MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Kali Movie Review: `కలి` తెలుగు మూవీ రివ్యూ, రేటింగ్‌

Kali Movie Review: `కలి` తెలుగు మూవీ రివ్యూ, రేటింగ్‌

ప్రిన్స్, నరేష్‌ అగస్త్యా ప్రధాన పాత్రలో నటించిన మూవీ `కలి`. ఆత్మహత్యల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

5 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 04 2024, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రిన్స్ ఒకప్పుడు హీరోగా మెప్పించాడు. కానీ ఆ తర్వాత కెరీర్‌ కొంత ఒడిదుడుకులకు లోనయ్యింది. కానీ ఇటీవల బలమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. మళ్లీ హీరోగా తనని తాను నిరూపించుకునేందుకు వస్తున్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలో  హీరోగా `కలి` అనే సినిమా చేశాడు.

ఇందులో నరేష్‌ అగస్త్యా మరో ముఖ్య పాత్రలో నటించారు. నేహా కృష్ణన్‌ ఇందులో ప్రిన్స్ కి జోడీగా నటించింది. శివ శేష్‌ దర్శకత్వం వహించిన `కలి` మూవీ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. దీన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై లీలా గౌతమ్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 4)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

`కలి` సినిమా కథః
శివరామ్‌(ప్రిన్స్) బాగా సంపన్న కుటుంబంలో జన్మించిన ముప్పై ఏళ్ల కుర్రాడు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను అనుభవిస్తుంటాడు. తాను కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. అయితే అతనికి స్వార్థమనేది తెలియదు. ఎవరు ఏ సాయం అడిగినా చేస్తుంటాడు. అది నచ్చే వేద(నేహా కృష్ణన) శివరామ్‌ని ప్రేమిస్తుంది. అంతేకాదు ఇంట్లో పేరెంట్స్ ని ఎదురించి మరీ అతని కోసం వస్తుంది. శివరామ్‌ ఒంటరి. శివరామ్‌లోని బలహీనతలను అందరు క్యాష్‌ చేసుకోవాలనుకుంటారు.

అనేక కుట్రలు పన్ని ఆయన ఆస్తి అంతా కాజేసే ప్రయత్నం చేస్తుంటారు. ల్యాండ్‌ విసయంలో తమ్ముడు మోసం చేస్తాడు, ఇళ్లు ఆస్తి విషయంలో బాబాయ్‌లు మోసం చేస్తారు. దీంతో సొంత ఇంటిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి. ఇది చూసి తట్టుకోలేని వేద శివరామ్‌ని వదిలేసి కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. దీంతో ఒక్కసారిగా లైఫ్‌ అంతా తలక్రిందులైన ఫీలింగ్‌. డిప్రెషన్‌లోకి వెళ్తాడు శివరామ్‌. ఈ క్రమంలో తనలాంటి వాళ్లు ఈ సొసైటీలో బతకడం కష్టమని,

మనుషుల్లా బతకడం మరింత కష్టమని, మళ్లీ జన్మంటూ ఉంటే మనిషిలా మాత్రం పుట్టకూడదని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అంతలోనే ఇంట్లో బెల్‌ మోగుతుంది. ఆ బెల్‌ కొట్టింది ఎవరు? శివరామ్‌ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా? శివరామ్‌ జీవితానికి కలికాలానికి, కలికి ఉన్న సంబంధమేంటి? శివరామ్‌ జీవితంలో చోటు చేసుకున్న మార్పులేంటి? ట్విస్ట్ లేంటి? చివరికి `కలి` కథ ఎలాంటి మలుపులు తీసుకుని ఎలా ముగిసిందనేది సినిమా. 

35

విశ్లేషణః 
సూసైడ్స్ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో హీరో ప్రిన్స్.. తన ఫ్రెండ్‌ సూసైడ్‌ చేసుకున్నాడని, అలాగే హీరో ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నారని, వీరి మరణానికి ఫ్యామిలీ సమస్యలే కారణమని చెప్పాడు. వారి మరణాలు తనని ఎంతగానో కలిసివేసినట్టు చెప్పాడు. ఆ పెయిన్‌ తెలియజేయాలని, ఆడియెన్స్ కి చెప్పాలని, జనాల్లో ఓ అవగాహన కల్పించాలని, ఆత్మహత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియాలనే ఉద్దేశ్యంతో `కలి` సినిమాని చేసినట్టు ప్రిన్స్ తెలిపారు.

ఆయన చెప్పినట్టుగానే సమస్యలకు సూసైడ్‌ పరిష్కార కాదని, నిజానికి సూసైడే అసలు సమస్య అని, అసలు ప్రాబ్లమ్స్ అప్పుడే ప్రారంభమవుతాయని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా సూసైడ్‌ పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మంచి సందేశాన్ని ఆడియెన్స్ కి అందించాలనే ఉద్దేశ్యంతో చేసిన తొలి సినిమా ఇదే అయి ఉంటుంది. మన తెలుగులో మాత్రం ఇలాంటివి రావడం చాలా అరుదు.  రాలేదనే చెప్పాలి. ఈ మూవీ ద్వారా ఆ సందేశం ఇవ్వాలనుకునే ప్రిన్స్, దర్శకుడు శివ శేషు ప్రయత్నాన్ని, సినిమా కోసం వాళ్లు పడ్డ కష్టాన్ని అభినందించాల్సిందే. 

సినిమా కథ పరంగా మంచి సందేశం అందించే చిత్రమే అయినా, సందేశాన్ని ఇవ్వడం కోసం ఏడో డాక్యుమెంటరీలాగానో, లేక ఆర్ట్ ఫిల్మ్ లాగానో తెరకెక్కించలేదు. కమర్షియల్‌ అంశాలకు ప్రయారిటీ ఇస్తూనే ఎంగేజింగ్‌గా, సస్పెన్స్, థ్రిల్లర అంశాలను కనెక్ట్ చేస్తూ తెరకెక్కించడం విశేషం. ప్రారంభం నుంచి సస్పెన్స్ ని క్రియేట్‌ చేశారు దర్శకుడు. శివరామ్‌ పాత్ర తనని తాను పాతిపెట్టేందుకు గొయ్యి తీయడం, తనే తనని తీసుకొచ్చి గొయ్యిలో పూడ్చడం వంటి సన్నివేశాలతోనే క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు.

నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచాడు. దీనికి తగ్గట్టుగానే ప్రారంభం నుంచే బీజీఎం ఆద్యంతం ఎంగేజ్‌ చేసేలా సాగింది. సస్పెన్స్ సీన్లకి ఈ బీజీఎం తోడు కావడంతో అది రెట్టింపు అయ్యింది. శివరామ్‌ తాను ఫేస్‌ చేసిన సమస్యలను ఊహించుకుంటూ అనేక కొత్త పాత్రలను ఎంట్రీ ఇస్తూ, కథని సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. శివ రామ్‌ జీవితాన్ని ఆవిష్కరించారు. ఫ్యామిలీ ఏంటి? భార్య ఎందుకు వెళ్లిపోయింది? ఫ్యామిలీ తనని ఎలా మోసం చేయాలనుకుంటున్నారనేది లైటర్‌ వేలో టచ్‌ చేస్తూ సాగించిన తీరు బాగుంది.

ఇక నరేష్‌ అగస్త్యా పాత్ర ఎంట్రీతో సినిమా వేగం పుంజుకుంటుంది. ఆయన క్రియేట్‌ చేసే సస్పెన్స్, రేకెత్తించే ప్రశ్నలు, అనేక కొత్త అంశాలను బయటకు తీయడం, శివరామ్‌ ని ఆయన ప్రశ్నించిన తీరు, యుగాలకు సంబంధించి ఆయన వివరించే తీరు, శివరామ్‌ చేస్తున్న తప్పేంటో చెప్పేందుకు ప్రయత్నించడం,ఈక్రమంలో కాసేపు జరిగే మజిలీ ఆకట్టుకుంది.  

నరేష్‌ పాత్ర ఎలివేషన్లు, స్టయిలీష్‌ యాక్టింగ్‌ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి. ఆయన పాత్ర ద్వారా అనేక ప్రశ్నలను లేవనెత్తాడు దర్శకుడు. ప్రిన్స్ వాటిని వెతికే పనిలో ఉంటాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆయనకు లైఫ్‌పై తీపి ఏర్పడటం, ఫ్యామిలీ, పిల్లలు గుర్తుకు రావడం వంటి సీన్లు ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంటాయి. సినిమా ప్రారంభం నుంచే సీరియస్‌గా సాగుతుంది.

కామెడీకి స్కోప్‌ లేదు. కానీ నరేష్‌ అగస్త్యా పాత్ర ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఎంగేజ్‌ చేస్తుంది. ఆలోచింప చేస్తుంది. చివరగా సూసైడ్‌ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారో బయటకు తీస్తూ, దాని పరిణామాలను చూపిస్తూ భయానికి గురి చేశాడు. ఆందోళనకి గురి చేశాడు. బతకాలనే ఆశని, కోరికలను పుట్టించే సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్యా మధ్య సీన్లు రక్తి కట్టించేలా ఉన్నాయి. అయితే కథ పరంగా చాలా చిన్న పాయింట్‌, దాన్ని కొంత లాగినట్టు అనిపిస్తుంది.

అదే సమయంలో శివరామ్‌ పాత్రను చూపించిన తీరు కొంత కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది.  సూసైడ్‌ చేసుకుంటే అనంతరం జరిగే పరిణామాలు, ఫ్యామిలీ పెయిన్‌ని బలంగా చూపించాల్సింది. సూసైడ్‌ పరిష్కారం కాదని, అదే అసలు సమస్య అనే విషయాన్ని మరింత బలంగా చెబితే, దాన్ని అంతే పెయిన్‌తో, ఎమోషన్స్ తో చెబుతే అదిరిపోయేది. దీంతోపాటు కొంత లాజికల్‌గానూ వర్క్ చేయాల్సి ఉంది. కానీ సినిమాని ఆర్‌ఆర్‌ నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. 

45

`కలి` నటీనటుల పర్‌ఫెర్మెన్స్..

సినిమా కథ ప్రధానంగా రెండు పాత్రలు ప్రిన్స్, నరేష్‌ అగస్త్యా  చుట్టూతే  నడుస్తుంది. వీరి మధ్యనే కన్వర్జేషన్‌ ఎక్కువగా ఉంటుంది. శివరామ్‌గా సరికొత్త పాత్రలో ప్రిన్స్ అదరగొట్టాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. చాలా సీన్లలో ఆయనకు డైలాగులు ఉండవు. కానీ జస్ట్ ఎక్స్ ప్రెషన్స్ తోనే మెప్పించాడు. సీన్లని రక్తికట్టించాడు. నటుడిగా తనని తాను బాగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. ఇక కలి పాత్రలో నరేష్‌ అగస్త్యా మెరిశాడు. చాలా స్టయిలీస్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే మంచి నటుడిగా ఆయనకు పేరుంది. ఈ మూవీలో మరింత బెటర్‌గా చేసి అలరించాడు. అతని పాత్ర తీరుతెన్నులు, ఎలివేషన్లు అదిరిపోయాయి. ఇక వేద పాత్రలో నేహ కృష్ణన్‌ ఉన్నంతలో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు జస్ట్ అలా మెరిశాయంతే. 
 

55

`కలి` సినిమాకి టెక్నీషియన్ పనితీరు..
సినిమాకి సంగీతం హైలైట్‌. ముఖ్యంగా బీజీఎం అదిరిపోయింది. మ్యూజిక్‌ డైరెక్టర్ జీవన్‌ బాబు తన బీజీఎంతో చించేశాడు. చాలా సీన్లని అది ఎలివేట్ చేసింది. ఎంగేజ్‌ చేసింది. సినిమా నిడివి గంటన్నరనే. అయినా కొన్ని సీన్లు బోరింగ్‌గానే ఉంటాయి. ఆ విషయంలో ఎడిటర్‌ విజయ కట్స్ మరికొంత షార్ప్ చేయాల్సింది. నిషాంత్‌ కటారి, రమని జాగర్లమూడి కెమెరా వర్క్ బాగుంది. చాలా రిచ్‌గా ఉంది. సినిమా గ్రాండియర్‌గాకి విజువల్స్ కారణమని చెప్పాలి.

సినిమాకి కథ, మాటలు, కథనం, దర్శకత్వం శివ శేషు. మాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. త్రివిక్రమ్‌ని గుర్తు చేసేలా ఉన్నాయి. జీవిత సారాన్ని తెలియజేసేలా, ఎంతో పెద్ద అర్థాన్ని చిన్న పదంతో చెప్పడం, దాన్ని కూడా చాలా ఆకట్టుక చెప్పడం విశేషం. ఇందులో డైలాగులకు మంచిమార్కులు పడతాయి.

స్క్రీన్‌ప్లే విషయంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది. దర్శకుడిగా మంచి కథ ఎంచుకున్నాడు. అయితే ఇలాంటి కథని డీల్‌ చేయడం కూడా కష్టమే. కానీ మంచి ప్రయోగం చేశారు. ఆ విషయంలో అభినందించాల్సిందే. కాకపోతే మరింత ఎఫెక్టీవ్‌గా, బలమైన ఎమోషన్స్ తో ఆ విషయాన్ని చెబితే బాగుండేది. 

ఫైనల్ గాః `సూసైడ్స్‌` పై మంచి సందేశాన్ని అందించే మూవీ. అభినందనీయ ప్రయత్నం. చూడాల్సిన మూవీ.
రేటింగ్‌ః 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved