MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • నితిన్, శ్రీలీల 'రాబిన్ హుడ్' రివ్యూ

నితిన్, శ్రీలీల 'రాబిన్ హుడ్' రివ్యూ

Nithiin Robinhood movie review :  నితిన్ రాబిన్ హుడ్ మూవీ రివ్యూలో కామెడీ, మాస్ ఎంటర్టైనర్‌గా సినిమా ఎలా ఉందో తెలుసుకోండి. శ్రీలీల గ్లామర్, డేవిడ్ వార్నర్ ఫ్యాక్టర్ సినిమాకు కలిసొచ్చాయా? పూర్తి రివ్యూ చదవండి.

3 Min read
Author : Surya Prakash
| Updated : Mar 28 2025, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Nithiin Robinhood movie review in telugu

Nithiin Robinhood movie review in telugu


Nithiin Robinhood movie review : కామెడీ సినిమాలకు తెలుగులో మంచి గిరాకీ ఉంది.  అలాగే ఛలో, భీష్మ చిత్రాలతో కామెడీ, మాస్ ఎంటర్టైనర్‌ డైరెక్టర్‌గా వెంకీ కుడుములకు మంచి పేరు ఉంది.

అలాగే శ్రీలీల, డేవిడ్ వార్నర్ ఫ్యాక్టర్, అదిదా సర్పైజ్ సాంగ్ వైరల్ అవటంతో కలసి వచ్చింది. వీటిన్నటితో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో అందరూ నితిన్ కు ఈ సారి మంచి హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరి వెంకీ కుడుముల..  నితిన్‌ను గట్టెక్కించాడా?   రాబిన్ హుడ్  కథేంటి, సినిమా చూడదగ్గదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Nithiin Robinhood movie review in telugu

Nithiin Robinhood movie review in telugu


స్టోరీ లైన్ :

అనాధ అయిన రామ్ (నితిన్) తను  పెరిగిన అనాధాశ్రమానికి విరాళాలు లేక పిల్లల తిండికి కూడా ఇబ్బంది పడటం గమనిస్తాడు. దాంతో వారిని ఆదుకోవటం కోసం దొంగతనాల బాట పడతాడు. కోటిశ్వరులను కొట్టి పేదోళ్లకు  పెట్టాలనే రాబిన్ హుడ్ కాన్సెప్ట్ ని బుర్రకు ఎక్కించుకుని, అదే నిక్ నేమ్ తో  ముందుకు వెళ్తూంటాడు. అయితే దొంగతనాలు ఎంత టెక్నాలిజీని వాడి దొరక్కుండా చేసినా ఏదో రోజు దొరికిపోతారు కదా. రాబిన్ హుడ్ ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ (షైన్ చాం టాకో) దిగుతాడు.  

ఈ క్రమంలో  దొంగతనాలకు స్వస్ది చెప్పి  జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేందర్ ప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. ఇక ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీ లీల) ట్రిప్ కోసం ఇండియా వస్తుంది. ఆ ట్రిప్ సెక్యూరిటీ  కాంట్రాక్ట్  నితిన్ బ్యాచ్  తీసుకుంటారు.

38
Nithiin Robinhood movie review in telugu

Nithiin Robinhood movie review in telugu


 నీరా రుద్రకొండ వెళ్తానంటుంది.  ఆమెతో రామ్ కూడా వెళ్తాడు. అయితే ఆమెను కొన్ని ముఠాలు వెంబడిస్తూంటాయి.  అలా వెళ్లిన తర్వాత అక్కడ విలన్  సామి (దేవదత్తా నాగే) వలలో చిక్కుకుంటారు.

వారి బారి నుంచి నీరాను రాబిన్ హుడ్ అండ్ టీం తప్పించిందా? రుద్రకొండ గ్రామానికి గంజాయికి లింకేంటి, అసలు  నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు? ఈ అందరితో డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) పాత్ర ఏంటి  చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.
 

48
Nithiin Robinhood movie review in telugu

Nithiin Robinhood movie review in telugu


ఎలా ఉంది

కథగా రవితేజ కిక్ ని గుర్తు చేసే ఈ సినిమా గతంలో మనం చాలా సార్లు చూసిన సెటప్ లోనే మొదలవుతుంది. టెంప్లేట్ కమర్షియల్ ఎంట్రైటనర్ గా డిజైన్ చేసారు.

అయితే హైలెట్ గా చెప్పిన కామెడీ మాత్రం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్  సాయింతో కామెడీ బాగానే వెళ్లిపోయినా సెకండాఫ్ లో నత్త నడక నడిచింది. కథ ఎదరకెళ్లే కొలిది చాలా ప్రెడిక్టబుల్ గా రొటీన్ టెంప్లేట్ గా మారిపోయింది. దాంతో ఇంట్రస్ట్ తగ్గుతూపోయింది. ప్రీ  క్లైమాక్స్ ట్విస్ట్ ఉన్నంతలో బెస్ట్.

58
Nithiin Robinhood movie review in telugu

Nithiin Robinhood movie review in telugu


సినిమా ప్రారంభం శ్రీలంకలో విలన్,  తన గ్యాంగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ  సినిమా ఇంట్రెస్టింగ్ గానే  మొదలైంది. ఆ తర్వాత హీరో ..రాబిన్ అవతారం హీరో ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, హీరోయిన్ కు సెక్యూరిటీ గా వెళ్లటం, ఆ తర్వాత చిక్కుల్లో ఇరుక్కోవటం, ఓ చిన్న ట్విస్ట్ తో  కథనం ముందుకు వెల్తుంది.

రొటీన్ గానే అనిపించే కథను కామెడీతో ముందుకు తీసుకెళ్లచ్చు అనే ధైర్యంతో దర్శకుడు ప్రతీ సీన్ లోనూ ట్రై చేసాడు. రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ ని బాగా వాడుకున్నారు. అయితే ఓ స్దాయి కు కథ వెళ్లాక..ముందుకు వెళ్లనని మొరాయిస్తుంది. దానికి తోడు హీరో ఎక్కడా సమస్యల్లో పడినట్లు అనిపించడు. దాంతో కథలో కాంప్లిక్ట్ పార్ట్ వర్కవుట్ కాక పెద్దగా ఇంట్రస్టింగ్ గా అనిపించదు. 

68
Nithiin Robinhood movie review in telugu

Nithiin Robinhood movie review in telugu


టెక్నికల్ గా 

ఉన్నంతలో ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన పాటలు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. అయితే కథ,కథనంపై మరింత కసరత్తు చేసి ఉంటే వీటికి నిండుతనం వచ్చేది. సినిమాటోగ్రఫీ మంచి విజువల్స్ తో కళ్లకు ఇంపుగా ఉంది.

అలాగే సినిమాకు మొదటి నుంచి హైలెట్ చేస్తూ వచ్చిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ లోని స్టెప్ విషయంలో టీం కేర్ తీసుకుంది. ఆ స్టెప్ ని దొరక్కుండా కొంత కోత పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ లని స్టైలిష్ గా  ప్రెజెంట్ చేసారు. ఇక దర్శకుడే రాసుకున్న డైలాగ్స్ బాగా నవ్వించాయి. నిర్మాణ విలువలు బ్యానర్ కు తగినట్లే రిచ్ గా ఉన్నాయి. 

78
Nithiin Robinhood movie review in telugu

Nithiin Robinhood movie review in telugu


నటీనటుల్లో ... నితిన్ ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్లిపోయాడు.ఫన్ యాంగిల్ బాగానే వర్కవుట్ చేసాడు. శ్రీ లీల పాత్ర పరిమితమైనా గ్లామర్  ప్రదర్శనలో తగ్గేదేలే అనిపించింది.

విలన్ గా  దేవ దత్త పాత్ర..హప్ కు తగ్గట్లు లేకుండా తేల్చేసారు. అన్నిటకన్నా ముఖ్యంగా డేవిడ్ వార్నర్ కనిపించింది చాలా తక్కువ సేపు సమయం.

అయితే ఆయన ఎంట్రీకి  థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక శుభలేఖ సుధాకర్, లాల్, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ వంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎప్పుడూ వారు నిరాశపరచరు. 
 

88
Nithiin Robinhood movie review in telugu

Nithiin Robinhood movie review in telugu


ఫైనల్ థాట్
కామెడీ పండాలన్నా  అందుకు తగ్గ సెటప్, స్ట్రాంగ్  బేస్ కథలో ఉండాలి. లేకపోతే సీన్స్ వస్తూంటాయి పోతూంటాయి. ఏవీ గుర్తుండవు.  ఏదైమైనా కాసిన్ని నవ్వులు కోసం ఈ సినిమా ఓ సారి చూడచ్చు.  
Rating: 2.75
---సూర్య ప్రకాష్ జోశ్యుల 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
తెలుగు సినిమా
ఐబొమ్మ
సినిమా సమీక్షలు
పవన్ కళ్యాణ్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Recommended image3
Killer Movie Review: కిల్లర్‌ మూవీ రివ్యూ.. సైఫై థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved