MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?

రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ `టాక్సిక్‌`. `కేజీఎఫ్‌ 2` తర్వాత యష్‌ నుంచి వస్తోన్న సినిమా ఇది. భారీ అంచనాల మధ్య ఈ బుధవారం ఈ సినిమా విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందంటే?

6 Min read
Author : Aithagoni Raju
Published : Aug 26 2026, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టాక్సిక్‌ మూవీ రివ్యూ
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌ మూవీ రివ్యూ

`కేజీఎఫ్‌` చిత్రాలతో కన్నడ సినిమా రూపురేఖలు మార్చేసిన హీరో యష్‌. ఆయన ఇప్పుడు `టాక్సిక్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. లేడీ డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నయనతార, రుక్మిణి వసంత్‌, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. యష్‌ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. కేవీఎన్‌ ప్రొడక్షన్స్, మాంస్టర్‌ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్‌ కే నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ సర్టిఫికెట్‌ పొందడంతో 18ఏళ్లు నిండిన వాళ్లే ఈ సినిమా చూడాలి. చాలా వాయిలెన్స్, రొమాన్స్ తో కూడిన ఈ మూవీ నేడు బుధవారం(ఆగస్ట్ 26న) విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? యష్‌ ఎలా చేశారు? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
టాక్సిక్‌ మూవీ కథ
Image Credit : Asianet News

టాక్సిక్‌ మూవీ కథ

1947లో దేశానికి స్వాతంత్య్రం వస్తుంది, కానీ గోవాకి రాదు. ఫోర్చుగ్రీస్‌ వారి ఆధీనంలో ఉంటుంది. అక్కడ మాఫియాదే రాజ్యం. దాన్ని చేజిక్కుంచుకునేందుకు అనేక మంది పోటీపడుతుంటారు. అయితే సాల్వడర్‌(డర్రెల్‌ డి సిల్వ) దాన్ని శాసిస్తుంటాడు. ఆయనే చీకటి ప్రపంచానికి రాజు లాంటివాడు. చిన్నప్పట్నుంచి తన అక్క గంగ(నయనతార)తో అనాథగా పెరుగుతాడు రాయా(యష్‌). ఎన్నో బాధలు పడుతూ ఈ చీకటి ప్రపంచంలోకి వస్తారు. ఒకరి తర్వాత ఒకరిని అంతం చేసుకుంటూ చివరికి సాల్వడర్‌కి దగ్గరవుతాడు. తన నాన్నకి గతంలో ఈ సాల్వడర్‌తో రిలేషన్‌ ఉంటుంది. ఆ రిలేషన్‌ వీరిని సాల్వడర్‌కి దగ్గర చేస్తుంది. ఒకరు వేసిన దారిలో నడవడం కాదు, తానే కొత్తగా దారి వేసుకుంటాను అని చెప్పి అక్కతో కలిసి రాయా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. అలా సాల్వడర్‌కి దగ్గరవుతాడు. రాయా.. సాల్వడర్‌ కూతురు రెబెక్కా(తారా సుతారియా)పై మనసు పడతాడు. ఆమె కూడా రాయాకి ఇంప్రెస్‌ అవుతుంది. ఇద్దరు ఫిజికల్‌గా కలుస్తారు. రాయాని తన అల్లుడిని చేసుకొని తన సామ్రాజ్యానికి అధిపతిని చేయాలనుకుంటాడు సాల్వడర్‌. కానీ మధ్యలో నడియా(కియారా అద్వానీ) ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఒక సర్కస్‌ డాన్సర్‌. అందంలో ఆమె తర్వాతే ఎవరైనా. ఆమెకి ముగ్దుడయిన రాయా.. దగ్గరవుతాడు. ఆమె మాయలో, ప్రేమలో పడిపోతాడు. దీంతో సాల్వడర్‌ని ఎదురిస్తాడు. అంతేకాదు.. ఏకంగా రెబెక్కాతో పెళ్లి రోజే సాల్వడర్‌ని చంపేస్తాడు. సాల్వడర్‌ కీప్‌.. ఎలిజిబెత్‌(హ్యూమా ఖురేషీ) పగతీర్చుకోవాలనుకుంటుంది. అనంతరం ఎలాంటి పరిణమాలు చోటు చేసుకున్నాయి? నడియా రాయాకి ఎందుకు దూరం కావాలనుకుంటుంది? ఆమెపై రాయా కోపం ఎందుకు? నడియా కొడుకుని చూసి రాయా రియాక్షన్‌ ఏంటి? రాయా కోసం గంగ చేసిన త్యాగం ఏంటి? ఇందులో మెలిసా(రుక్మిణి వసంత్‌) పాత్ర ఏంటి? ఆమె రాయా లైఫ్‌లోకి ఎలా వచ్చింది? రాయా కొడుకు టికెట్‌(యష్‌).. రాయాపై ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటాడు? ఫైనల్‌గా కథ ఎలాంటి ముగింపు తీసుకుందనేది సినిమా.

