MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • `గాంధీ తాత చెట్టు` మూవీ రివ్యూ.. సుకుమార్‌ కూతురు నటించిన సినిమా ఎలా ఉందంటే?

`గాంధీ తాత చెట్టు` మూవీ రివ్యూ.. సుకుమార్‌ కూతురు నటించిన సినిమా ఎలా ఉందంటే?

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వెండితెరకు బాలనటిగా పరిచయం అవుతూ నటించిన మూవీ `గాంధీ తాత చెట్టు`. ఈ మూవీ నేడు విడుదలయ్యింది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

4 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 24 2025, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ `పుష్ప 2`తో సంచలనాలు సృష్టించారు. ఆయన భార్య తబిత ఇటీవలే నిర్మాతగా మారింది. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె బాలనటిగా వెండితెరకు పరిచయం అవుతూ `గాంధీ తాత చెట్టు` సినిమాలో నటించింది. ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, రాగ్‌ మయూర్‌,భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ నటించిన ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకురాలు.

తబితా సుకుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌, శేష సింధురావు కలిసి నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(జనవరి 24)న విడుదలైంది. మరి ఇప్పటికే దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ వంటి పలు అవార్డులు అందుకున్న ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కథః 
ఈ మూవీ గాంధీ అనే అమ్మాయి, ఆమె తాత, ఆయన పెంచిన చెట్టు చుట్టూ తిరిగే కథ. నిజామాబాద్‌ జిల్లా అడ్లూర్‌ అనే విలేజ్‌లో రామచంద్రయ్య(ఆనంద చక్రపాణి)కి గాంధీ సిద్దాంతాలు అంటే చాలా ఇష్టం. తన తండ్రి నేర్పిన గాంధీ తత్వాన్ని నమ్ముతూ బతుకుతుంటారు. తనకు పదెకరాల పొలం ఉంటుంది. అందులో వేపచెట్టు నాటుతాడు.

ఆ చెట్టునే జీవిగా భావించి దానితో మాట్లాడుతుంటాడు. తన కష్టసుఖాలు పంచుకుంటాడు. దీంతో ఆ చెట్టుతో ఆయనకు ఎంతో అనుబంధం ఏర్పడుతుంది. గాంధీపై ఉన్న ప్రేమతో తన మనవరాలుకి గాంధీ(సుకృతి వేణి) అని పేరుపెడతాడు. ఆమెకి కూడా గాంధీ గురించి, ఆయన శాంతియుత పోరాటం గురించి నేర్పిస్తాడు. ఆ చెట్టుతో ఉన్న అనుబంధం గురించి చెబుతాడు.

ఆ ఊరు మొత్తం షుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి బతుకుతుంటారు. అది మూత పడుతుంది. దీంతో ఉపాధి లేక ఊరి జనం అవస్తలు పడుతుంటారు. భూములు అమ్ముకుని పట్నం వెళ్లిపోవాలనుకుంటారు. దీన్ని ఆసరగా తీసుకుని పెద్ద కంపెనీ వాళ్లు కొత్త ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఆ ఊరు ప్రజల వద్ద భూములు లాక్కుంటారు. రామచంద్రయ్య ల్యాండ్‌ కోసం ప్రయత్నిస్తుంటారు.

కానీ ఆయన నో చెబుతాడు. కొడుకు అమ్మేయాలనుకుంటాడు. దీనికి రామచంద్రయ్య అడ్డుపడటంతో కొడుకు అవమానిస్తాడు. ఊర్లోనూ అవమానాలు జరుగుతాయి. ఇది తట్టుకోలేని రామచంద్రయ్య చనిపోతాడు. మరి ఆయన మరణంతో ఆ ఊర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? రామచంద్రయ్య పెంచిన చెట్టుని గాంధీ ఎలా కాపాడింది? తమ భూములను తిరిగి పొందేందుకు గాంధీ ఊరు ప్రజలతో కలిసి ఏం చేసింది? తన ఆలోచనలతో తన తండ్రిని ఎలా మార్చింది? గాంధీ తత్వంతో ఊరు కోసం ఏం చేసిందనేది మిగిలిన కథ. 
 

36

విశ్లేషణః 
`గాంధీ తాత చెట్టు` టైటిల్‌ తగ్గట్టుగానే ఇది ఈ మూడు పాత్రలు చుట్టూ సాగే కథ. గాంధీ అనే అమ్మాయి, తన తాత నాటిన చెట్టుని కాపాడేందుకు చేసిన శాంతియుత పోరాటమే ఈ మూవీ. ఒక మంచి ప్రకృతి సందేశాన్ని, అదే సమయంలో కార్పొరేట్‌ కుట్రను, పల్లె గొప్పతనాన్ని అంతర్లీనంగా తెలియజేసే మూవీ ఇది.

గాంధీ ఉప్పుసత్యగ్రహం వంటి శాంతియుత ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చినట్టు, గాంధీ సిద్ధాంతాలను నమ్మి ఊరు కోసం గాంధీ అనే అమ్మాయి చేసే శాంతియుత ఉద్యమం ఇందులో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే పాయింట్. సినిమా ప్రారంభంలో గాంధీ పాత్ర, ఆమె తాత, ఆయన నాటిన చెట్టు, వారి మనోభావాలను తెలియజేస్తుంది.

అదే సమయంలో ఊర్లో ఉన్న సమస్యలను చూపించారు. దీంతో సినిమా ప్రారంభమైన కాసేపటికే కథలోకి ఇన్‌వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఊర్లో చెక్కర ఫ్యాక్టరీ మూత పడటంతో చెరకునే నమ్ముకుని బతికిన ఆ ఊరు జనం పరిస్థితి రోడ్డున పడ్డట్టుగా మారుతుంది.

దీన్ని ఆసరాగా చేసుకుని మంత్రికి చెందిన వాళ్లు అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టే ప్లాన్‌ చేయడం, రైతులు భూములు అమ్ముకునేలా ఉసిగోల్పడం, దాన్ని రామచంద్రయ్య అడ్డుకోవడం వంటి సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. 
 

46

ఫస్టాఫ్‌ అంతా ఆ భూములు అమ్మడం, ఫ్యాక్టరీ ప్రతినిధి(రాగ్‌ మయూర్‌)ని వ్యతిరేకించడం, తీరా కొడుకు సైతం తండ్రిని తిట్టడం వంటి నాటకీయ పరిణామాలు రక్తికట్టిస్తాయి. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తాత పెంచిన చెట్టుని రక్షించుకునేందుకు మనవరాలు గాంధీ పడే తపన మరింతగా ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలో ఫ్యాక్టరీ ప్రతినిధిని ఎదురించేందుకు ఆమె చేసే ప్రయత్నం, ఊర్లో డబ్బులు సంపాదించేందుకు తాను కష్టపడటం వంటి సన్నివేశాలు మరింతగా ఆలోచింప చేస్తాయి. సినిమా క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్‌గా  కనెక్ట్ అవుతుంది. అదే సినిమాకి హైలైట్‌. ఫస్టాఫ్‌ కాస్త స్లోగా సాగినా, సెకండాఫ్‌ ఆ లోటుని తీరుస్తుంది. క్లైమాక్స్ కి వెళ్లేసరికి గుండె బరువెక్కిస్తుంది.

ఇందులో తనకు పెళ్లి చేయాలనుకున్న తండ్రికి గాంధీ గుణపాఠం చెప్పిన తీరు వాహ్‌ అనిపిస్తుంది. ప్రారంభం నుంచి కథ స్లోగా సాగడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. యాక్షన్‌ సినిమాలు, రేసీ స్క్రీన్‌ ప్లేతో సాగే సినిమాలవైపు ఆడియెన్స్ పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి సందేశాత్మక మూవీ, ఇలాంటి కంటెంట్‌ బేస్డ్ చిత్రం ఎక్కడమనేది కాస్త కష్టమైన విషయమే.

ఎమోషనల్‌ సీన్లని మరింతగా రక్తికట్టించేలా చేయాల్సింది. నటీనటుల యాక్టింగ్‌ విషయంలో మరికొంత కేర్‌ తీసుకుంటే బాగుండేది. సినిమాలో ఫన్ కి స్కోప్‌ ఉన్నా ఆ దిశగా ఫోకస్‌ పెట్టలేదు. కానీ ఆలోచింప చేసే మూవీ ఇది. మంచి సందేశాన్ని అందించే చిత్రమవుతుంది. సుకుమార్‌ కూతురు చేసిన మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు. 
 

56

నటీనటులుః 
గాంధీ పాత్రలో సుకుమార్‌ కూతురు సుకృతి వేణి బాగా నటించింది. తొలి మూవీ అయినా పాత్రలో ఇన్‌వాల్వ్ అయి చేసింది. మొదటి సినిమానే ఇంత బాగా చేయడం మామూలు విషయం కాదు, సినిమాని తన భుజాలపై నడిపించింది. ఆమె నటన ఆడియెన్స్ ని సర్ ప్రైజ్‌ చేస్తుంది. ఆమెతో కలిసి నటించిన పిల్లలు కూడా బాగా చేశారు.  చాలా వరకు ఆర్టిస్టులు చాలా నేచురల్‌గా చేశారు.

రామచంద్రయ్యగా ఆనంద చక్రపాణి పాత్రలో జీవించాడు. అలాగే చెట్టు వాయిస్‌ తో తనికెళ్ల భరణి కదిలించాడు. ఫ్యాక్టరీ ప్రతినిధిగా రాగ్‌ మయూర్‌ కి మరో మంచి పాత్ర దక్కింది. రఘురామ్‌,  భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ ఉన్నంతలో బాగా చేశారు. మిగిలిన పాత్రలు చాలా వరకు సహజంగా కనిపించాయి. 
 

66

టెక్నీషియన్లుః 
టెక్నీకల్‌గా మూవీ బాగుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రీ అందించిన పాటలు, బీజీఎం బాగుంది. ఆర్‌ఆర్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది. సినిమాకివి ప్లస్‌ అయ్యాయి. విశ్వ దేవబత్తుల, శ్రీజిత చెర్వుపల్లి కెమెరా వర్క్ నేచురల్ గా ఉంది. దర్శకురాలు పద్మావతి మల్లాదికిది తొలి చిత్రమైనా చాలా బాగా చేసింది. అయితే దీన్ని ఆర్ట్ ఫిల్మ్ జోనర్‌లో తీయడంతో థియేటర్‌ పరమైన లోటు కనిపిస్తుంది. ఆ బ్యాలెన్స్ చేస్తే అదిరిపోయేది.

స్క్రీన్‌ ప్లే మరింత బలంగా రాసుకోవాల్సింది. అదే సమయంలో స్పీడ్‌ పెంచితే బాగుండేది. కాకపోతే ఆమె గాంధీ తత్వాన్ని ఇందులో మేళవించిన తీరు బాగుంది. గాంధీ సిద్దాంతాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో దాన్ని ఈ రూపంలో చూపించడం, జనాలకు చెప్పే ప్రయత్నం అభినందనీయం. ఎమోషనల్‌గా సినిమాని కనెక్ట్ చేయడంలోనూ ఆమె సక్సెస్‌ అయ్యారు.

అదే సమయంలో ఆ ఎమోషనల్‌ డోస్ కూడా కాస్త పెంచాల్సింది. ఇక ఇలాంటి సినిమాలు నిర్మించాలంటే నిర్మాతలకు గట్స్ కావాలి. ఈ విషయంలో మైత్రీ, తబితా, మిగిలిన నిర్మాతలను అభినందించాలి. 

ఫైనల్‌గాః `గాంధీ చెట్టు కథ` ఎమోషనల్ గా కనెక్ట్ అవడమే కాదు ఆలోచింప చేస్తుంది. చెప్పాల్సిన కథ, చూడాల్సిన సినిమా. 
రేటింగ్‌ః 2.75
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
Epic Movie Review: ఎపిక్‌ మూవీ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
Recommended image3
Sardar 2 Movie Review: సర్దార్‌ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్‌ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved