Racharikam Movie Review: `రాచరికం` మూవీ రివ్యూ, రేటింగ్
Racharikam Movie Review: వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్, ప్రాచీ ఠాకూర్ ప్రధానపాత్రల్లో నటించిన `రాచరికం` మూవీ శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

Racharikam Movie Review: వరుణ్ సందేశ్ ఇటీవల కమ్ బ్యాక్ అయ్యారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ తన రేంజ్‌కి తగ్గ సక్సెస్ రావడం లేదు. కానీ తనవంతుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు `రాచరికం` చిత్రంలో నటించారు. ఇందులో అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహఙంచిన ఈ చిత్రాన్ని చిల్ బ్రోస్ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై ఈశ్వర్ సినిమాని నిర్మించారు. ఈ శుక్రవారం(జనవరి 31)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా? వరుణ్ సందేశ్‌కి ఈ సారైనా హిట్ పడిందా? అప్సరా రాణి మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
1980, రాచకొండలో జరిగే కథ ఇది. వివేక్ రెడ్డి(వరుణ్ సందేశ్), భార్గవి రెడ్డి(అప్సరా రాణి) తోబుట్టువులు. ఇద్దరికి రాజకీయాల్లో రాణించాలని ఉంటుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న క్రమంలో భార్గవి రెడ్డి మన శక్తి పార్టీ యువ నాయకుడు శివ(విజయ్ శంకర్) ఇద్దరు ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ వ్యవహారం ఆమె తండ్రి రాజా రెడ్డికి తెలుస్తుంది.
దీంతో భార్గవి రెడ్డి లైఫ్ మలుపుతీసుకుంటుంది. వీరి ప్రేమకి రాజకీయం అడ్డుగా మారుతుంది. దీంతో తమ ప్రేమ కోసం ఈ ఇద్దరు రాజకీయంగా ఏం చేశారు. రాచకొండలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వివేక్ రెడ్డి, భార్గవిలు రాజకీయాల్లో కొనసాగారా? తప్పుకున్నారా? ఆ తర్వాత ఏం చేశారు? తోబుట్టువుల అసలు కథేంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఇప్పుడు పీరియడ్ సినిమాలు, యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది. అలాంటి చిత్రాలే ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. అందులో భాగంగా వచ్చిన మూవీనే `రాచరికం`. ఇందులో పీరియడ్ అంశాలతోపాటు యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగడం ప్రత్యేకత. దీంతో సినిమా చాలా సహజంగా అనిపిస్తుంది. మన ముందే కథ నడుస్తున్నట్టుగా ఉంటుంది.
1980లో జరిగిన సంఘటనలను కొన్నింటిని ఆధారంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు సురేష్ లంకలపల్లి. తెరపై అంతే సహజంగా ఆవిష్కరించారు. విలేజ్‌లో రాజకీయాల్లో రాణించాలనుకునే అన్నా చెల్లెలు, మధ్యలో చెల్లి, మరో పార్టీ నాయకుడిని లవ్ చేయడం, దీన్ని ఫ్యామిలీ మెంబర్స్ సహించకపోవడమనేది రొటీన్‌గా ఉంటుంది.
అలాగే ప్రతీకార రాజకీయాలకు పాల్పడే సన్నివేశాలు కూడా రెగ్యూలర్‌గానే అనిపిస్తాయి. కాకపోతే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగడంతో నెక్ట్స్ ఏంజరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అదే ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది.
ఇటీవల తెలంగాణ బ్యాక్ డ్రాప్ సినిమాలుగా కూడా విరివిగా వస్తున్నాయి. సక్సెస్ కి ఫార్మూలాగా మారుతున్నాయి. ఇందులోనూ తెలంగాణ నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్, యాక్షన్ సీన్లు, ఎమోషన్స్ సినిమాలో బాగా పండాయి. అవే సినిమాకి ప్రధాన బలం. సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ నార్మల్‌గానే సాగుతుంది. కానీ క్లైమాక్స్ ని మాత్రం బలంగా ప్లాన్ చేశారు. ప్రీ క్లైమాక్స్ నుంచి కథలో వేగం పెరుగుతుంది. క్యూరియాసిటీక్రియేట్ అవుతుంది.
క్లైమాక్స్ లో దాన్ని పీక్‌లోకి తీసుకెళ్తాడు. ఈ క్రమంలో కథలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. అవి ఆడియెన్స్ కి థ్రిల్‌నిస్తాయి. ఫస్టాఫ్‌రెసీగా ఉన్నట్టుగానే సెకండాఫ్‌ని ప్లాన్ చేస్తే ఇంకా బాగుండేది. ఓవరాల్‌గా యాక్షన్ సీన్లు, తెలంగాణ పీరియడ్ నేపథ్యంలో, సెంటిమెంట్లు, ఎమోషన్స్ హైలైట్‌గా నిలిచాయని చెప్పొచ్చు. పొలిటికల్ డ్రామా మరో హైలైట్ అవుతుంది.
నటీనటులుః
వివేక్‌రెడ్డి పాత్రలో వరుణ్ సందేశ్ అదరగొట్టాడు. తన పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉండటం విశేషం. తన నటనలోని విలక్షణతని చూపించారు వరుణ్. అదరగట్టాడు. హీరోగా విజయ్ శంకర్ బాగా చేశారు. పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మూవీతో తను నటుడిగా వేరే స్థాయికి వెళ్తాడు. నెగటివ్‌రోల్‌లో విజయ రామరాజు ఇరగదీశాడు. తనదైన నటనతో మెస్మరైజ్ చేశాడు.
రాజకీయ నాయకురాలిగా అప్సరా రాణి సైతం అదరగొట్టింది. గ్లామర్ ట్రీట్‌కే కాదు, నటిగానూ తాను మెప్పించగలను అని నిరూపించింది అప్సర. ఇందులో రొమాన్స్ సన్నివేశాల్లో మాయ చేసింది. ప్రాచీ ఠాకూర్, రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది రంగస్థలం, మహేష్ లు తన పాత్రల్లో బాగా చేశారు.
టెక్నీకల్‌గాః
ఆర్య సాయికృష్ణ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ బీజీఎం మాత్రం ఆకట్టుకుంటుంది. వెంగీ నేపథ్య సంగీతం ఫర్వాలేదు. చాలా చోట్ల బాగా ఎలివేట్ అయ్యింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఎడిటింగ్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. జి. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ చాలా ఇంటెన్స్ తో పవర్ ఫుల్ గా ఉన్నాయి. సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
దర్శకుడు సురేష్ లంకలపల్లి.. ఈ మూవీని ఓల్డ్ ఫార్మాట్‌లో తీసినట్టు అనిపించినా ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కథలో మలుపులను బాగా రాసుకున్నారు. వాటిని అంతే బాగా వెండితెరపై ఆవిష్కరించారు. దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కథ కంటే ఎమోషన్స్ ముఖ్యమని చాటి చెప్పాడు. దర్శకుడిగా తొలి చిత్రమైనా బాగా చేశాడు. మెప్పించాడు.
ఫైనల్‌గాః ఓవరాల్‌గా డీసెంట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా.
రేటింగ్‌ః 2.5