్లేతో పాటు తెలుసా తెలుసా, కొత్తగా లేదేంటి పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఛల్తాహై.    కెమెరా వర్క్ బాగుంది. కలర్ ఫుల్ గా విజువల్స్ ని తెరపై పరిచారు.  ఎడిటింగ్ కూడా ఎక్కడా పెద్ద లాగ్ లేదు.మిగతా డిపార్టమెంట్స్ బాగానే సపోర్ట్ ఇచ్చాయి. దర్శకత్వంలో మెరుపులు లేవు కానీ నడిచిపోయింది.  అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ...మెయిన్ కావాల్సిన కంటెంట్ సినిమాని ముంచేసినప్పుడు మిగతావి ఎంత బాగుంటే ఏముంటుంది..అదే జరిగింది. 
 

710

నటీనటుల్లో ..

 సీన్స్ లో జోష్, విషయం  లేనప్పుడు హీరో మాత్రం ఏం చేయగలుగుతాడు.  వైష్ణవ్ తేజ్ ఉన్నంతలో బాగానే చేసాడు. ఉప్పెన కన్నా మెచ్యూర్డ్‌గా అనిపించాడు. డాన్స్ లు జస్ట్ ఓకే. ఇంకా కష్టపడాలేమో.లేక పోతే ఈ పోటీలో తన ముద్ర వేయలేడు. అలాగే  పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేయకుండా ఉండే బాగుండేది. కేతిక శర్మ జస్ట్  ఓకే.  నరేష్, ప్రభు కారెక్టర్స్ ఎన్నో సార్లు చేసినవి.   అలీ, నవీన్ చంద్ర పాత్రలు మామాలే.

810

బాగున్నవి

లీడ్ పెయిర్
పాటలు
ప్రొడక్షన్ వాల్యూస్

బాగోలేనివి
రొటీన్ కథ..
ఊహకుల అందేలా రాసుకున్న స్క్రీన్ ప్లే
నవ్వించని కామెడీ సీన్స్ 
మనస్సును పట్టే  భావోద్వేగాలు లేకపోవటం
 

910
Ranga Ranga Vaibhavanga

Ranga Ranga Vaibhavanga


ఫైనల్ థాట్

ఒక్క  క్షణం అయినా  “కొత్తగా లేదేంటి”....
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

 

 సెకండాఫ్‌తో పోలిస్తే.. ఫస్టాఫ్‌ కాస్త బెటర్‌ . ఓవరాల్‌గా రంగరంగ వైభవంగా ఓ పరమ రొటీన్   సినిమా 

1010


నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, నవీన్ చంద్ర, సీనియర్ నరేశ్, ప్రభు, ప్రగతి, తులసి, సుబ్బరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, 'స్వామి రారా' సత్య, 'ఫిష్'  వెంకట్ తదితరులు
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ సైనుద్దీన్  
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సమర్పణ: బాపినీడు బి 
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్ 
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గిరీశాయ
విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2022
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image2
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image3
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved