MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • #PS1: మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌ 1' రివ్యూ

#PS1: మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌ 1' రివ్యూ

తమిళ డైరెక్టర్ మణిరత్నం  డైరెక్షన్‌లో తమిళ బాహుబలిగా రూపొందిన మూవీ పొన్నియిన్ సెల్వన్. మూవీ మణిరత్నంకు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీని ఎప్పటినుంచో తెరకెక్కించాలనుకున్నాడు. ఎట్టకేలకు మణిరత్మం డ్రీమ్ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

4 Min read
Surya Prakash
Published : Sep 30 2022, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Ponniyin Selvan 1

Ponniyin Selvan-1


మణిరత్నం సినిమాలకు మొదటి నుంచి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కావటం లేదు. అయితే ఆయనకి చాలా కాలంగా ఓ డ్రీమ్ ఉంది. తమిళంలో బాగా ప్రాచుర్యం పొందిన కల  'కల్కినవలను తెరకెక్కించాలని.  అందుకోసం ఆయన చాలా కష్ట,నష్టాలకు ఓర్చి, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నా పెద్దగా బజ్ లేదు. తమిళంకే పరిమితమైన చరిత్రను తెలుగు వారు చూడటం కష్టమనే భావన చాలా మందిలో ఉంది. అది నిజమేనా...తెలుగువారికి ఈ కథ పడుతుందా...అసలు ఆ కథేంటి..బాహుబలి స్దాయిలో కాకపోయినా సగం అయినా వర్కవుట్ అవుతుందా...రివ్యూ లో చూద్దాం. 

210


కథ :

పదో శతాబ్దం అంటే  వెయ్యి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజ్యపు రాజుల గొప్పతనం గురించి చెప్తూ ఈ కథ మొదలవుతుంది.  అప్పటి చోళ రాజ్యంను ఎలాగైనా సామ,దాన,దండోపాయాలతో  దక్కించుకునేందుకు చాలా మంది  ప్రయత్నిస్తూంటారు.  అది  రాజు ఆదిత్య కరికాలుడు(విక్రమ్‌) కు ఓ సవాల్ గా మారుతుంది. తనదైన శైలిలో తన రాజ్యాన్ని  రక్షించేందుకు వ్యూహాలు రచిస్తూంటాడు.…ఆ  క్రమంలో  రాజ్య ఆక్రమణ కోసం,వారసులను చంపటం  తన వెనక  పెద్ద కుట్ర జరుగుతోందని తలుస్తోంది. ఆ కుట్రను ఛేదించటానికి ....  కరికాలుడు... వల్లవయాయ (కార్తి)  ని  పంపుతాడు. ఈ క్రమంలో ఏమి బయిటపడింది..అసలు కుట్రకు కీలకం ఎవరు...అరుమౌజి (జయం రవి) ని వల్లవరాయ ఎలా రక్షించాడు...అనేది ఈ భాగంలోని ప్రధాన కథ. ఇందులో  కుందవాయి(త్రిష), నందిని(ఐశ్వర్య రాయ్‌) పాత్రలు  కీలకమైనవి. 
  

310

  

ఎలా ఉందంటే....

చిరంజీవి వాయస్ ఓవర్ తో మొదలయ్యే ఈ చిత్రం చారిత్రక సంఘటనలతో ముడిపడింది. ఈ చిత్రం కథకు మూలం పొన్నియిన్ సెల్వన్ అనే  తమిళనాడులో పాపులరైన  ఒక చారిత్రక నవల. దీన్ని కృష్ణమూర్తి (1899-1954) రాశారు.  ప్రముఖ చరిత్రకారులు కె.ఎ. నీలకంఠ శాస్త్రి రాసిన 'ది చోళాస్' పుస్తకం, టి.వి. సదాశివ బండారుతార్ రచించిన 'హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్', ఆర్. గోపాలన్ రాసిన 'పల్లవాస్ ఆఫ్ కంచి' అనే పుస్తకాల ఆధారంగా కల్కి ఈ నవలను రాశారు.తన మ్యాగజీన్ 'కల్కి' కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు. చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు. పరాంతక చోళునికే సుందర చోళ అనే మరో పేరు కూడా ఉంది. కల్కి రాసిన ఈ నవలలో చారిత్రక పాత్రలతో పాటు కాల్పానిక పాత్రలు కూడా ఉన్నాయి.  కల్కి నవలను  5 భాగాలుగా రాశారు. వాటిన్నటిని బేస్ చేసుకుని ఈ సినిమా తీసారు.  మణిరత్నం ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 

410


మణిరత్నం కంటే ముందు చాలామంది ఈ నవలను సినిమాగా తీయడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకు తెరకెక్కిన ఈ చిత్రరాజం....తమిళం వాళ్లకు నచ్చే అంశాలతోనే తెరకెక్కింది. అందులో వింత , విచిత్రమూ కూడా లేదు. ఇది బాహుబలి కథలా స్వంతంగా రాసుకున్న ఫిక్షన్ కథ అయితే యూనవర్శిల్ అప్పీల్ తెచ్చే అవకాసం ఉండేది. కానీ  ఈ సినిమాకు కుదరలేదు. అలాగే ఈ కథను పూర్తిగా పుస్తకం అనుసరించి చేయటం వల్లనేమో ...ట్విస్ట్ లు, వావ్ ఎలిమెంట్స్ ప్రత్యేకంగా స్క్రీన్ ప్లే లో కనపడలేదు. గ్రిప్పింగ్ కథనం నడవదు. వరసగా పాత్రల పరిచయం జరిగిపోతూంటుంది. కథ జరిగే ప్రాంతాలు మారిపోతూంటాయి. కానీ కథ కదిలినట్లు అనిపించదు. దానికి తోడు స్లోగా కథ నడవటం కూడా ఇబ్బంది పెడుతుంది.

510

ఎవరు ఈ కథలో విలన్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం ... ఓ ఇన్విస్టిగేషన్ స్టైల్ లో కథ కొంతమేర నడవటం తో ఎక్కడా ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ కనపడదు. ఉన్నంతలో ఇంటర్వెల్ తర్వత వచ్చన ప్లాష్ బ్యాక్ తో కథ నడక మొదలయ్యి..ఇంట్రస్టింగ్ గా మారింది. అప్పుడు మనకు ఫస్ట్ హాఫ్ లో జరిగిన సీన్స్ అర్దమవటం మొదలవుతాయి. అన్నిటికన్నా ప్రధాన మైన సమస్య ...గుర్తపెట్టుకునే, గుర్తుండిపోయే పాత్రలు కనపడవు. అన్ని పాత్రలు సమాన ప్రాధాన్యం అన్న రీతిలో చిత్రీకరించారు. అది నవలలో చదవటానికి బాగుంటుంది కానీ సినిమాగా ఇబ్బంది పెడుతుందనే విషయం మర్చిపోయారు. 

610


నటీనటుల ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే...

తెరపై కనిపించే నటులంతా ఆల్రెడీ అద్బుతాలు చేయగలరని ప్రూవ్ అయిన వారే. ముఖ్యంగా విక్రమ్,త్రిష,ఐశ్వర్యరాయ్ వంటి వారు గురించి చెప్పేదేముంది. అందూలోనూ మణిరత్నం వంటి దర్శకుడు చేతిలో పడ్డాక ఆ మాణిక్యాలు మరింత మెరుగు దిద్దుకుంటాయి. అదే జరిగింది.  చోళ రాజు ఆదిత్య కరికాలుడు పాత్రలో విక్రమ్‌ నటన అయితే మామూలుగా ఉండదు. ఒక గొప్ప యోధుడి గా మనకు గుర్తుండిపోతాడు. త్రిష, ..వయస్సు పెరుగుతున్నా చెక్కు చెదరని అందం..నందినిగా చేసిన ఐశ్వర్య లుక్ తోనే అభిమానులను ఆకట్టుకుంది. కార్తి కేక పెట్టించాడు. జయం రవి ...మనకు అలవాటు తక్కువ వలన ఓకే అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ ఏ పాత్ర చేసినా పాదరసంగా మారిపోతాడు.