Related Articles

Related image1
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
37
టాక్సిక్‌ మూవీ విశ్లేషణ
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌ మూవీ విశ్లేషణ

సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత గ్రాండియర్‌గా తీశారనేది ఆడియెన్స్ కి అవసరం లేదు. ఎంత కనెక్టింగ్‌గా తీశారు. ఎంతగా ఆకట్టుకుంది? ఆడియెన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉందా? లేదా అనేదే ముఖ్యం. అలా లేకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసినా అది బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోతుంది. `టాక్సిక్‌` సినిమా చూశాక అలాంటి ఫీలింగ్‌ కలగక మానదు. కథగా ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కాకపోతే అది మనకు అర్థమయ్యేలా చెప్పడంలోనే తడబాటు కనిపిస్తుంది. సినిమా చాలా గ్రాండియర్‌గా ఉంది. లావిష్‌గా ఉంది. విజువల్‌ గా కనువిందు చేస్తుంది. టెక్నీకల్‌గా చాలా బ్రిలియంట్‌గా ఉంది. ఆకట్టుకుంటుంది. కానీ కథ, కథనం విషయంలోనే ఆ ఫోకస్‌ తప్పిందనిపిస్తుంది. ఇక సినిమాగా చూసినప్పుడు గోవాలో 1947లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మాఫియా, ఇల్లీగల్‌ వ్యవహారాలు, మందు, కాసినో, బెట్టింగ్‌ వంటివి రాజ్యమేలుతున్న నేపథ్యంలో తాను కూడా గొప్పగా ఎదగాలని యష్‌, నయనతార కలలు కంటారు. కింద నుంచి ఒక్కొక్కరిని వేసుకుంటూ, తన స్థాయిని పెంచుకొని కింగ్‌ మేకర్‌ వద్దకు చేరుకోవడం చూపించారు. ఈ క్రమంలో వరుసగా యాక్షన్‌ సీన్లతోనే సినిమా నడుస్తుంది. ప్రారంభంలో సమాధిలో వచ్చే యాక్షన్‌ సీన్‌ మాత్రం అదిరిపోయేలా ఉంది. యష్‌ ఎంట్రీ వాహ్‌ అనిపిస్తుంది. ఎలివేషన్లు గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. కారులో సీన్‌, అనంతరం ఆయన చేసే యాక్షన్‌ అదిరిపోయింది. ఆ తర్వాత గతంలోకి వెళ్తుంది. తాను ఎదిగిన తీరుని చూపించారు. గోవాని తమ గుప్పిట్లోకి తీసుకునే క్రమంలో వరుసగా యాక్షన్‌ సన్నివేశాలు వస్తుంటాయి. మరోవైపు కింగ్‌ మేకర్‌ కూతురుకి హీరో పడిపోవడం, ఆమెతో రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు. స్టయిలీష్‌ లుక్స్, రొమాన్స్, ఇంటెన్స్ సీన్లు, ఎలివేషన్లతో కథనం రన్‌ అవుతుంది. సీన్‌ బై సీన్‌ ఫాస్ట్ ఫాస్ట్ గా వస్తూ పోతుంటాయి. అనంతరం కియారా అద్వానీతో యష్‌ ప్రేమాయణం వైపు తిరుగుతుంది. ఆయా సన్నివేశాలు కొంత వరకు ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ నుంచి, ఎలివేషన్ల నుంచి రిలీఫ్‌నిస్తాయి. కాకపోతే ఆమెతోనూ రొమాన్స్ నే ఎక్కువగా చూపించారు.

ఇంటర్వెల్‌ కియారా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇంటర్వెల్‌ కొంత వరకు ఆకట్టుకుంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని, యష్‌, నయనతార, కియారా పాత్రల్లోని కీలక పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. కొడుకుని కాపాడుకోలేకపోవడం, యష్‌ పడే బాధ వంటివి ఎమోషనల్‌గా ఉంటాయి. సెకండాఫ్‌ అంతా వేరే కంట్రీకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మరో కింగ్‌ మేకర్‌కి సపోర్ట్ గా ఉంటాడు హీరో. కానీ ఆయన్ని కియారా పాత్ర, అతని కొడుకుకి సంబంధించిన సంఘటనలు వెంటాడుతుంటాయి. ఎవరో తనని వెంటాడుతున్న ఫీలింగ్‌లో హీరో ఉంటాడు. అయా సీన్లు థ్రిల్లర్‌ ని గుర్తు చేస్తాయి. ఇంకోవైపు రుక్మిణి వసంత్‌ పాత్ర ఎంట్రీ ఉంటుంది. ఆమె తన లైఫ్‌లోకి రావడం అనేది క్లారిటీ లేదు. ఆ తర్వాత నుంచి హీరో లైఫ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి ఉత్కంఠభరితంగా ఉంటాయి. అదే సమయంలో విసిగించేలా ఉంటాయి. కథ ఎటువెళ్తుందో అర్థం కాదు. క్లైమాక్స్ లెన్తీగా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ కథ మొత్తాన్ని మార్చేస్తుంది. సినిమా మొత్తంగా సిగరేట్‌, మందు, అమ్మాయిలతో రొమాన్స్ లేదంటే యాక్షన్‌.. వీటితోనే నడుస్తుంది. రెండు మూడు చోట్ల మాత్రమే కొంత కామెడీ, కియారా పాత్రకి సంబంధించిన ఎమోషనల్‌ సీన్లు మాత్రమే ఆకట్టుకునేలా ఉంటాయి.

47
టాక్సిక్‌ మూవీలో ప్లస్‌, మైనస్‌ లు
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌ మూవీలో ప్లస్‌, మైనస్‌ లు

సినిమా విజువల్‌గా గ్రాండియర్‌గా ఉంది. వీఎఫ్‌ఎక్స్ అదిరిపోయాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. అమ్మాయిలకు సంబంధించిన యష్‌ చెప్పే డైలాగులు నవ్విస్తాయి. ప్రేమకి సంబంధించిన సీన్లు ఆకట్టుకుంటాయి. కొడుక్కి సంబంధించిన సీన్లు ఎమోషనల్‌కి గురి చేస్తాయి. బీజీఎం అదిరిపోయింది. యష్‌ నటన పీక్‌లో చూడొచ్చు. ఇవి సినిమాకి ప్లస్‌గా నిలుస్తాయి.

ఇక మైనస్‌లు చెప్పాల్సి వస్తే.. కథ, కథనంలో క్లారిటీ లేదు. ఏం చెప్పాలనుకున్నారో, ఏం చూపించాలనుకున్నారో క్లారిటీ మిస్‌ అయ్యింది. సాధారణ ఆడియెన్స్ కి కథ అర్థమయ్యేలా లేదు. సినిమాలో ఎమోషనల్‌, సోల్‌ అంతగా పండలేదు. దీంతో ఆడియెన్స్ మూవీతో కనెక్ట్ కాలేకపోతారు. దీని కారణంగా ప్రతి సీన్‌ వచ్చిపోతుంటాయి తప్ప, వాటితో రిలేట్‌ కాలేకపోతాం. ధూమపానం, మందు తీసుకోవడం, రొమాన్స్ అతిగా ఉంది. ఎలివేషన్లు, యాక్షన్‌ కూడా ఓవర్‌ డోస్‌ అయ్యింది. ఏది ఎందుకు వస్తుందో అర్థం కానట్టుగా ఉంది. నిడివి మరో మైనస్‌. క్లైమాక్స్ కొంత విసిగించినా, ఎమోషనల్‌ సీన్లతో కొంత రిలీఫ్‌ నిచ్చారని చెప్పొచ్చు.

57
టాక్సిక్‌ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

రాయాగా యష్‌ నటన ఇందులో పీక్‌లో చూడొచ్చు. స్ట్రగుల్స్ పడే వ్యక్తిగా, డేరింగ్‌ పర్సన్‌గా, అక్క విషయంలో ఎమోషనల్‌గా, అమ్మాయి విషయంలో ప్రేమికుడిగా, తండ్రిగా ఇలా విభిన్నమైన భావోద్వేగాలను తెరపై ఆయన ఆవిష్కరించిన తీరు బాగుంది. అదే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. యష్‌ పాత్ర ముందు అందరు తేలిపోతారని చెప్పొచ్చు. ఎలివేషన్లలో, యాటిట్యూడ్‌ చూపించే విషయంలో, యాక్షన్‌ సీన్లలోనూ తన బెస్ట్ ఇచ్చాడు యష్‌. దీనికితోడు యంగ్‌ యష్‌గానూ కనిపించి అలరించాడు. మొత్తంగా ఆయన విశ్వరూపం చూపించాడు. ఇక నడియాగా కియారా సెటిల్డ్ గా చేసింది. గ్లామర్‌తో కనువిందు చేసింది. ఆమె పాత్ర హార్ట్ ని టచ్‌ చేస్తుంది. యష్‌ అక్క గంగ పాత్రలో నయనతార ఫర్వాలేదనిపించింది. కాకపోతే ఆమె లుక్స్ యాక్షన్‌.. రియాలిటీగా లేదు. ఎలిజబెత్‌ గా హ్యూమా ఖురేషి ఉన్నంతలో మెప్పించింది. పాత్రలో జీవించింది. యష్‌ భార్యగా రుక్మిణి పాత్ర ఓకే అనిపిస్తుంది. అదే సమయంలో ఆమె పాత్రలో క్లారిటీ మిస్‌ అయ్యింది. రెబెక్కా పాత్రలో తారా సుతారియా బాగా చేసింది. గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది.తనలో డిఫరెంట్‌ షేడ్స్ చూపించింది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. నటులు తమ బెస్ట్ ఇచ్చారు.

67
టాక్సిక్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : X/@KvnProductions

టాక్సిక్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

టాక్సిక్‌ మూవీ టెక్నీకల్‌గా చాలా సాలిడ్‌గా ఉంది. రాజీవ్‌ రవి విజువల్స్ అయితే కనువిందు చేస్తాయి. ప్రతి ఫ్రేమ్‌ ఆకట్టుకుంటుంది. రిచ్‌గా ఉంటుంది. ఆర్ట్‌ వర్క్ అదిరిపోయింది. ఉజ్వల్‌ కులకర్ణి ఎడిటింగ్‌ వీక్‌గా ఉంది. చాలా సీన్లు లేపేయోచ్చు. కథనం స్పీడ్‌ చేస్తే బాగుండేది. లెన్త్ కూడా సమస్యనే. మ్యూజిక్‌ బాగుంది. తాబాయి పాట అదిరిపోయింది. మిగిలిన పాటలు ఓకే అనిపిస్తాయి. రవి బస్రూర్‌ బీజీఎం అదిరిపోయింది. కొత్తగా ఉంది. చాలా వరకు యాక్షన్‌ సీన్లని ఎలివేట్‌ చేసింది. హీరోకి అదిరిపోయే ఎలివేషన్లని ఇచ్చింది. సీన్లల్లో అంత మ్యాటర్‌ లేకపోవడంతో అవి తేలిపోయాయి. నిర్మాత వెంకట్‌ కే నారాయణ, యష్‌ కలిసి సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. నిర్మాణం విషయంలో రాజీపడకుండా చేశారు. దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ కథలోనే అంత మ్యాటర్‌ లేదు. మరీ సంక్లిష్టంగా రాసుకున్నారు. అది ఆడియెన్స్ కి కనెక్ట్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్‌ కూడా బాగా లేదు. గూగుల్‌ ట్రాన్స్ లేషన్‌ కనిపిస్తుంది. ఆ విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్త పడాల్సింది. సినిమాలో చాలా వరకు సాగదీత ఎక్కువైంది. మొత్తంగా చూస్తే మూవీని చాలా స్టయిలీష్‌గా తీశారు. ఎలివేషన్లకి తగ్గట్టుగా స్టయిలీష్‌గా సినిమా ఉండటం కొంత వరకు చూడగలిగేలా ఉంటుంది. యష్‌ అభిమానులు ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది.

77
ఫైనల్‌గా..
Image Credit : Asianet News

ఫైనల్‌గా..

గ్రాండియర్‌గా యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు, రొమాన్స్, స్టయిలీష్‌ మూవీని తీయడంపై పెట్టిన ఫోకస్‌.. కథ, కథనంపై పెడితే బాగుండేది. సినిమాగా నిరాశ తప్పదు. నటుడిగా యష్‌ ఆకట్టుకుంటాడు. విజువల్స్ కనువిందు చేస్తాయి.

రేటింగ్‌: 2 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
నయనతార

Latest Videos
Recommended Stories
Recommended image1
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Recommended image2
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image3
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Related Stories
Recommended image1
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved