#MerryChristmasreview:థ్రిల్లర్ 'మెర్రీ క్రిస్మస్' రివ్యూ
అంధాధూన్ మాదిరిగానే ఇదో థ్రిల్లర్ . ఇందులో కూడా నెగిటివ్ వైబ్స్ ఉన్న స్త్రీయే కేంద్ర బిందువు. హీరోకు చెప్పుకోవటానికి ఏమీ ఉండదు.
Merry Christmas
కొంతమంది దర్శకులకు సోలోగా ఫ్యాన్స్ ఉంటారు. అలా హిందీలో డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ కు ఉన్నారు. ఆయన చేసిన అంధాధూన్ చిత్రం ఘన విజయం సాధించటంతో ఆయన సినిమాలు కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. అయితే చిన్న కాన్సెప్టులు తీసుకుని తన దైన శైలిలో తెరకెక్కించే ఆయన ఈ సారి విజయసేతుపతి ని తీసుకొచ్చి మెర్రీ కిస్మస్ అంటూ మన ముందుకు వచ్చారు . తెలుగులో సైతం డబ్బింగ్ వెర్షన్ ని వదిలిన ఆ సినిమా ఎలా ఉంది..కథేంటి..వర్కవుట్ అయ్యే కాన్సెప్టు యేనా చూద్దాం. Merry Christmas
స్టోరీ లైన్
ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చిన ఖైదీ ఆల్బర్ట్(విజయ్ సేతుపతి). అతను ముంబైలో తమ అంకుల్ యాదోం(రాజేష్) ఇంటికి వెళతాడు. అతనికి తల్లి చనిపోయిన విషయం తెలుస్తుంది. దాంతో బాధా, విసుగు చుట్టుముట్టగా ఓ రెస్టారెంట్ కు వెళ్తాడు. అక్కడ ఊహించని విధంగా మరియా(కత్రినా కైఫ్)కనిపిస్తుంది. కొద్ది క్షణాల్లోనే ఆమె ఆకర్షణలో పడతాడు.అక్కడితో ఆగకుండా ఆమెను ఫాలో అవుతూ ఇంటికెళ్ళిపోతాడు. ఫిజికల్ గా దగ్గరవుదామని మూడ్ లో ఉన్న అతనికి మరియా భర్త సూసైడ్ చేసుకుని పడి ఉండటం గమనిస్తాడు. దాంతో తను అసలే జైలు నుంచి వచ్చిన ఖైదీ అని ఆ ఆత్మహత్య తనకు చుట్టుకుంటుందేమమో అని తన గుర్తులు అన్నీ తుడిచేసుకుంటాడు. ఆ ఘటనా స్థలం నుంచి మాయమవుతాడు.
ఇక కొద్దిరోజుల తర్వాత మరియా ఏమి జరగనట్టు కూతురితో పాటు చర్చిలో కనిపిస్తుంది. దీంతో అనుమానం వచ్చిన అల్బర్ట్ ఫాలో చేస్తాడు. ఇక్కడి నుంచి ఊహించని పరిణామాలు మొదలవుతాయి. అక్కడికి వెళ్ళాక మరియా కళ్ళు తిరిగి పడిపోవడంతో రోనీ అనే వ్యక్తి ఆమెను హాస్పిటల్ కి తీసుకు వెళ్దాం సాయం పట్టమని ఆల్బర్ట్ ను అడుగుతాడు. కారు ఎక్కాక హాస్పిటల్ కి వద్దు ఇంటికి వెళ్దాం అంటుంది మరియా. మళ్లీ ఇంటికి వెళ్దాం అంటుందేంటి అనిపించి ఆల్బర్ట్ ఆలోచనలో పడతాడు. ఆల్బర్ట్ ని దింపేసి రోనీని మళ్ళీ చర్చ్ కు తీసుకు వెళ్తుంది మరియా. ఆల్బర్ట్ వెనక్కి మరియా ఇంటికి వెళ్లి అక్కడి జరుగుతున్నది చూసి షాక్ అవుతాడు. అసలు అక్కడ ఆల్బర్ట్ ఏమి చూశాడు? మరియా భర్త ఎలా చనిపోవటానికి కారణం ఏమిటి? ఎందుకు మరియా ఇలా మగవాళ్ళను ఆకర్షించి ఇంటికి తీసుకు వెళుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా మొత్తం చూడాల్సిందే.
ఎలాఉంది
ఈ సినిమా కథ ఇంతకు ముందు ఫ్రెంచ్ లో వచ్చిన ఈ సినిమానే. అయితే ఆ సినిమాకు మూలమైన ఫ్రెడరిక్ డా రాసిన ఫ్రెంచ్ నవల లా మోంటే ఛార్జ్ రైట్స్ తీసుకుని ఈ సినిమా రెడీ చేసారు. అంధాధూన్ మాదిరిగానే ఇదో థ్రిల్లర్ . ఇందులో కూడా నెగిటివ్ వైబ్స్ ఉన్న స్త్రీయే కేంద్ర బిందువు. హీరోకు చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. స్లో నేరేషన్ అనేది ప్రక్కన పెడితే కథ,కథనం ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. అయితే ఫస్టాఫ్ లో చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరగవు. సెకండాఫ్ లో నే కథలో కదిలిక వస్తుంది. దాంతో అసలే స్లోగా నడిచే కథ, దానికి తోడు ఇలా లాగటం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయితే కత్రినా కైఫ్ పాత్రపై అనుమానం వచ్చి చివరిదాకా కూర్చో బెడుతుంది. సస్పెన్స్ నవల చదువుతున్నట్లు ఉంటుంది. అయితే ఈ కథని మొబైల్స్, సోషల్ మీడియా లేని రోజుల్లో డిజైన్ చేయటం కలిసి వచ్చింది. దాంతో ఇబ్బందిగా అనిపించదు. సస్పెన్స్ కు చోటు ఇచ్చినట్లు అయ్యింది. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్, చివరి అరగంటా బాగా నచ్చుంది. స్క్రీన్ ప్లే బేసెడ్ మూవీ. నవల చదువుతున్న ఫీలింగ్ తీసుకొస్తుంది. పాత్రల పరిచయానికి ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మారిన సినిమా తో అంతంత సమయం ఏమీ జరగకుండా ,ఏదో జరుగుతుందని ఎదురుచూడటం కాస్త కష్టమైన విషయమే.
టెక్నీకల్ గా...
దర్శకుడు శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సస్పెన్స్ మెయింటైన్ చేసే ఫ్రేమ్ లుతయారీలో పండిపోయారు.మేకింగ్‌లోనే శ్రీరాం రాఘవన్ మ్యాజిక్ కనిపిస్తుంది. కథ నడిచే తీరు, క్యారక్టర్స్ డిజైన్ కొత్తగా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా బాగుంది. 1940, 1950ల కాలం నాటి హాలీవుడ్ థ్రిల్లర్స్ మ్యూజిక్ ని ఫాలో అయ్యారు. క్లైమ్యాక్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదుర్స్. ఇది బొంబాయి..ముంబైగా మారని రోజుల్లో జరిగే కథ. ఆ వాతావరణాన్ని సృష్టించడానికి టెక్నికల్ టీమ్ బాగా కష్టపడింది. ఆర్ట్ విభాగం పని తీరు బాగుంది. నేపథ్య సంగీతం పనితనం బాగా కనిపిస్తుంది.ఎడిటింగ్ కాస్తంత స్పీడు చేస్తే బాగుండేది కదా అనిపిస్తుంది.
ఎవరెలా చేసారు.
కత్రినా కైఫ్ పాత్ర సర్‌ప్రైజింగ్ గా ఉంటుంది. తనకు తగిన పాత్ర దక్కింది . విజయ్ సేతుపతిది కూడా రెగ్యులర్ హీరో పాత్ర కాదు. తన వరకూ హుందాగా, పద్ధతిగా కనిపించింది.తన నటనలో కొత్తదనం చూసే అవకాశం లేదు కానీ, పాత్ర పరంగా మాత్రం విజయ్ సేతుపతి కి కొత్తే! . రెగ్యులర్ విలనిజంని వదిలి, అప్పుడప్పుడూ ఈ తరహా ప్రయత్నాలు చేయడం అభినందించ దగిన విషయం.సపోర్టింగ్ యాక్టర్స్‌లో రాజేష్, అశ్విని కల్సేకర్, రాధికా శరత్ కుమార్ చిన్న పాత్రల్లో గుర్తుండిపోయారు.
ఫైనల్ థాట్
అంధాధూన్ స్దాయి అవునా కాదా అనేది ప్రక్కన పెడితే సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారికి ‘మెర్రీ క్రిస్మస్’ బాగా నచ్చుతుంది. స్లోనేరేషన్ కు ఇబ్బంది పడకపోతే మంచి సినిమా చూసిన ఫీల్ వస్తుంది. కత్రినా కైఫ్ ని అయితే అసలు అలా ఊహించం. అదీ ట్విస్ట్.
రేటింగ్: 2.75/5
merry christmas
నటీనటులు: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, టినూ ఆనంద్, సంజయ్ కపూర్, రాధికా ఆప్టే (అతిథి పాత్రలో) తదితరులు
ఛాయాగ్రహణం: మధు నీలకండన్
రచన: ప్రదీప్ కుమార్ ఎస్, అబ్దుల్ జబ్బర్, ప్రసన్న బాల నటరాజన్, లతా కార్తికేయన్
సంగీతం: ప్రీతం
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : డేనియల్ బి.జార్జ్
దర్శకత్వం: శ్రీరాం రాఘవన్
విడుదల తేదీ: జనవరి 12, 2024