710


టెక్నికల్‌ :
భారతదేశం గర్వించదగ్గర దర్శకులలో మణిరత్నం ఒకరు అనే విషయంలో ఎవరికీ డౌట్స్ లేవు. అయితే ఆయనకు ఈ మధ్య సక్సెస్ లేకపోవటం అభిమానులను బాధ పెడుతోంది. అయితే ఆయన ప్రతీ సినిమా అంతే శ్రద్దగా చేస్తారు. ఈ సినిమా  కూడా ఆయన స్టైల్ లో శిల్పంలా చెక్కుదామనే ప్రయత్నం చేసారు. అయితే స్క్రిప్టులో ఈ కాలం ప్రేక్షకులు ఆశిస్తున్న మరింత ఇంటెన్స్ , టెన్షన్ ఎలిమెంట్స్ వంటివి కలిపితే బాగుండేది.అయితే కల్కి వంటి పెద్ద నవలను...కుదించి, క్యారక్టర్స్ ని కొన్ని మాత్రమే తీసుకుని స్క్రిప్టు రాయటం అంటే మాటలు కాదు. అందులోనూ ఈ జనరేషన్ కు అర్దమయ్యేటట్లు ఆ కథను చెప్పాలి. అప్పట్లో అంటే కల్కి చదివిన వారు ఎక్కువమంది ఉండేవారు కాబట్టి ఈజీగా అర్దమవుతుంది. ఇప్పుడు అంటే చాలా సులభంగా అర్దమయ్యేలా చెప్పగలిగాలి. ఆ విషయంలో దాదాపు మణిరత్నం సక్సెస్ అయ్యారు. తెలుగువారికే ఆ చరిత్ర, పాత్రలు  కాస్త ఇబ్బంది పెడతాయి. ఇక ఎప్పటిలాగే  సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు తమిళ ఫ్లేవర్ తో నిండిపోయాయి.. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ సీన్స్ బలం చేకూర్చారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కూడా అద్బుతం అని చెప్పలేం కానీ  బాగుంది. తెలుగు లో డబ్బింగ్ డైలాగులు తణికెళ్ళ భరణి రాసారు. కొన్ని చోట్ల ఒరిజనల్ లోని గాఢత వర్కవుట్ అయ్యింది.  ఎడిటింగ్‌ లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

810


బాగున్నవి :

విక్రమం, ఐశ్వర్య వంటి భారీ స్టార్‌ కాస్ట్‌,
 కథను కథలా చెప్పే మణిరత్నం తీరు
 
బాగోలేనివి :

మన తెలుగువారికి పరిచయం లేని చరిత్ర
తమిళ ఫ్లేవర్‌,
 

910

ఫైనల్ థాట్...

బాహుబలిని, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని  చూసిన కళ్ళతో ఈ సినిమా చూస్తూ ఆ ఎలిమెంట్స్  ఆశిస్తే మాత్రం అంతే వేగంగా నీరశపడిపోతాము. మణిరత్నం తీసిన ఓ తమిళ హిస్టారకల్ ఫిల్మ్ అని చూస్తే నచ్చుతుంది.
 
Rating: 2.5

1010


నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌,
నటినటులు  : కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్, విక్రమ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల, విక్రమ్ ప్రభు, ప్రభు, ఆర్. శరత్ కుమార్, జయరామ్, ఆర్. పార్తిబన్, ప్రకాష్ రాజ్, రెహమాన్ తదితరులు .
కథనం: జైమోహన్‌, 
ఛాయాగ్రహణం: ఎస్‌. రవి వర్మన్‌, 
కళా దర్శకత్వం: తోట తరణి, 
కూర్పు: అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌, 
నిర్మాతలు: మణిరత్నం, శుభస్కరన్ అల్లి రాజా
 సంగీతం:     ఏఆర్ రెహమాన్
సమర్పణ: సుభాస్కరన్‌.
దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేదీ :    30 సెప్టెంబర్ 2022

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
రోజా కన్నతండ్రి కంటే ఎక్కువగా అభిమానించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
Recommended image2
మిస్సమ్మ మూవీ రివ్యూ.. భానుమతి తో పెద్ద గొడవ.. సావిత్రిని వరించిన అదృష్టం.. కమెడియన్ గా ఏఎన్నార్ నటించిన చిత్రం
Recommended image3
బిగ్‌ బాస్‌ 9 తెలుగు 11వ వారం లేటెస్ట్ ఓటింగ్‌.. డేంజర్‌ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్, ఈమె పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved