MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Karate Kalyani: ఆ కారణంగా నన్ను వ్యభిచారిలా చూస్తున్నారు... కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్!

Karate Kalyani: ఆ కారణంగా నన్ను వ్యభిచారిలా చూస్తున్నారు... కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్!

నటి కరాటే కళ్యాణి వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో తాను చేసే పాత్ర దృష్ట్యా  వ్యభిచారిగా చూస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 29 2022, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Karate Kalyani

Karate Kalyani

కకరాటే కళ్యాణి పలుమార్లు వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఆమెకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. చేసింది తక్కువ చిత్రాలు అయినా గొడవల కారణంగా పాప్యులర్ అయ్యారు. అయితే సమాజం తనను తప్పుడు దృష్టితో చూస్తుందన్న కరాటే కళ్యాణి వ్యక్తిగత జీవితం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

26

కరాటే కళ్యాణి మాట్లాడుతూ... వైవాహిక జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. తాగుబోతు భర్త నరకం చూపించాడు. తిట్టడం, కొట్టడం చేశాడు. అయినా భర్త కాబట్టి భరించాను. అర్ధరాత్రి తాగొచ్చి వండి పెట్టమంటే చేశాను. వివాహ బంధం నాకు కలిసి రాలేదు. అందుకే విడాకులు తీసుకున్నాను. 
 

36

అమ్మ మరో వివాహం చేసుకో అంటుంది. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం. నాన్న మరణం తర్వాత అమ్మ, చిన్న తమ్ముడితో  ఉంటున్నాను. తమ్ముడి వయసు 22 ఏళ్ళు. వాడికి పెళ్ళైతే, నేను చనిపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. ఇంకా నీకు వయసుంది. వివాహం చేసుకో అని అమ్మ అంటుంది. సంబంధాలు చూస్తున్నాము. కానీ ఏం జరుగుతుందో చెప్పలేను. నాకు పెళ్లి మీద అంత ఆసక్తి లేదు. నిజంగా ప్రేమించే వాడైతే ఓకే. 
 

46


జనాల మాటలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సినిమాల్లో నేనే చేసే పాత్రలు చూసి అలానే ట్రీట్ చేస్తున్నారు. సమాజం నన్ను వ్యభిచారిగా చూస్తుంది. నిజానికి నేను అలంటి దాన్ని కాదు. ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. నా వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఈజీగా మాటలు అనేస్తారు. 

56


నేను కష్టపడి పైకి వచ్చాను. నన్ను నేనే పోషించుకోలేని స్థాయి నుండి ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదిగాను. కానీ సమాజం సూటి పోటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఒంటరిని అనే భావన కలుగుతుంది, అంటూ కరాటే కళ్యాణి కన్నీరు పెట్టుకున్నారు. ఈ అంశాలతో కూడిన కరాటే కళ్యాణి లేటెస్ట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. 

66


ఇటీవల కరాటే కళ్యాణ్ ఓ వివాదంతో వార్తలకు ఎక్కారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని ఆమె రోడ్డుపై పరుగెత్తించి కొట్టారు. అర్ధరాత్రి అది పెద్ద న్యూసెన్స్ అయ్యింది. ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఇద్దరిపై కేసులు పెట్టారు. అలాగే సరైన పత్రాలు లేకుండా ఒక పాప తన వద్ద పెరుగుతుందని తెలిసి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aazhi Movie Review: శరత్‌కుమార్ 'ఆళి' మూవీ రివ్యూ.. సర్వైవల్ థ్రిల్లర్ మెప్పించిందా?
Recommended image2
Vishnu Vinyasam Movie Review: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీవిష్ణు నవ్వించాడా? సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved