- Home
- Entertainment
- Movie Reviews
- లవ్ ఓటీపీ మూవీ రివ్యూ, రేటింగ్.. జెంజీ లవ్ స్టోరీ యూత్‌ని ఆకట్టుకుందా?
లవ్ ఓటీపీ మూవీ రివ్యూ, రేటింగ్.. జెంజీ లవ్ స్టోరీ యూత్‌ని ఆకట్టుకుందా?
జెంజీ లవ్ స్టోరీగా వచ్చిన లేటెస్ట్ మూవీ `లవ్ ఓటీపీ`. అనీస్ తేజేశ్వర్, స్వరూపిని, జాన్విక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ నేడు(శుక్రవారం) విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో చూద్దాం.

`లవ్ ఓటీపీ` మూవీ రివ్యూ
అనీష్ తేజేశ్వర్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `లవ్ ఓటీపీ`. ఇందులో స్వరూపిని, జాన్విక కలకేరి హీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, తులసి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. పుష్ప మునిరెడ్డి సమర్పణలో భవప్రిక ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. క్రేజీ లవ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం (నవంబర్ 14న) విడుదలైంది. మరి జెంజీ లవ్ స్టోరీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`లవ్ ఓటీపీ` కథ ఏంటంటే?
అక్షయ్(అనీష్ తేజేశ్వర్)కి క్రికెట్ అంటే ఇష్టం. రంజీలో రాణించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆయన ఆటని చూసి ఫిదా అవుతుంది సనా(స్వరూపిని). ఆయన వెంటపడుతుంది. వరుసగా కాల్స్ చేస్తుంటుంది. ఆమె టార్చర్ భరించలేక ఫ్రెండ్(నాట్యరంగా) సలహాతో సనాతో మాట్లాడతాడు అక్షయ్. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడతారు. శరీరకంగానూ కలుస్తారు. అయితే ఆమె అనుమానాలు అక్షయ్‌ని ఇబ్బంది పెడతాయి. కానీ ఏదైనా చెబితే తట్టుకోలేదని, ఆత్మహత్య చేసుకుంటుందని భయపడి ప్రేమిస్తున్నట్టుగా యాక్ట్ చేస్తుంటాడు. ఇంతలో ఫిజియోథెరపిస్ట్ నక్షత్ర(జాన్విక కలకేరి) పరిచయం అవుతుంది. ఆమె తీసుకునే కేరింగ్‌కి ఫిదా అవుతాడు అక్షయ్. ఓ వైపు సనాని మ్యానేజ్ చేస్తూనే నక్షత్రని లైన్‌లో పెడతారు. ఇద్దరు ప్రేమలో పడతారు. అయితే ఓ సందర్భంలో తనకు లవర్ ఉందనే విషయం నక్షత్రాకి తెలుస్తుంది. మరి ఆమె రియాక్షన్ ఏంటి? అక్షయ్ అటు సనాని, ఇటు నక్షత్రాని ఎలా మ్యానేజ్ చేశాడు. ఇద్దరిలో ఎవరిని వదులుకున్నాడు? చివరికి లవర్స్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటనేది సినిమా.
`లవ్ ఓటీపీ` విశ్లేషణ
ప్రస్తుతం సమాజంలో ప్రేమ కథలు విచిత్రంగా, విభిన్నంగా, క్రేజీగా ఉంటున్నాయి. ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం, ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్ చేయడం, ఇంకా చెప్పాలంటే ఒకరికి తెలిసే మరొకరిని లవ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రేమ వింత రూపాలను సంతరించుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పోకడలనే జెంజీగా పిలుస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చింది `లవ్ ఓటీపీ`(లవ్ ఓవర్ టార్చర్ ప్రెజర్). సినిమాలో హీరో అమాయకుడు. తండ్రి మాటని దాటడు. తండ్రి అంటే భయం. అలాంటి వ్యక్తి నెమ్మదిగా అమ్మాయితో మాట్లాడటం, అన్నీ కొత్త కొత్తగా ఎక్స్ పీరియెన్స్ అవ్వడం ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో జనరేట్ అయ్యే కామెడీ నవ్వులు పూయిస్తుంది. హీరో చేష్టలు సైతం కామెడీని పంచాయి. ఇక ఫ్రెండ్‌తో కన్వర్జేషన్.. కండోమ్ కోసం ఆయన పడే బాధలు మరింతగా నవ్విస్తాయి. హీరోయిన్‌తో లవ్, చాటింగ్, డేటింగ్ అంతా ఫన్నీగా సాగుతుంది. అదే సమయంలో రొమాంటిక్‌గా ఉంటుంది. దీంతో ఫస్టాఫ్ అంతా నవ్వించేలా ఉంటుంది. ఇక అంతలోనే మరో అమ్మాయికి హీరో పడిపోవడం, ఆమె చూపించే కేర్‌కి ఫిదా అవ్వడంతో ఫస్ట్ లవర్ బర్డన్‌గా మారుతుంది. పైగా ఆమె అనుమానాలు, పదే పదే ఫోన్ చేసి టార్చర్ చేయడం ఇబ్బందిగా ఫీలవుతుంటాడు హీరో. అదే సమయంలో మరో లవర్ ప్రేమగా చూసుకుంటున్న నేపథ్యంలో ఈమెకి ఇంప్రెస్ అవుతాడు. దీంతో ఈ ట్రాక్ చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్‌గా, హిలేరియస్‌గా ఉంటుంది. ఇక ఇంటర్వెల్‌లో ఇద్దరి మధ్య ఆయన నలిగిపోయిన తీరుతో ఇచ్చిన ట్విస్ట్ ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఫస్టాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది.
`లవ్ ఓటీపీ` లోని హైలైట్స్, మైనస్‌లు
సెకండాఫ్ లోనూ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ని కంటిన్యూ చేశారు. కానీ అది సీరియస్ వైపు వెళ్తుంది. కొంత రొమాంటిక్‌గా ఉన్నా, ఎమోషనల్ సైడ్ తీసుకుంటుంది. అదే సమయంలో కామెడీ ఉన్నా చాలా వరకు ఎమోషనల్ సైడ్ చూపించారు. హీరో స్ట్రగుల్ అవ్వడం, ఫస్ట్ లవర్‌ని అవాయిడ్ చేయడంతో ఆమె బాధపడటం, మరోవైపు సెకండ్ లవర్ ని మిస్ చేసుకోలేక తను పడే బాధ సీరియస్ గా, భావోద్వేగ భరితంగా సాగుతుంది. దీనికితోడు హీరో ఆసుపత్రిలో చేరడంతో అప్పటి వరకు అతనిపై కోప్పడే తండ్రి ఎమోషనల్‌గా మారడం, మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. అదే సమయంలో స్లోగా కథనం సాగుతుంది. మరోవైపు రెండు లవ్ స్టోరీస్‌లో కొంత కన్ ఫ్యూజ్ చేశారు. వెనకా ముందు అంటూ కథనాన్ని నడిపించిన తీరులో కొంత క్లారిటీ మిస్ అయ్యింది. కాకపోతే సినిమా ఎమోషన్స్ గా ఆ ట్రాక్‌ని తీసుకెళ్లడం హైలైట్‌గా నిలిచింది. అది ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. సెకండాఫ్‌లోనూ అదే ఫన్ మెయింటేన్ చేస్తే, మరింత క్లారిటీగా రూపొందిస్తే సినిమా అదిరిపోయేది. కొన్ని మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా జెంజీ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ యూత్‌ని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.
లవ్ ఓటీపీ నటీనటుల పర్‌ఫెర్మెన్స్
ఈ చిత్రంలో అక్షయ్‌గా అనీష్ తేజేశ్వర్ అదరగొట్టాడు. ఇన్నోసెంట్‌గా, ప్రేమలో దెబ్బతిన్న కుర్రాడిగా, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్న కుర్రాడిగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అదరగొట్టాడు. ఆయన పాత్ర కుర్రాళ్లకి బాగా ఆకట్టుకుంటుంది. ఇక సనా పాత్రలో స్వరూపిని సైతం బాగా చేసింది. హీరోని ప్రేమతో వెంటపడే పాత్రలో ఆమె అదరగొట్టింది. నక్షత్రగా జాన్విక సైతం మెప్పించింది. హీరో తండ్రిగా, ఎస్‌ఐ పాత్రలో రాజీవ్ కనకాల దుమ్ములేపారు. ఆయనకు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర పడింది. ఆయన కూడా రెచ్చిపోయి చేశారు. మరోవైపు సత్యవతి పాత్రతో తులసి మెప్పించింది. హీరో ఫ్రెండ్‌గా నట్యరంగ పాత్ర సైతం ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.
లవ్ ఓటీపీ మూవీ టెక్నీషియన్ల పనితీరు
ఈ సినిమాకి అనీష్ తేజేశ్వర్ దర్శకుడు కావడం విశేషం. హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదు, తేజేశ్వర్ ఇరగదీశాడు. రెండింటిని బ్యాలెన్స్ చేశారు. మంచి కథని ఎంచుకోవడంలోనే ఆయన సక్సెస్ అయ్యారు. అయితే చాలా వరకు కన్నడ డైలాగ్‌లు ఉంచడంతో తెలుగు వారికి ఇబ్బంది పెడతాయి. ఇక సినిమాకి ఆనంద్ రాజవిక్రమన్ సంగీతం అసెట్‌గా నిలుస్తుంది. హైలైట్ అయ్యింది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ సెకండాఫ్‌లో కొంత క్లారిటీ మెయింటేన్ చేయాల్సింది. ప్రొడక్షన్ పరంగా మూవీ రిచ్‌గా ఉంది. రాజీపడకుండా నిర్మించారు. ఫస్టాఫ్ మాదిరిగానే సెకండాఫ్‌ని హిలేరియస్‌గా తీసుకెళితే ఆద్యంతం అలరించే చిత్రమయ్యేది.
ఫైనల్ గా: `లవ్ ఓటీపీ` నేటి ట్రెండ్‌ని ఆవిష్కరించే జెంజీ లవ్ స్టోరీ. లవర్స్ కి, లవ్ బ్రేకప్ అయిన వారికి కనెక్ట్ అయ్యే మూవీ.
రేటింగ్: 2.75